అల్లరి నరేష్ ‘ఉగ్రం’ టీజర్ వచ్చేసింది!

అల్లరి నరేష్ 'ఉగ్రం' టీజర్ వచ్చేసింది!

-‘ఉగ్రం’ టీజర్ నెక్స్ట్ లెవల్ లో వుంది. సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలి: టీజర్ లాంచ్ ఈవెంట్ లో నాగ చైతన్య అల్లరి నరేష్‌ హీరోగా విజయ్‌ కనకమేడల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఉగ్రం’. ‘నాంది’ వంటి సూపర్ హిట్‌ తర్వాత ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న రెండో చిత్రమిది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. సమ్మర్‌లో సినిమాను విడుదలకు సన్నాహాలు చేస్తున్న మేకర్స్ ఈరోజు టీజర్‌ను విడుదల చేసి ప్రమోషన్స్‌ను ప్రారంభించారు. టీజర్ లాంచ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరో నాగ చైతన్య టీజర్ ని లాంచ్ చేశారు. నరేష్ పవర్ ఫుల్ పోలీసుగా ఎంట్రీ ఇవ్వడం , అడవిలో చట్టాన్ని ఉల్లంఘించేవారిని కొట్టడం.. వంటి ఆసక్తికరమైన సన్నివేశాలతో టీజర్ ప్రారంభమైయింది.…