‘హిడింబ’ ట్రైలర్ అదిరిపోయింది.. సినిమా బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్

‘హిడింబ’ ట్రైలర్ అదిరిపోయింది.. సినిమా బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అశ్విన్ బాబు కథానాయకుడిగా అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ (SVK సినిమాస్) బ్యానర్‌ పై గంగపట్నం శ్రీధర్ నిర్మిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘హిడింబ’. ఎకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అనిల్ సుంకర ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. రెండు విభిన్నమైన టైమ్‌లైన్స్‌లో కంటెంట్ సెట్ చేయడం, విజువల్స్ గ్రాండ్‌ గా ఉండటం, కథ, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవల్ లో ఉండటం సినీ అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. 1908లో బంగాళాఖాతంలో బ్రిటీష్‌వారు భారతీయ ఖైదీలను పడవలో తీసుకెళ్తున్న విజువల్ తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. తర్వాత ప్రస్తుతానికి వస్తుంది. హైదరాబాద్ నగరంలో మిస్సింగ్ కేసులు హాట్ టాపిక్‌గా మారాయి. పోలీసులు , హోం…