కరుణడ చక్రవర్తి శివరాజ్ కుమార్ ‘ఘోస్ట్’ ఎలక్ట్రి ఫైయింగ్ ట్రైలర్ ను రిలీజ్ చేసిన ఏస్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి

Ace director S.S. who released the trailer of Karunada Chakraborty Shivraj Kumar's 'Ghost' electrifying trailer. Rajamouli

కరుణడ చక్రవర్తి డా శివరాజ్ కుమార్ హీరోగా పాన్ ఇండియా యాక్షన్ స్పెక్టకిల్ గా రూపొందుతోన్న చిత్రం ‘ఘోస్ట్’. దర్శకుడు శ్రీని ఘోస్ట్ చిత్రాన్ని యాక్షన్ ఫీస్ట్ గా తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ రాజకీయనాయకులు, నిర్మాత సందేశ్ నాగరాజ్ తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఘోస్ట్ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అక్టోబర్ 19న దసరా కానుకగా కన్నడ, తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషల్లో భారీ స్థాయిలో విడుదలకి సిద్ధమవుతుంది. అక్టోబర్ 1న చిత్ర బృందం ఘోస్ట్ చిత్ర ట్రైలర్ ను విడుదల చేసింది. ఏస్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి తెలుగు ట్రైలర్ ను తన సోషల్ మీడియా మాధ్యమాల్లో విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం హై ఓల్టేజ్ యాక్షన్ తో ట్రే మెండస్ బిజీఎం తో రొమాంచితంగా ఉంది. ట్రైలర్ ఇంతక ముందెన్నడూ చూడని…