“నాటు నాటు” పాటకు అందించిన సాహిత్యానికి గాను ఆస్కార్ అవార్డు గెలిచి తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన లిరిసిస్ట్ చంద్రబోస్‌గారిని ఆయన నివాసంలో ఘనంగా సన్మానించారు తెలంగాణా ఫిల్మ్ ఛాంబర్ చైర్మన్ లయన్ డా.ప్రతానిరామకృష్ణగౌడ్ . ఈ సందర్భంగా దుబాయ్‌లో జరగనున్న టిఎఫ్‌సిసి నంది అవార్డుల వేడుకకు చంద్రబోస్‌గారిని ఆత్మీయంగా ఆహ్వానించారు. దుబాయ్ వేదికపై అక్కడి దుబాయ్ ప్రిన్స్ చేతుల మీదుగా చంద్రబోస్ కి టిఎఫ్‌సిసి నంది అవార్డు అందించనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ.. “చంద్రబోస్‌గారితో నాకు ఎప్పటినుంచో మంచి అనుబంధం ఉంది.. నేను నిర్మించి దర్శకత్వం వహించిన జోడి నెంబర్.1, సర్దార్ పాపన్న మరియు అనేక చిత్రాలకు ఆయన సాహిత్యాన్ని అందించారు.. తన సాహిత్యంతో ఆస్కార్ గెలుచుకుని తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన చంద్రబోస్‌గారికి నా…