మెగాస్టార్ చిరంజీవి తన వింటేజ్ స్టైలిష్ మాస్ అవతార్ లో కనిపించడం ఎప్పుడూ కన్నుల పండువగా ఉంటుంది. దర్శకుడు మెహర్ రమేష్ మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్’ లో మెగాస్టార్ చిరంజీవిని పవర్-ప్యాక్డ్ రోల్ లో ప్రజంట్ చేస్తున్నారు. ఈ సినిమా టీజర్ ను ఈరోజు లాంచ్ చేశారు. 33 మందిని దారుణంగా చంపిన వ్యక్తి కోసం కోల్‌కతా పోలీసులు వెతుకుతున్నారని చెప్పే వాయిస్ ఓవర్ తో టీజర్ ప్రారంభమవుతుంది. చిరంజీవి ఇంట్రడక్షన్ సీక్వెన్స్ లో తన స్వాగ్, స్టయిల్ తో అదరగొట్టారు. డెన్‌లో గూండాలను చితకొట్టి “షికార్ కొచ్చిన షేర్ ని బే…” అని చెప్పిన డైలాగ్ పవర్ ఫుల్ గా పేలింది. “ఈ స్టేట్ డివైడ్ అయినా అందరూ నా వాళ్లే… అన్ని ఏరియాలు అప్నా హై… నాకు హద్దుల్లేవ్… సరిహద్దుల్లేవ్……