ఆలేరు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా కలకుంట్ల లోకేష్

aler news

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలానికి చెందిన కలకుంట్ల లోకేష్ ను ఆలేరు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా నియమిస్తూ ఆ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామక పత్రాన్ని భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారి చేతులమీదుగా లోకేష్ అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు నా వంతు కృషి చేస్తానని అలాగే ఆలేరు మండలంలోని అన్ని గ్రామాల్లో యూత్ కాంగ్రెస్ గ్రామ కమిటీలు నియమించి కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేస్తానని తెలియజేయడం జరిగింది. అలాగే తన నియామకానికి సహకరించిన పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారికి,రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి గారికి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్…

NSUI ఆధ్వర్యంలో ఆలేరులో ఇంటర్మీడియట్ కళాశాలలు బంద్

NSUI ALER NEWS

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో NSUI ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ కాలేజీలన్నీ బంద్ చేయడం జరిగింది. ఈ సందర్బంగా NSUI మండల అధ్యక్షులు సుంకరి విక్రమ్ మాట్లాడుతూ.. మొన్న విడుదలైన ఇంటర్మీడియేట్ ఫలితాలలో జరిగిన తప్పిదాలకు బలైన విద్యార్థుల న్యాయం కోసం NSUI పోరాడుతుంటే ఇంటర్మీడియేట్ బోర్డు కనీసం స్పందించకుండా పోలీసులను అడ్డం పెట్టుకోని మమ్మల్ని అడ్డుకోవడం వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకోవడంలో భాగమేనని మండిపడ్డారు. అలాగే విద్యార్థుల ప్రాణాలకు బాధ్యులైన తెలంగాణ ప్రభుత్వం మరియు తెలంగాణ ఇంటర్మీడియేట్ బోర్డు తీరుకు నిరసనగా ఈరోజు ఆలేరులో ఉన్నటువంటి అన్ని జూనియర్ కళాశాలను NSUI ఆధ్వర్యంలో బంద్ చేయడం జరిగిందని చెప్పారు.

ఎమ్మెల్సీ ఎల్.రమణకు బొట్ల పరమేశ్వర్ అభినందనలు

Botla Parameshwar-L Ramana

-అరుదైన వ్యక్తుల జాబితాలో ఎల్.రమణగారికి చోటు హైదరాబాద్: ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి ఎల్.రమణకు యాదాద్రి భువనగిరి జిల్లా టి.ఆర్.ఎస్ నాయకులు, ఆలేరు మాజీ జెడ్పిటిసి బొట్ల పరమేశ్వర్ శుభాభినందనలు అందజేశారు. ఉత్కంఠభరితంగా సాగిన కరీంనగర్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎల్.రమణ గారి గెలుపు కరీంనగర్ ప్రాంత ప్రజలకు శుభసూచకమని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా బొట్ల పరమేశ్వర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘స్థానిక’ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం పట్ల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని, ఆరూ.. కారుకే రావడం ఆనందదాయకమన్నారు. పెద్దల సభకు ఎల్‌.రమణ గారు బోణీ కొట్టారని, శాసన మండలి ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ హవా కొనసాగిందనిపేర్కొన్నారు. మొత్తం 12 స్థానాలకు గాను.. ఆరు సీట్లను ఇప్పటికే ఏకగ్రీవంగా…

తడిసిన ధాన్యం వద్దకు కాంగ్రెస్ నాయకులు

aler news

టిపిసిసి అధ్యక్షులు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మార్కెట్ యార్డ్ లో తడిసిన ధాన్యాన్ని కాంగ్రెస్ నాయకులు అందరూ సందర్శించడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి మార్చుకోవాలని రైతుల పట్ల దొంగ ప్రేమను చూపిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అటు మోడీ ఇద్దరు ఇద్దరే మార్కెట్లో ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల వివక్ష చూపుతూ నిన్న కురిసిన వర్షానికి ధాన్యం తడిసి మొలకలు కూడా వచ్చిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే సరైన ధర ఇచ్చి కొనుగోలు చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో లో మహిళా కాంగ్రెస్ ఇన్చార్జి కోఆర్డినేటర్ యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ టిపిసిసి కార్యదర్శి జనగామ ఉపేందర్ రెడ్డి…

ఎనుముల రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు

టీపీసీసీ అధ్యక్షులుగా నియమితులైన ఎనుముల రేవంత్ రెడ్డిని బుధవారం ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరపున రాష్ట్ర స్థాయిలో చేపట్టే పార్టీ కార్యక్రమాల సందర్భంగా పెద్ద పత్రికలతో పాటు చిన్న పత్రికలకు ప్రకటనలు ఇచ్చి ప్రోత్సహించాలని, అలాగే జిల్లాల్లో జరిగే పార్టీ కార్యక్రమాల సందర్భంగా ఆయా జిల్లాల్లోని చిన్నపత్రికలకు డీసీసీ అధ్యక్షులు ప్రకటనలు ఇచ్చి ప్రోత్సహించాలని కోరడం జరిగింది. ఈ సందర్బంగా ఎనుముల రేవంత్ రెడ్డి కలిసిన వారిలో యూసుఫ్ బాబు, అజాంఖాన్ తదితరులు ఉన్నారు.