దర్శకుడు నరసింహ నంది తీసిన సినిమాలు ప్రేక్షకుడిని వెంటాడుతాయి. ఒక వ్యక్తి తీసిన సినిమా గురించి చెప్పే ముందు తను గతంలో తీసిన సినిమాలేంటి అని అవలోకన చేసుకుంటే ప్రస్తుత సినిమా రంగు ఏంటో తెలిసిపోతుంది.సరిగ్గా గుర్తులేదు అప్పుడెప్పుడో 2008 లో 1940 ఒక గ్రామం తీసాడు. అప్పుడది సంచలనం. అవార్డులొచ్చినయ్. ఆ సినిమా వచ్చి చాన్నాళ్ళైనా అందులోని ఓ మూడు పాత్రలు మనతోనే వస్తున్నాయి. ఈయన సినిమాల్లోని పాత్రలు మనచుట్టూరా ఉండే పాత్రలే.. ఈయన సినిమా పేర్లు విభిన్నంగా ఉండి అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. నర్సింహ నంది కమర్షియల్ సినిమా తీయడు మనల్ని కమ్ముకున్న సమస్యల్నే సెంటర్ పాయింట్ చేసుకుని సినిమాగా రాసుకుంటాడు .. ఈయన తీసిన కొన్ని సినిమాల్లో అభ్యంతర కరమైన సంఘటనలు కనిపించినా అవసరమైనవే అన్నట్లు అన్పిస్తూఉంటాయి . తమిళంలో మలయాళంలో నేచురల్ కాన్సెప్ట్ లుంటాయి అంటారు కానీ నంది సినిమాల్లోనూ అలాంటి మన నేటివిటీనే ఉంటుందన్నవిషయం చాలామంది గుర్తించరెందుకో…
ఇకపోతే ఈరోజు చూసిన సినిమా
జాతీయ రహదారి
ఈ సినిమా మొన్న జరిగిందే తీసాడుకదాని కొంతమంది కొట్టి పడేయొచ్చు కానీ,
ఓ ఇరవై ఏళ్లు గడిచాక ఇప్పటి కరోనా గురించి అప్పటి తరం మాట్లాడుకునేప్పుడు వాళ్లకోసం అందించిన కానుకే ఈ జాతీయ రహదారి. ఈ సినిమా అందరికి నచ్చకపోవచ్చు… ఎవరి అభిప్రాయాలు వారివి..
ఇంకో విషయం ఏంటంటే బాహుబలి కూడా నచ్చని వాళ్ళున్నారనేది వాస్తవం.
లాక్ డౌన్ తో సామాన్య జనం పడిన మానసిక , శారీరక వేదనకు దృశ్యరూపమే ఈ సినిమా ..
ఎప్పటిలాగే ఈయన సినిమాల్లోని పాత్రలు గుర్తుండేలా ఇందులోకూడా రాములు పాత్ర, మల్లి పాత్ర, ఈశ్వరి పాత్ర, రాములు భార్య పాత్ర , మనకు లాక్ డౌన్ అనే మాట గుర్తుస్తే ఈ పాత్రలు కళ్ళల్లో మెదుల్తాయి.. ఎంత సహజంగా అల్లుకున్నాడు వాటిని… మౌనశ్రీ మల్లిక్ రాసిన పాటలు సందర్బోచితంగా ఉండి హృదయానికి హత్తుకునేలా ఉన్నాయి..
చక్కటి నేపధ్య సంగీతం ఉంది… సంగీత దర్శకులు సుక్కు చేసిన ట్యూన్స్ చాలా క్యాచీ గా ఉన్నాయి. ఇలాంటి సినిమాకి కెమెరా అనేది చాలా ముఖ్యమైనది దానికి కెమెరామెన్ మురళీ మోహన్ రెడ్డి గారి ప్రతిభ ప్రతిజి ఫ్రేమ్ లో కనిపించింది. ఆర్టిస్టులు అందరూ కొత్త ముఖాలే అయినా సహజంగా నటించారు.
చాలారోజుల తర్వాత థియేటర్ లో ఇలాంటి మంచి సినిమాను చూడడం ఆనందమేసింది.
ఆల్ ది బెస్ట్ టు నరసింహ నంది టీమ్