డైనమిక్ హీరో విశ్వక్ సేన్ రొమాంటిక్ కామెడీ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘దాస్ కా ధమ్కీ’. విశ్వక్ సేన్ ఈ చిత్రానికి కథానాయకుడు,దర్శకుడు,నిర్మాత కూడా. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ కు జోడిగా నివేదా పేతురాజ్ నటించింది. ఉగాది కానుకగా నిన్న (బుధవారం) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన ‘దాస్ కా ధమ్కీ’ అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి ఎక్స్ టార్డినరీ ఓపెనింగ్స్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ సందర్భంగా ‘దాస్ కా ధమ్కీ’ బ్లాక్ బస్టర్ విశేషాలని విశ్వక్ సేన్ మీడియాతో పంచుకున్నారు. విశ్వక్ సేన్. ‘దాస్ కా ధమ్కీ’ సక్సెస్ ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ? – ‘దాస్ కా ధమ్కీ’ మేము అనుకున్నదాని కంటే పెద్ద సక్సెస్ అయ్యింది. నా కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. దాదాపు…