Aug 1, 2026

‘క్రేజీ కల్యాణం’ రూ.100 కోట్లు వసూళ్లు చేసి చరిత్ర సృష్టించాలి: టీజర్ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ నందిని రెడ్డి

'Crazy Kalyanam' should create history by grossing ₹100 crore: Director Nandini Reddy at the teaser launch event.

'Crazy Kalyanam' should create history by grossing ₹100 crore: Director Nandini Reddy at the teaser launch event.

Spread the love

నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “క్రేజీ కల్యాణం”. ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం. 2గా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బూసం జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు బద్రప్ప గాజుల రూపొందిస్తున్నారు. ఈ రోజు ఈ సినిమా టీజర్ ను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నందిని రెడ్డి చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో..
లిరిక్ రైటర్ గోరటి వెంకన్న మాట్లాడుతూ – నాకున్న పరిమితులతో చూస్తే నేను సినిమాల్లో ఎక్కువ పాటలు రాసినట్లే లెక్క. ఇది చాలా మంచి సినిమా. ఎలాంటి అశ్లీలత లేకుండా హాయిగా అందరూ చూడొచ్చు. అనుపమ చక్కగా నటించింది. ఈ సినిమాలో ఎవరూ నటించినట్లు లేదు జీవించారు. ఈ కథ చూస్తుంటే నిజ జీవితాలు చూసినట్లే అనిపిస్తోంది. టీజర్ చూశాక నాకు ఈ పాత్రల్లా వ్యవహరించే ఓ పదిమంది గుర్తుకు వచ్చారు. భద్రప్ప, జగన్మోహన్ కలిసి టాలీవుడ్ కు ఒక మంచి సినిమా ఇస్తున్నారు. ఈ సినిమాకు వేణు ఊడుగుల గారు మార్గనిర్దేశం చేస్తున్నారు. సురేష్ బొబ్బిలి గొప్పగా ట్యూన్స్ కంపోజ్ చేశాడు. జగన్మోహన్ నాది 30 ఏళ్ల స్నేహబంధం. ఈ సినిమా హిట్ అవుతుందని నాకు గట్టి నమ్మకం ఉంది. ఎంత స్థానికత ఉంటే అంత గొప్ప సినిమా అవుతుంది. ఊళ్ల ప్రేక్షకులు కూడా ఈ సినిమాను బాగా చూస్తారు. ఇది తెలంగాణ ప్రాంతం సినిమా అయినా అన్ని ప్రాంతాల ప్రజలు ఇష్టపడే సినిమా అవుతుంది. అన్నారు.
రైటర్ శ్రీనివాస రవీంద్ర మాట్లాడుతూ – డైరెక్టర్ భద్రప్ప నాకు ఈ కథ చెప్పినప్పుడు ప్రతి పాత్రలో క్రేజీనెస్ ఉందని అనిపించింది. ఆ క్రేజీనెస్ మిమ్మల్ని ఎంటర్ టైన్ చేస్తుంది, ఎమోషన్ కు గురిచేస్తుంది, ఎంగేజ్ చేస్తుంది. ఇదే ఈ మూవీకి అసలైన బలం.
డీవోపీ శ్యామ్ దూపాటి మాట్లాడుతూ – మా మూవీ టీజర్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. టీజర్ రిలీజ్ చేయడానికి అతిథిగా వచ్చిన నందిని గారికి థ్యాంక్స్. మా మూవీ థియేటర్స్ లో మిమ్మల్ని బాగా ఎంటర్ టైన్ చేస్తుంది. అన్నారు.
నటుడు కిరీటి దామరాజు మాట్లాడుతూ – ఈ సినిమాతో ఒక టాలెంటెడ్ టెక్నీషియన్ గా మా డైరెక్టర్ భద్రప్ప టాలీవుడ్ కు రాబోతున్నారు. ఎంటర్ టైన్ మెంట్ తో పాటు ఒక మంచి మెసేజ్ తో ఆయన ఈ సినిమాను ఆసక్తికరంగా రూపొందిస్తున్నారు. అరుదుగా ఇలాంటి కథలు వస్తుంటాయి. ఈ సినిమా అవార్డ్స్ దక్కుతాయని నా నమ్మకం. అంత సాలిడ్ క్యారెక్టర్స్, సీన్స్ దర్శకుడు రాసుకున్నారు. ఈ సినిమా డెఫనెట్ గా బ్లాక్ బస్టర్ అవుతుంది. అన్నారు.
నటి మౌనిక మాట్లాడుతూ – ఈ టీమ్ తో కలిసి వర్క్ చేయడం బ్యూటిఫుల్ ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్ మా మూవీలో ఉంటుంది. ఈ సినిమాను థియేటర్స్ లో చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తారు. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ – నందిని రెడ్డి గారి రాకతో మా ఈవెంట్ ఇంకా పెద్ద ఈవెంట్ అయ్యింది. ఇలాంటి మంచి మూవీలో నాకు అవకాశం కల్పించిన డైరెక్టర్ భద్రప్ప గారికి, ప్రొడ్యూసర్, ప్రొడ్యూసర్ జగన్మోహన్ గారికి, మా వేణు ఊడుగుల గారికి థ్యాంక్స్. ఈ చిత్రంలో మంచి మ్యూజిక్ చేసే అవకాశం కలిగింది. రాజా రాజా అనే పాట హైలైట్ గా నిలుస్తుంది. అన్నారు.
హీరో అఖిల్ రాజ్ మాట్లాడుతూ – ఈ రోజు మా మూవీ టీజర్ లాంఛ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసిన నందిని రెడ్డి గారికి థ్యాంక్స్ చెబుతున్నాం. ఈ టీజర్ లాగే సినిమా కూడా మీ అందరికీ బాగా నచ్చుతుందని నమ్ముతున్నా. అనుపమ గారిని పక్కా తెలంగాణ క్యారెక్టర్ లో చూడబోతున్నారు. నరేష్ గారితో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. ఆయనతో మరిన్ని మూవీస్ చేయాలనుకుంటున్నా. బాగా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా షూటింగ్ చేశాం. రాజు వెడ్స్ రాంబాయి కంటే ముందే ఈ సినిమాలో నన్ను తీసుకున్నారు మా డైరెక్టర్ భద్రప్ప గారు. జగన్మోహన్ రెడ్డి గారి బ్యానర్ లో నేను చేస్తున్న రెండో చిత్రమిది. నాపై ఎంత నమ్మకం ఉంటే అనుపమ గారితో కలిసి నటించే అవకాశం కల్పించారో అర్థం చేసుకోవచ్చు. మా మూవీని మీరంతా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.
ప్రొడ్యూసర్ బూసం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ – నేను నిర్మాతగా చేస్తున్న రెండో చిత్రమిది. ఫస్ట్ మూవీ అఖిల్ రాజ్ తో విందు భోజనం అని చేశాను. ఇప్పుడు క్రేజీ కల్యాణం సినిమా నిర్మిస్తున్నాను. నేను కొత్త ప్రొడ్యూసర్ ను అయినా నన్ను నమ్మి మూవీ ఒప్పుకున్న అనుపమ గారికి, వీకే నరేష్ గారికి థ్యాంక్స్. స్క్రిప్ట్ విషయంలో మొదటి నుంచి మా వేణు ఊడుగుల అన్న సహకారం అందిస్తున్నారు. వేణు అన్న నాకు 15 ఏళ్లుగా తెలుసు. వీళ్ల సపోర్ట్ వల్లే నేను ఇండస్ట్రీలోకి వచ్చానని అనిపిస్తుంటుంది. అడ్వర్టైజింగ్ రంగంలో పాతికేళ్లుగా కెరీర్ కొనసాగిస్తున్నా. ఇప్పుడు నిర్మాతగా మీ ముందుకు వస్తున్నా. సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టి ఈ సినిమా చేశాం. నా డాక్యుమెంటరీస్, యాడ్స్, సాంగ్స్ కు కలిసి భద్రప్ప పనిచేస్తూ వస్తున్నారు. ఆయనతో నాకు లాంగ్ అసోసియేషన్ ఉంది. ఈ క్రమంలో భద్రప్ప నాకు 12 కథలు చెప్పారు. ఆ కథల్లో ఇది సెలెక్ట్ చేసుకున్నాం. అయితే మిగతా కథలతో కూడా భద్రప్ప మాతో సినిమాలు చేయిస్తాడని అనిపిస్తోంది. మా సినిమాకు ఇంటి పెద్దలా నరేష్ గారు సపోర్ట్ ఇచ్చారు. అనుపమ మా సినిమాకు అందించిన సహకారం మర్చిపోలేము.
దర్శక నిర్మాత వేణు ఊడుగుల మాట్లాడుతూ – మనిషికి జీవితంలో ఏది అవసరం. మనిషి తనకు తాను గుర్తింపు పొందడమా, సమాజం చేత గుర్తింపు పొందడమా అనే తాత్విక సంఘర్షణే ఈ కథకు మూలం. ఆత్మ గౌరవం కోసం కూతురు, సమాజ గౌరవం కోసం తండ్రి ఈ ఇద్దరి సంఘర్షణ రెండు తరాల మధ్య జరిగే సంఘర్షణ కాదు, ఇది విలువల మధ్య జరిగే సంఘర్షణ. ఈ కథ సామాజిక విలువల గురించి, స్త్రీ స్వేచ్ఛ గురించి, స్త్రీ ఆత్మ గౌరవం గురించి చర్చిస్తుంది. ఈ సినిమా ఫిలం ఇండస్ట్రీలో కొత్త ఆశల్ని రేకెత్తిస్తుంది. ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో జగన్ మోహన్ గారిలో మంచి సినిమాలు నిర్మించాలనే ప్యాషన్, తపన కనిపించేవి. ఈ సినిమాతో ఆయన ప్రొడ్యూసర్ గా మన ముందుకు రావడం సంతోషంగా ఉంది. భద్రప్ప ఈ సినిమాను బాగా రూపొందించాడు. అనుపమ, నరేష్ గారు లేకుంటే ఈ సినిమా లేదు. నరేష్ గారు ఫాదర్ ఆఫ్ ది ఫిలిం. అనుపమ గారిని స్క్రీన్ మీద చూసినప్పుడు ఒక వెలుగు కనిపించింది. ఈ సినిమాలోని సోల్ ను అనుపమ, నరేష్ గారు క్యారీ చేశారు. అఖిల్ కు కూడా ఈ సినిమాతో మంచి పేరొస్తుంది. అన్నారు.
డైరెక్టర్ భద్రప్ప గాజుల మాట్లాడుతూ – మన ఇండస్ట్రీ బంగారం నందిని రెడ్డి గారు మా మూవీ టీజర్ లాంఛ్ కు పిలవగానే వచ్చారు. ఆమెకు థ్యాంక్స్ చెబుతున్నాం. నందిని గారి చేతుల మీదుగా మా మూవీ టీజర్ లాంఛ్ కావడం సంతోషంగా ఉంది. చాలా క్యాజువల్ గా స్టార్ట్ అయిన చిత్రమిది. ఒక రోజు సరదాగా మా రైటర్ శ్రీనివాస రవీంద్ర గారితో ఈ కథ షేర్ చేసుకున్నాను. కథ చాలా బాగుంది సినిమా చేద్దామంటూ వేణు అన్న, జగన్మోహన్ అన్నతో చెప్పారు. అలా ఈ సినిమా జర్నీ ప్రారంభమైంది. ఈ సినిమాకు కరెక్ట్ ఆర్టిస్టులు పడితే ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని అనుకున్నాం. అలా తండ్రి పాత్రకు మా ప్రొడ్యూసర్ అనుకున్న మొదటి పేరు నరేష్ గారిది. తర్వాత అనుపమ, తరుణ్ భాస్కర్, అఖిల్. అయితే నాకు దర్శకుడిగా మొదటి సినిమా ఇది. ఇలాంటి పేరున్న ఆర్టిస్టులు ఒప్పుకుంటారా లేదా అని సందేహించాను. కనీసం కథ చెప్పే అవకాశం ఇస్తారా లేదా అనుకున్నాను. ఒప్పుకోకున్నా కనీసం ఒక ఫొటో తీసుకోవచ్చు అనిపించింది. సింగిల్ సిట్టింగ్ లోనే వీళ్లంతా కథను ఓకే చేశారు. కథను, నన్ను నమ్మి మా ప్రొడ్యూసర్ గారు ఈ అవకాశం కల్పించారు. కొత్త దర్శకుడికి ఇంతమంది పేరున్న ఆర్టిస్టులను ఇచ్చి సినిమా చేయమనడం అంత సులువు కాదు. మనం నిజ జీవితంలో చూసే పాత్రలు, మన ఇరుగు పొరుగు వ్యక్తులను పోలిన క్యారెక్టర్స్ మా మూవీలో ఉంటాయి. మా చిత్రంలో నవ్వులతో పాటు మనసుకు హత్తుకునే ఎమోషన్స్ ఉన్నాయి. అన్నారు.
నటుడు వీకే నరేష్ మాట్లాడుతూ – టీజర్ తోనే మా సినిమా టీమ్ సిక్సర్ కొట్టారు. ఈ సినిమాలో నటించమని నన్ను మొదట సంప్రదించింది వేణు ఊడుగుల గారు. ఆ తర్వాత భద్రప్ప గారు గంటా 45 నిమిషాలు నెరేషన్ ఇచ్చారు. నేను అలా వింటూనే ఉన్నాను. 300 చిత్రాలు చేసిన అనుభవం నాది. రిఫరెన్స్ లా పెట్టుకోవాల్సిన స్క్రిప్ట్ ఇది. ఈ స్క్రిప్ట్ ను యాక్టర్స్ అందరూ రిఫరెన్స్ గా తీసుకోవాలి. ఈ సినిమాను మనం కొంచెం ఓపికగా చేయాలనే ఒకే మాట వారితో చెప్పాను. స్క్రిప్ట్ విన్న తర్వాత ఈ క్యారెక్టర్ ఎలా చేయాలి అని నాకు చెమటలు పట్టాయి. నేను ప్రతి సినిమాకు నేర్చుకునే స్టూడెంట్ ను. ఈ సినిమా నన్ను డిస్టింక్చన్ లో పాస్ చేస్తుంది. నాకే కాదు అనుపమ కూడా మంచి పేరొస్తుంది. ఈ స్క్రిప్ట్ లోనే అంత పవర్ ఉంది. మా ప్రొడ్యూసర్ కాంప్రమైజ్ కాకుండా సినిమా నిర్మించారు. ఈ చిత్రంలో రియల్ ఫన్, రియల్ లొకేషన్స్, రియల్ ఎమోషన్స్ చూస్తారు. అనుపమ ఈ సినిమాకు ఒక ల్యాంప్. మేమిద్దరం పోటీ పడి నటించాం. అఖిల్ బాగా పర్ ఫార్మ్ చేశాడు. ఇటీవల మంచి విజయాలు టాలీవుడ్ కు దక్కుతున్నాయి. ఆ క్రమంలో క్రేజీ కల్యాణం సినిమాతో మరో హిట్ ఇండస్ట్రీకి రాబోతోంది. అన్నారు.
డైరెక్టర్ నందిని రెడ్డి మాట్లాడుతూ – “క్రేజీ కల్యాణం” సినిమా టీజర్ చాలా బాగుంది. డైరెక్టర్ భద్రప్ప గారు ఎంటర్ టైనింగ్ గా మూవీ చేశారు. తరుణ్ భాస్కర్ క్యారెక్టర్ థియేటర్స్ లో పేలుతుంది. నరేష్ గారి క్యారెక్టర్ కు కూడా మంచి రెస్పాన్స్ దక్కుతుంది. అనుపమా మళ్లీ కామెడీ జానర్ లో క్యారెక్టర్ చేయడం హ్యాపీగా ఉంది. టీజర్ చూస్తే మూవీలో కావాల్సినంత వినోదం ఉంటుందని అనిపిస్తోంది. థియేటర్స్ లో విజిల్స్ వేసి ఎంజాయ్ చేసే సినిమా అని తెలుస్తోంది. కొత్త డైరెక్టర్ చేసినట్లు కాకుండా ఎక్సిపీరియన్స్డ్ డైరెక్టర్ లా భద్రప్ప గారు ఇంప్రెషన్ క్రియేట్ చేస్తున్నారు. మా బ్రదర్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సినిమాతో హిట్ కొట్టాలి. ఈ సినిమా 100 కోట్ల రూపాయల వసూళ్లు చేసి హిస్టరీ క్రియేట్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ – ఇది క్రేజీ కల్యాణం సినిమా కాబట్టి క్రేజీగా చాలా మాట్లాడుకోవచ్చు. ఇది స్మాల్ అండ్ స్వీట్ ఫిలిం. ఈ కథ చెప్పేందుకు భద్రప్ప వచ్చినప్పుడు చాలా ఇన్నోసెంట్ గా కనిపించారు. రెండున్నర గంటలు కథ చెప్పారు. ఆయన ఇచ్చిన నెరేషన్ లో హిలేరియస్ సీన్స్, ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. ఈ కథ వింటూ నవ్వీ నవ్వీ కడుపు నొప్పి వచ్చింది. కథ విన్నాక భద్రప్ప ఈ సినిమా నేను చేస్తాను, నువ్వు చెప్పింది చెప్పినట్లు తీస్తే ఈ సినిమా హిట్ అవుతుంది అని చెప్పాను. ఈ క్యారెక్టర్ తో పాటు మొత్తం స్క్రిప్ట్ నాకు బాగా నచ్చింది. ఈ సినిమా క్యూట్ గా, హిలేరియస్ గా, రిలేటబుల్ గా ఉంటుంది. డైరెక్టర్ ఇచ్చిన నెరేషన్ ను నమ్మి నేను ఈ సినిమా చేశాను. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. డబ్బింగ్ కూడా పూర్తి చేశాను. ఫిలింమేకింగ్ లో ఒక కొత్త దర్శకుడు భద్రప్ప చూపించిన ప్రతిభకు గర్వపడుతున్నా. ఆయన తొలి చిత్ర దర్శకుడు అని ఎవరూ అనుకోరు. నేను చెప్పిందే రూపొందించాలని ఆయన అనుకోరు. మేము ఎన్నో సీన్స్ కు డిస్కస్ చేసుకుని చేశాం. మన సూచనలకు విలువ ఇస్తారు. నిర్మాత జగన్మోహన్ గారు కూడా ఎవరేం చెప్పినా అది సినిమా మంచి కోసమే కదా అని అనుకుంటారు. నరేష్ గారితో నేను చేస్తున్న మూడో చిత్రమిది. అఖిల్ రాజ్ చాలా మంచి పర్ ఫార్మర్. ఇలాంటి మంచి చిత్రానికి మీరంతా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.
నటీనటులు: నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, అఖిల్ ఉడ్డెమారి, తదితరులు
టెక్నికల్ టీమ్:
కాస్ట్యూమ్ డిజైనర్ – జె.గాయత్రి దేవి
ఆర్ట్ డైరెక్టర్ – సాయి కదిర
ప్రొడక్షన్ డిజైనర్ – శ్రీపాల్ మాచర్ల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – అఖిల్ సాయి శ్రీమూర్తి
కొరియోగ్రాఫర్ – ఈశ్వర్ పెంటి
యాక్షన్ – డ్రాగన్ ప్రకాష్
లిరిక్స్ – గోరటి వెంకన్న, చైతన్య ప్రసాద్, కాసర్ల శ్యామ్
ఎడిటర్ – శ్రావణ్ కటికనేని
డీవోపీ – శ్యామ్ దూపాటి
మ్యూజిక్ – సురేష్ బొబ్బిలి
స్క్రీన్ ప్లే – శ్రీనివాస రవీంద్ర (ఎంఎస్ఆర్)
పీఆర్ఓ – సురేష్ (ఎస్ కె మీడియా)
ప్రొడ్యూసర్ – బూసం జగన్ మెహన్ రెడ్డి
స్టోరీ, స్క్రీన్ ప్లే , డైలాగ్స్, డైరెక్షన్ – బద్రప్ప గాజుల