”శాకుంతలం సినిమా చూశాను. అత్యంత అద్భుతంగా అనిపించింది. ఆ క్షణం నుంచి వీడియో సాంగ్స్ విడుదల చేసేద్దామా అన్నంత ఆత్రుతగా ఉంది. ఆ విషయాన్నే గుణశేఖర్గారితో పంచుకున్నాను. సినిమాలో నాకు అత్యంత ఇష్టమైన పాట మల్లికా మల్లికా. ఈ పాటను వీడియోలో చూడటం చాలా ఆనందకరమైన విషయం. ప్రజలందరికీ ఇప్పుడు మల్లికా మల్లికా వీడియో సాంగ్ అందుబాటులోకి తీసుకొస్తున్నాం” అని అన్నారు ప్రముఖ కథానాయిక సమంత. సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా శాకుంతలం. దిల్రాజు సమర్పిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందుతోంది. గుణ టీమ్ వర్క్స్ నిర్మించింది. ఈ ఏప్రిల్ 14న విడుదల కానుంది శాకుంతలం. నీలిమ గుణ నిర్మాత. గుణశేఖర్ రచించి, దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలోని… మల్లికా మల్లికా మాలతీ మాలికా చూడవా చూడవా ఏడినా ఏలికా, హంసికా హంసికా జాగులే…