ప్రతి భారతీయుడు కచ్చితంగా చూడాల్సిన చిత్రంగా చదలవాడ శ్రీనివాసరావు గారు దర్శకత్వంలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్ పై చదలవాడ పద్మావతి గారు నిర్మాతగా వ్యవహరిస్తూ వస్తున్న చిత్రం రికార్డ్ బ్రేక్. ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్, టీజర్ మరియు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది. ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాతృదేవోభవ లాంటి గొప్ప సినిమాని అందించిన దర్శకులు అజయ్ కుమార్ గారు గ్లింప్స్ ని, టీజర్ ని నిర్మాత రామ సత్యనారాయణ గారు మరియు ట్రైలర్ ని తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ టి. ప్రసన్నకుమార్ గారు లాంచ్ చేశారు. ఈవెంట్లో తిరుపతి డిస్ట్రిబ్యూటర్ రామకృష్ణ గారు, ఆర్టిస్ట్ నాగార్జున, నిహార్ కపూర్, రగ్ధ ఇఫ్తాకర్, సత్య కృష్ణ, సంజన, సోనియా, కథా రచయిత అంగిరెడ్డి…