దర్శకుడి సెన్సాఫ్ హ్యూమర్ !!

Pooja-Hegde-Vijay-Beast

చిత్రం : ‘బీస్ట్’ రచన- దర్శకత్వం : నెల్సన్ తారాగణం : విజయ్, పూజా హెగ్డే, సెల్వ రాఘవన్, యోగిబాబు, అంకుర్ అజిత్ వికల్, రెడిన్ కింగ్స్లే తదితరులు సంగీతం అనిరుధ్, ఛాయాగ్రహణం : మనోజ్ పరమహంస బ్యానర్ : సన్ పిక్చర్స్ నిర్మాత : కళానిధి మారన్ విడుదల : ఏప్రెల్ 13, 2022 ఇళయ దళపతి విజయ్ పానిండియా ‘మాస్టర్’ తర్వాత మరో పానిండియాగా ‘బీస్ట్’ దేశ విదేశ ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని ఒరిజినల్ దర్శకుడు మురుగదాస్ పారితోషికం తగ్గించుకోని కారణాన వూస్టింగ్ అయి, అతడి స్థానంలో దర్శకుడుగా నెల్సన్ బాధ్యతలు చేపట్టాడు. తమిళనాడులో విజయ్ సినిమాలు వరుసగా హిట్టవుతూ వచ్చాయి. అయితే పానిండియా విడుదలగా ‘మాస్టర్’ విఫలమైంది. ఇతర తమిళ పానిండియాలు కూడా విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ‘బీస్ట్’ పానిండియా తమిళ…