ఏఎమ్ఎఫ్, కోన సినిమా బ్యానర్లపై అనిల్ మోదుగ, శివ కోన సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం “రాజు గారి కోడిపులావ్” కుటుంబ కథా ‘వి’చిత్రం అనేది శీర్షిక. ఈ సినిమాకు శివ కోన దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన “సునో సునామి” ఫస్ట్ సింగిల్ ప్రోమో ఆకట్టుకోగా… ఈరోజు ఫుల్ సాంగ్ విడుదలైంది. క్యాచీ పదాలతో శ్రోతల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. లవ్ రొమాంటిక్ సాంగ్ గా తెరకెక్కుతున్న ఈ పాటకు ‘మల్లిక్ వల్లభ’ చరణాలు అందించగా.. ‘ప్రవీణ్ మని’ సంగీత సారథ్యంలో ప్రముఖ గాయకులు ‘ఎన్సీ కారుణ్య, వైశాలి శ్రీ ప్రతాప్’ ఆలపించారు. “ఔరౌర కన్నె కోడి.. ఓ వయ్యారి వన్నెలాడి. ఇష్టపడినా లేడీ” అంటూ సాగే ఈ పాట సోషల్ మీడియా లో విజయవంతంగా దూసుకుపోతుంది. రాజుగారి కోడిపులావ్ చిత్రం నుంచి…