కాంబినేషన్ ని కాదు.. కథని నమ్మి చేసిన సినిమా ‘రామబాణం’. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత మాచో స్టార్ గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్ కలయికలో వస్తున్న హ్యాట్రిక్ ఫిల్మ్ ‘రామబాణం’. వరుస విజయాలతో దూసుకుపోతున్న అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో గోపీచంద్ సరసన నాయికగా డింపుల్ హయతి నటించగా, జగపతి బాబు, కుష్బూ ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ప్రచారం చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రేపు(మే 5) ఈ చిత్రం భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా విలేఖర్లతో ముచ్చటించిన కథానాయకుడు గోపీచంద్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. రామబాణం ఎలా…