ఈ మధ్య కాలంలో డాన్స్ ఇన్స్టిట్యూట్స్ వార్షికోత్సవాలు అని గెస్ట్ గా రమ్మని ఆహ్వానిస్తుంటే వెళ్లడం మానేసాను! ఎందుకంటే ఆ పిల్లలకు మేకప్ మమ అనిపిస్తారు! వాళ్ళు ధరించే అద్దె డ్రెస్ లు సెట్ కావు! ఇక ప్రదర్శన చూస్తే వామ్మో అనిపిస్తుంది. సమన్వయం ఉండదు ఇంక రిథమ్ ఏముంటుంది? చాలా బాధ అనిపిస్తుంటుంది! అందుకే ఆ డేట్ వీలు పడదని చెప్పి తప్పించుకుంటాను! కానీ, నిన్న రవీంద్రభారతిలో SLB కూచిపూడి కళానిలయం వారి 18వ వార్షికోత్సవ వేడుకలకు వెళ్ళాను! మనసు పులకరించిపోయింది! చిన్నారులు ఎంతో చక్కగా ఆయా అంశాలు ప్రదర్శించి ఆకట్టుకున్నారు! ఏర్పాట్లు కానివ్వండి, అలంకరణ, నిర్వహణ అంతా మైండ్ బ్లోయింగ్ అంటే నమ్మండి! గతంలో కూడా శ్రీ లలిత భవాని (SLB) వారి కార్యక్రమానికి వెళ్ళాను! అప్పుడూ అంతే వైభవం! నిన్న అంతకు మించి…