* రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డుల పంపిణీ * జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమం వైభవంగా సాగింది. ఎన్నడూ లేని స్థాయిలో టాలీవుడ్ తారలు తళకులీనారు. ఈ ఏడాది ప్రకటించిన నేషనల్ అవార్డుల్లో టాలీవుడ్‌కు వివిధ విభాగాల్లో అవార్డులు లభించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డుల చరిత్రలో తొలిసారి.. ఒక టాలీవుడ్ హీరోకు ఉత్తమ హీరో అవార్డు లభించడం విశేషం. ‘పుష్ప: ది రూల్’ చిత్రంలో అల్లు అర్జున్ నటనకు ఫిదా అయిన జ్యూరీ అతడిని ఉత్తమ కథానాయుకుడిగా ఎంపిక చేశారు. మంగళవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా అల్లు అర్జున్ ఈ అవార్డును అందుకున్నాడు. ‘పుష్ప’ సినిమాకు గాను ఉత్తమ సంగీత దర్శకుడిగా…