శాసనసభ అనే పాన్ ఇండియా చిత్రంతో అందరికి సుపరిచితమైన సంస్థ సాప్‌బ్రో ప్రొడక్షన్స్ సంస్థ తమ ద్వితీయ చిత్రం నిర్మిస్తుంది. సాప్పని బ్రదర్స్ సమర్పణలో షణ్ముగం సాప్పని దర్శకత్వంలో తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని, రమేష్ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆది సాయికుమార్ హీరోగా, అవికాగోర్ హీరోయిన్‌గా జంటగా నటిస్తున్న ఈ చిత్రం టైటిల్ లోగోను ఉగాది పర్వదినాన హైదరాబాద్ ఆవిష్కరించారు. షణ్ముఖ అనే చిత్ర టైటిల్ లోగోను సాప్పని బ్రదర్స్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆది సాయికుమార్ మాట్లాడుతూ షణ్ముఖ అనే టైటిల్ వినగానే నాకు బాగా నచ్చింది. టైటిల్‌లో చాలా పాజిటివ్ వైబ్ వుంది. మా కథ నచ్చి ఎంతో బిజీగా వున్న కూడా రవిబసూర్ మా చిత్రానికి సంగీతం అందించడం ఆనందంగా వుంది. సినిమా కూడా చాలా రిచ్‌గా వుంటుంది. యూనిక్‌గా…