”వాలెంటైన్స్ నైట్” ఖచ్చితంగా అందరికీ నచ్చే సినిమా: ప్రెస్ మీట్ లో ”వాలెంటైన్స్ నైట్” టీమ్

''వాలెంటైన్స్ నైట్'' ఖచ్చితంగా అందరికీ నచ్చే సినిమా: ప్రెస్ మీట్ లో ''వాలెంటైన్స్ నైట్'' టీమ్

సునీల్, చైతన్య రావు మదాడి ప్రధాన పాత్రలలో స్వాన్ మూవీస్ సమర్పణలో ఫన్ సాగ బ్యానర్ పై అనిల్ గోపిరెడ్డి దర్శకత్వంలో యూనిక్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిత్రం ”వాలెంటైన్స్ నైట్’. తృప్తి పాటిల్, సుధీర్ యాళంగి మహీంధర్ (MO) నారల నిర్మాతలు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్ వచ్చింది. జనవరి 26న ఈ చిత్రం విడుదల కానున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ప్రెస్ మీట్ లో చైతన్య రావు మాట్లాడుతూ.. నిర్మాతలు సుధీర్, మహీంధర్ గారు ఈ కథని బలంగా నమ్మి ఎక్కడా రాజీపడకుండా సినిమాని నిర్మించారు. దర్శకుడు అనిల్ సినిమాని చాలా కొత్తగా తెరకెక్కించారు. ఇందులో చాలా జోనర్స్ వున్నాయి. ఒకే సినిమాలో దాదాపు పది కథలు చూడొచ్చు. ఒక కథకి మరో కథకి ఎక్స్ లెంట్…