టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ వీరాభిమాని అయిన సూర్యతేజ పసుపులేటి కథానాయకుడిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి కెరటంలా దూసుకొస్తున్నారు. ఆయన హీరోగా స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ‘మన ఊరి ప్రేమాయణం’ అనే చిత్రం తెరకెక్కుతోంది. అలమేలు మంగమ్మ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, లోగోని హీరో సూర్యతేజ పసుపులేటి జన్మదినోత్సవం సందర్బంగా ఫిలిం ఛాంబర్ లో జరిగిన కార్యక్రమంలో ప్రఖ్యాత సీనియర్ నటుడు సుమన్ లాంఛ్ చేశారు. ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో నిర్మాత కె. ఎన్ రాజు, డీఓపీ ఎడిటర్ ఉదయ్ కుమార్ జి., ప్రముఖ నిర్మాత రామసత్యనారాయణ మూవీ టీమ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా హీరో సూర్యతేజ పసుపులేటి మాట్లాడుతూ.. ‘మన ఊరి ప్రేమయాణం’ ఓ చక్కటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందింది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు ఈ చిత్రంలో ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాయి. నా జన్మదినోత్సవం సందర్బంగా ఫిలిం ఛాంబర్ లో జరిగిన కార్యక్రమంలో ప్రఖ్యాత సీనియర్ నటుడు హీరో సుమన్ టైటిల్, లోగోని లాంఛ్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే నిర్మాతలు కె.ఎన్ రాజు, రామసత్యనారాయణ కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వదించడం మరచిపోలేను. హీరోగా వస్తున్న నన్ను ఆశీర్వదించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక సినిమా విషయానికొస్తే.. ఇంటిల్లిపాదినీ ఆకట్టుకునే చిత్రమిది. పూర్తి వినోదాత్మకంగా సాగే ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరూ తమతమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే అంశాలతో ఈ ‘మన ఊరి ప్రేమాయణం’ తెరకెక్కింది. ఎక్కడా రాజీ పడకుండా.. ప్రేక్షకులు శబాష్ అనేలా అన్ని హంగులతో అందమైన ప్రదేశాల్లో చిత్రీకరణ జరుపుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ సినిమా చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు, నిర్మాత, దర్శకత్వం : సూర్యతేజ పసుపులేటి, నిర్మాత: కె.ఎన్ రాజు, డీఓపీ : ఎడిటర్ ఉదయ్ కుమార్ జి., సంగీతం : శ్రీ వెంకట్, ఎస్.ఎఫ్.ఎక్స్ : వెంకట్ శ్రీకాంత్ , లైన్ ప్రొడ్యూసర్ : సూరిబాబు, కెమెరా అసిస్టెంట్: చందు డి. -వంశీ బి., డబ్బింగ్ : సి.ఎల్.జి. స్టూడియోస్ నాగేష్ తదితరులు.
హీరో సూర్యతేజ పసుపులేటి బర్త్ డే సందర్బంగా ‘మన ఊరి ప్రేమాయణం’ టైటిల్, లోగో లాంఛ్
