Nidhi Agerwal: నిధి అగ‌ర్వాల్ రెమ్యూనరేష‌న్‌ పెంచేసింది!?

Nidhiagerwal
Actress Nidhi Agarwal Hot Black Saree Images @ iSmart Shankar Pre Release
Spread the love

అందాలతార హాట్ బేబీ నిధి అగ‌ర్వాల్ సినిమాల స్పీడు పెంచడమే కాదు.. దాంతో పాటు తన రెమ్యూనరేష‌న్‌కూడా భారీగానే పెంచేసిందట. ఆకట్టుకునే న‌ట‌న‌, గ్లామ‌ర్‌తో యువతరాన్ని క‌ట్టిప‌డేస్తున్న ఈబ్యూటీ ‘స‌వ్య‌సాచి’ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. ఈ సినిమా అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయినప్పటికీ నిధి అంద‌చందాల‌కు మాత్రం మంచి ప్రశంసలే లభించాయి. ఆ త‌ర్వాత ‘మిస్ట‌ర్ మ‌జ్ను’లో ఛాన్స్ ద‌క్కించుకున్న ఈ ముద్దుగుమ్మ ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’తో కుర్ర‌కారు గుండెల్లో గూడుకట్టుకుంది. ఈ భామ తెలుగులో తాజాగా న‌టించిన చిత్రం ‘హీరో’. యంగ్ హీరో అశోక్ గ‌ల్లాతో జోడీ క‌ట్టిన నిధి ఈ సినిమా కోసం బాగానే డిమాండ్ చేసింద‌ట‌. ఇప్ప‌టివ‌ర‌కు రూ.50 నుంచి 80 ల‌క్ష‌ల రెమ్యూనరేష‌న్‌ అందుకున్న నిధి ఈ సినిమాకు మాత్రం ఏకంగా కోటిన్న‌ర తీసుకున్న‌ట్లు సమాచారం. త‌న కెరీర్‌లోనే తొలిసారిగా ఓ సినిమాకు ఈ రేంజ్‌లో రెమ్యూనరేష‌న్‌ తీసుకోవడం ఇదే తొలిసారిఅట! బాప్..రే నిధి!!