యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ‘దూత’ వెబ్ సిరిస్ తో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమయ్యారు. ‘దూత’ నాగచైతన్య నటించిన తొలి వెబ్ సిరిస్ కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో చాలా ఆసక్తి నెలకొంది. సూపర్ నాచురుల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ వెబ్ సిరిస్ కి క్రియేటివ్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించారు. ప్రియా భవానీ శంకర్, పార్వతి తిరువోతు, ప్రాచీ దేశాయ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై నిర్మాత శరత్ మరార్ ఈ వెబ్ సిరీస్ ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ‘దూత’ ప్రమోషనల్ కంటెంట్ చాలా క్యూరియాసిటీని పెంచింది. డిసెంబర్ 1 నుంచి ప్రైమ్ వీడియోలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో ఈ సిరీస్ ప్రసారం కానుంది. ఈ నేపధ్యంలో…