చైతన్య రావ్, లావణ్య జంటగా నటించిన సినిమా “అన్నపూర్ణ ఫోటో స్టూడియో”. మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్ ఆదిత్య ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని బిగ్ బెన్ సినిమాస్ పతాకంపై యష్ రంగినేని నిర్మించారు. చెందు ముద్దు దర్శకత్వం వహించారు. “అన్నపూర్ణ ఫోటో స్టూడియో” సినిమా జూలై 21న విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా చిత్ర టీజర్ ను స్టార్ డైరెక్టర్ మారుతి విడుదల చేశారు. ఈ సందర్భంగా.. దర్శకుడు మారుతి మాట్లాడుతూ – ఓ పిట్టకథ సినిమా స్క్రీన్ ప్లే చూసినప్పటి నుంచి చెందు ముద్దు వర్కింగ్ స్టైల్ ఇంప్రెస్ చేసింది. అప్పటి నుంచి తను నాతో ట్రావెల్ అవుతున్నాడు. త్వరలో మా సంస్థలో సినిమా చేయబోతున్నాడు. “అన్నపూర్ణ ఫోటో స్టూడియో” సినిమాను కూడా చెందు 80, 90 బ్యాక్ డ్రాప్ లో…