తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో దాదాపు 70 మంది కమిటీ సభ్యులు ఈ రోజు కలిశారు. మంత్రిని కలిసిన వారిలో హీరో కిరణ్, జేవియర్,, స్నిగ్ధ రెడ్డి, అక్సా ఖాన్, ఫైట్ మాస్టర్ రవి, రమేష్ నాయుడు, కాచం సత్యనారాయణ, అశోక్ కుమార్, కే వి ఎల్ నరసింహారావు, శ్రీనివాస్ గౌడ్, అల్లా బక్ష వెంకటేష్ గౌడ్ తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ..ఇటీవల తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఎలక్షన్స్ జరిగిన నేపథ్యంలో కమిటీ ప్రమాణస్వీకారోత్సవానికి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించాము. వారు మా ఆహ్వానాన్ని మన్నించి ప్రమాణ స్వీకార మహోత్సవానికి తప్పకుండా హాజరవుతానని హామీ ఇచ్చారు .అలాగే తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి 16,000 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో చాలామంది సభ్యులకు నివాస స్థలాలు లేవు. ఇళ్ళు లేని సినీ కార్మికులకు ఇళ్ళు మంజూరు చేయించాలని మంత్రిని కోరడం జరిగింది. సినీ పరిశ్రమ సమస్యల గురించి వివరించడం జరిగింది. సమస్యల పరిష్కరానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అలాగే సినీ పరిశ్రమలో 24 క్రాఫ్ట్ టెక్నీషియన్స్ అందరికీ, తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు మంత్రి గారి సహాయ సహకారాలు, సపోర్ట్ ఉండాలని కోరడం జరిగింది అన్నారు.