‘స్పార్క్L.I.F.E’ టీజ‌ర్ విడుద‌ల

‘స్పార్క్L.I.F.E’ టీజ‌ర్ విడుద‌ల

విక్రాంత్‌, మెహ‌రీన్ పిర్జాదా, రుక్స‌ర్ థిల్లాన్ హీరో హీరోయిన్స్‌గా భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ప్రెస్టీజియ‌స్ మూవీ ‘స్పార్క్L.I.F.E’. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. విక్రాంత్ హీరోగా న‌టిస్తూ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. అనౌన్స్‌మెంట్ రోజు నుంచి అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోన్న ఈ సినిమా టీజ‌ర్‌ను బుధ‌వారం చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ కార్య‌క్ర‌మంలో… న‌టుడు గురు సోమ‌సుంద‌రం మాట్లాడుతూ “నాకు చాలా సంతోషంగా ఉంది ఈ సినిమాలో చేయ‌డం. విల‌న్‌గా న‌టించాను. అంతే కాదు, నేనే ఈ సినిమాలో డ‌బ్బింగ్ చెప్పాను. విక్రాంత్ రెడ్డితో ప‌నిచేయ‌డం చాలా మంచి ఎక్స్ పీరియ‌న్స్. నేను కొచ్చిలో ఉన్న‌ప్పుడు వ‌చ్చి న‌న్ను క‌లిశారు. నేనే విల‌న్‌గా చేయాల‌ని ఫిక్స్ అయిన‌ట్టు తెలిపారు. చాలా మంచి టీమ్‌తో క‌లిసి ప‌నిచేశాను. తెలుగు ఇండ‌స్ట్రీ చాలా పెద్ద ఇండ‌స్ట్రీ.…