వైభవంగా వెండితెర ఆణిముత్యాల సన్మాన కార్యక్రమం

A grand ceremony to honor the silver screen gems

హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ నందు ఆదివారం నాడు జరిగిన వెండితెర ఆణిముత్యాల సన్మాన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగినది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నటకిరీటి,హాస్య నట చక్రవర్తి డా!రాజేంద్రప్రసాద్ విచ్చేసి నటీ,నటులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నటులకు అవార్డులు, సన్మాన కార్యక్రమాలు బూస్ట్ లాంటివని,ప్రేక్షకుల కరత్వాల ధనులే వారు పడిన కష్టానికి ప్రతిఫలాని అన్నారు.నాతో కలసి నటించిన నటులకు నా చేతుల మీదుగా సన్మానం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నానని,ఈ అవకాశం ఇచ్చిన మాదల నాగూర్ కు మన ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ 24 క్రాఫ్ట్ చైర్మన్ డాక్టర్ రాజేంద్ర జె ఎన్ కు ధన్యవాదాలు తెలుపుతున్నాని అన్నారు. అదేవిధంగా సీనియర్ హీరో భానుచందర్ మాట్లాడుతూ సీనియర్ నటులను గౌరవించి సన్మానించుకోవటం అనేది చాలా గొప్ప విషయం అని ఇలాంటి…