చక్రవ్యూహమ్ ది ట్రాప్ అమెజాన్ ప్రైమ్ లో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్న పాన్ ఇండియా చిత్రం. తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం అనే నాలుగు భాషల్లో సినిమా ప్రేక్షకులను మంచి అనుభూతిని అందిస్తూ.. ఎంతోగానో అలరిస్తున్న ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి పెరుగుతోంది. గ్రిప్పింగ్ కథతో, టైట్ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతూ ప్రైమ్ వీడియోలో టాప్ 10 సినిమాల లిస్ట్‌లో ట్రెండింగ్‌లో 2వ స్థానం దక్కించుకోవడం బట్టి చూస్తుంటే ఈ సినిమాను ప్రేక్షకులు ఎంతలా ఓన్ చేసుకున్నారో అర్థం అవుతుంది. థ్రిల్లింగ్ అంశాలను కోరుకునే సినిమా లవర్స్ తప్పకుండా చూడాల్సిన చిత్రాల లిస్ట్ లో చక్రవ్యూహం స్థానం సంపాదించుకుంది. చక్రవ్యూహం సినిమా స్టార్టింగ్ నుంచి అనేక ఎత్తులు, కుట్రలతో నేరస్తుల చుట్టు ఒక ఆసక్తికరమైన వలయాన్ని అల్లుతుంది. ప్రతీ సీన్ ఎంతో…