సంక్రాంతి రోజున ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు మరో గుడ్‌న్యూస్ వచ్చేసింది. అల్లు అర్జున్ హీరోగా బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఓ ప్రతిష్టాత్మక సినిమా రాబోతుంది. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఇద్దరు స్టార్స్ కలిసి పని చేయబోతోన్న ఈ సినిమా ఆడియెన్స్‌కు ఓ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించనుంది. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌ను పవర్‌ఫుల్ వీడియో కంటెంట్‌తో అనౌన్స్ చేయటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, బివి వర్క్స్‌తో కలిసి నిర్మిస్తోన్నఈ సినిమా నేషనల్ రేంజ్‌లో అభిమానులు, ప్రేక్షకుల అంచనాలను పెంచేస్తోంది. ఈ భారీ చిత్రానికి నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మాతలు. బన్నీవాస్‌తో పాటు నట్టి, శాండీ, స్వాతి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడీ అనౌన్స్‌మెంట్ తెగ వైరల్ అవుతోంది. సినిమా ఎలా ఉండబోతుంది, కథేంటి అనే అంశాలపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. తిరుగులేని స్టైల్, ఎలక్ట్రిఫైయింగ్ స్క్రీన్ ప్రెజన్స్, పాన్ ఇండియా స్టార్‌డమ్ ఉన్న అల్లు అర్జున్.. వాస్తవానికి దగ్గరగా ఉండే, హై ఇంపాక్ట్ ఫిల్మ్ మేకింగ్‌తో కమర్షియల్ సినిమాలకు కొత్త అర్థం ఇచ్చిన దర్శకుడు లోకేష్ కనకరాజ్ కలిసి ఈ సినిమాలో పని చేస్తున్నారు. వీరికి తోడుగా రాక్‌స్టార్ అనిరుధ్ కూడా జాయిన్ కావటం విశేషం. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా షూటింగ్ 2026 ఆగస్టులో ప్రారంభం కానుంది. ఏఏ-23 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కునున్న ఈ సినిమాలో అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ డైనమిక్ దర్శకత్వంలో ఇప్పటివరకు ఎప్పుడూ చూడని కొత్త లుక్‌లో కనిపించబోతున్నారు. రీసెంట్ టైమ్స్‌లో అందరూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటిగా మారింది.
అల్లు అర్జున్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ భారీ ప్రాజెక్ట్
