‘సీతారామపురం’’ పేరుతో వచ్చిన చిత్రాలన్నీ ఘన విజయం సాధించాయి: ‘సీతారామపురంలో ఒక ప్రేమజంట’ ప్రీ`రిలీజ్‌ వేడుకలో అతిథుల ఆకాంక్ష

seetharampuramlo oka premajanta

శ్రీ ధనలక్ష్మీ మూవీస్‌ పతాకంపై బీసు చందర్‌ గౌడ్‌ నిర్మిస్తున్న ప్రేమ కథాచిత్రం ‘సీతారామపురంలో ఒక ప్రేమ జంట…’ ప్రపంచ వ్యాప్తంగా నవంబర్‌ 18న అత్యధిక థియేటర్లలో విడుదలకు సిద్దమవుతోంది. ఎం. వినయ్‌ బాబు దర్శకత్వంలో రణధీర్‌, నందినీ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ భారీ బడ్జెట్‌ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 18న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఈ రోజు ప్రసాద్‌ ల్యాబ్స్‌లో ప్రీ `- రిలీజ్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజి ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ…‘‘నిర్మాత నాకు బాగా కావాల్సినవాడు. ఎటువంటి సినిమా నేపథ్యం లేకున్నా తన కొడుకుని హీరోగా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని నిర్మించే ధైర్యం చేయడం గొప్ప విషయం. హీరో రణధీర్‌కు ఒక మంచి హీరోగా ఎదడానికిగల అన్ని క్వాలిటీస్‌ ఉన్నాయి.…