ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘బలగం’ సినిమా టీంకు ఘనంగా సత్కారం జరిగింది. ప్రసాద్ ల్యాబ్ లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ఈ సినిమా ఖచ్చితంగా జనాదరణ పొందుతుందని నాకు నమ్మకం ఎప్పటి నుంచో ఉందని అన్నారు. ఒకానొక సమయంలో ఓటిటి కి ఇద్దామని అనుకున్నప్పటికీ థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించామని చెప్పారు. ఈ సినిమా ను థియేటర్లలోనే చూసే ఫీలింగ్ వేరని అన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింభించే సినిమా అని అన్నారు. దిల్రాజు ప్రొడక్షన్స్ పై శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించిన సినిమా ‘బలగం’. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ముఖ్యపాత్రలు పోషించారు. వేణు ఎల్దండి దర్శకత్వం వహించారు. మార్చి 3న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ…