ప్రముఖ నిర్మాణ సంస్థ స్వప్న సినిమా నిర్మాణంలో టాలెంటెడ్ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రలలో రూపొందిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘అన్నీ మంచి శకునములే’. మిత్ర విందా మూవీస్ తో కలిసి ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమా పై అంచనాలని పెంచింది. మే 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ హీరోయిన్ గౌతమి మీడియాతో ‘అన్నీ మంచి శకునములే’ విశేషాలని పంచుకున్నారు. ఇది మీకు సెకండ్ ఇన్నింగ్ ఆ.. థర్డ్ ఇన్నింగ్ ఆ? ఎలా అయినా అనుకోవచ్చు. ఇన్నింగ్ ఉండటమే సంతోషం.(నవ్వుతూ) ఇప్పటికీ షూటింగ్, సినిమాని ఎంజాయ్ చేయగలుగుతున్నారా ? ఎంజాయ్ చేయగలుగుతున్నాను కాబట్టే ఇంకా చేయగలుగుతున్నాను.…