ప్రపంచ ‘ట్రయత్‌లాన్‌ ’కు వరుసగా మూడుసార్లు ఎంపికైన తొలి భారతీయుడు మన తెలుగువాడు మన్మధ్ రెబ్బ..

Our Telugu man Manmad Rebba is the first Indian to be selected for the World Triathlon three times in a row.
Spread the love

స్పోర్ట్స్‌ అంటే మనకు గుర్తుకు వచ్చే మొదటి ఆట క్రికెట్‌. ఆ తర్వాత వాలీబాల్‌, ఫుట్‌బాల్‌, హాకీ.. ఇలా ఓ అరడజను మాత్రమే టక్కున గుర్తుకు వస్తాయి. కానీ ప్రపంచంలో మరిన్ని స్పోర్ట్స్‌ ఉన్నాయి. వాటిలో అత్యంత క్లిష్టమైన రేస్‌ ‘ట్రయత్‌లాన్‌’. ‘ట్రయత్‌లాన్‌’ అంటే ఈత కొట్టడం.. సైకిల్‌ తొక్కడం.. పరుగెత్తడం అనే మూడు స్పోర్ట్స్‌ యాక్టివిటీస్‌ కంబైన్డ్‌గా ఉంటాయి. ఇందులో కూడా అనేక ఛాంపియన్‌ షిప్‌లు ఉంటాయి. అన్నింటిలోకి అత్యంత క్లిష్టమైన ‘అల్ట్రామాన్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ హవాయి ట్రయత్‌లాన్‌’ అనే రేస్‌లో వరుసగా 2017,18,19 సంవత్సరాల్లో అర్హత సంపాదించిన ఏకైక భారతీయుడు, మన తెలుగువాడు,హైదరాబాద్ కు చెందిన మన్మధ్ రెబ్బ. ఇక్కడ ఆర్కిటెక్ట్‌ పూర్తి చేసి, యూఎస్‌లో కన్స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్‌ కోర్సు చేయటానికి వెళ్లిన ఆయన కోర్సు అనంతరం అక్కడే ఉద్యోగం చేస్తుండగా ఈ స్పోర్ట్స్‌ గురించి సహచరులు చెప్పడంతో అటువైపుగా దృష్టి సారించారు. 2013లో 5కె రన్‌తో మొదలు పెట్టిన ఆయన ప్రస్తుతం భారతదేశం నుంచి ఈ స్పోర్ట్స్‌లో అగ్రశ్రేణిగా నిలిచి అనేక అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నారు. తాను సంపాదించిన అనుభవం తన తర్వాత తరాలకు కూడా ఉపయోగపడాలని ఈ స్పోర్ట్స్‌ పట్ల అవగాహన కల్పించాలని, వీలైతే హదరాబాద్‌కు వచ్చి ఇక్కడ ఒక కోచింగ్‌ సెంటర్‌ పెట్టి మన భారతీయుల సత్తాను ప్రపంచానికి చాటేలా చేయాలని ఆశిస్తున్నారు మన్మధ్ రెబ్బ. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు.

వివరాలు ఆయన మాటల్లోనే… ‘‘నా పేరు మన్మధ్ రెబ్బ.. మాది హైదరాబాద్. ఉన్నత చదువుల కోసం, ఉపాధి కోసం అమెరికా వెళ్లాను. అక్కడ ఈ ‘ట్రయత్‌లాన్‌’ అనే స్పోర్ట్స్‌ గురించి మిత్రుల వల్ల తెలిసింది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న మయామీలో నవంబర్‌ 10 2013లో మొదటి ట్రయత్‌లాన్‌ చేశాను. దాని తర్వాత ఫుల్‌ ఐరన్‌మ్యాన్‌ 224 కి.మీ. దూరం పూర్తి చేశాను. దాని తర్వాత అల్ట్రామ్యాన్‌ 517 కి.మీ రేస్‌. అల్ట్రామ్యాన్‌ అంటే ఐరన్‌మ్యాన్‌ కన్నా లాంగెస్ట్‌ స్కిల్స్‌. ఇందులో 10 కి.మీ. ఈతకొట్టి, 421 కి.మీ.సైకిల్‌ తొక్కి, 84.5 కి.మీ. పరుగెత్తాలి.. అది కూడా మూడు రోజుల్లో కంప్లీట్‌ కావాలి. ప్రతి రోజూ 12 గంటలు ఉంటుంది. 12 గంటలు బ్రేక్‌. 2017 ఫిబ్రవరిలో తొలిసారి ఇందులో పాల్గొన్నాను. దీంతో నేను హవాయిలో జరిగే వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌కు క్వాలిఫై అయ్యాను. ప్రపంచ వ్యాప్తంగా 40 మంది రేసర్లు ఉంటారు. ఈ రేస్‌కు క్వాలిఫై అయిన మొట్ట మొదటి ఇండియన్‌ను నేనే. ఈ క్రమంలో ప్రోపర్‌ డైట్‌ అనేది నాకు ఛాలెంజ్‌గా మారింది. కష్టపడి దాన్ని అధిగమించాను.
అందరికీ మారథాన్‌ అంటే తెలుసు కానీ.. ‘ట్రయత్‌లాన్‌’ అంటే తెలియదు. ఇదొక కొత్త స్పోర్ట్‌. అయితే ఇక్కడ దానికి తగ్గ సౌకర్యాలు లేకపోవడం వల్ల ఇది మన దేశంలో ఇంప్రూవ్‌ కావడం లేదు. 2017`18`19 మూడు సంవత్సరాలు వరుసగా అల్ట్రామ్యాన్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ చేశాను. ఇలా కంటిన్యూగా మూడుసార్లు చేసిన తొలి భారతీయుణ్ణి నేనే. కోవిడ్‌ సమయంలో నా స్నేహితులు ఆక్సిజన్‌ సిలిండర్స్‌ కోసం డొనేషన్స్‌ కలెక్ట్‌ చేస్తుండేవారు. నేను కూడా ఓ వంద సిలిండర్స్‌కి కంట్రిబ్యూట్‌ చేద్దామని యు.ఎస్‌లో ‘కీస్‌`100’ అనే రేస్‌ ఉంది. అంటే 160 కి.మీ. నేను 160 కి.మీ. పరుగెత్తాలని డిసైడ్‌ అయ్యాను. అలా నా ఆల్ట్రామ్యాన్‌ జర్నీ స్టార్ట్‌ అయ్యింది. ఆ తర్వాత ‘బ్యాడ్‌ వాటర్‌`135’ అనే ఇంకో సిరీస్‌ ఉంది. ఇందులో 217 కి.మీ. పరుగెత్తాలి. ఇది కాలిఫోర్నియాలోని డెత్‌ వ్యాలీలో జరుగుతుంది. అక్కడ దాదాపు 56 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత వరకూ వెళ్లింది. ఈరేస్‌ జులైలో జరుగుతుంది. అక్కడ జులై అంటే పీక్‌ సమ్మర్‌. నేను రేస్‌లో పాల్గొన్నప్పుడు 50 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. 39 గంటల్లో దాన్ని కంప్లీట్‌ చేశాను. ఇది ఎంత టఫ్‌ అంటే.. మనకు తెలిసి ఎవరెస్ట్‌ ఎక్కడమే పెద్ద సాహసం. ఇప్పటి వరకూ 6 వేల
మందికి పైగా ఎవరెస్ట్‌ను ఎక్కారు. కానీ ఈ ‘బ్యాడ్‌వాటర్‌`135’రేస్‌ ని ఇప్పటి వరకూ కేవలం 1,034 మంది మాత్రమే పూర్తి చేశారు.
ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మన భారతీయులకు చాలా పొటెన్షియాలిటీ ఉంది. కారణం మనం సాధారణమైన పరిస్థితుల నుంచి రాలేదు. బ్రిటీష్‌ వారు, నిజాం రూలింగ్‌ ఇలా అనేక పోరాటాల్లో పాల్గొన్న తెగువ, ధైర్యం మన సొంతం . మనకున్న స్టామినాను సరైన రూట్‌లో ఉపయోగిస్తే ఎన్నో వండర్స్‌ చెయ్యొచ్చు.
నేను సంపాదించిన నాలెడ్జ్‌, రికార్డ్‌లు నాతోనే ఆగిపోకూడదు. మరింత మంది ఈ రంగంలో తమ సత్తా చాటుకోవాలనేది నా కోరిక. మనం సంప్రదాయంగా మనలో ఉన్న పొటెన్షియల్ ని వదిలి వేరే రూట్‌లో వెళ్లిపోతున్నాం. క్రికెట్‌ వంటి పెద్ద పెద్ద గేమ్స్‌ని మాత్రమే ఫాలో అవుతున్నాం. కానీ ప్రోపర్‌ వేలో కష్టపడితే ఎన్నో అవకాశాలు మన కోసం ఎదురు చూస్తున్నాయి. మన పొటెన్షియల్ ని ప్రపంచానికి చాటుకునే అవకాశాలను మన వారికి పరిచయం చేయాలనే ఈ ప్రెస్‌మీట్‌ నిర్వహిస్తున్నాం. ఇంకా చాలా రేస్‌లు ఉన్నాయి. మనం ప్రస్తుత, రాబోయే యువతరానికి హెల్దీ, పొటెన్షియల్‌ లైఫ్‌ను ఇవ్వాలనేది నా ఆకాంక్ష. నేను ఈ రంగంలో కోచింగ్‌ కూడా ఇస్తున్నాను. 10 సంవత్సరాలుగా నేను సంపాదించిన నాలెడ్జ్‌ను మన ఇండియన్స్‌కు పంచాలని హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడే కోచింగ్‌ సెంటర్‌ పెట్టాలని అనుకుంటున్నాను’’ అని అన్నారు.

Related posts

Leave a Comment