విప్లవ స్వాప్నికుడు కామ్రేడ్ బండ్రు నరసింహులు || నేల రాలిన ఎర్ర మందారం

Bandrunarashimhulu

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, CPI (ML) జనశక్తి నాయకులు, ప్రజావిమోచన సంపాదకులు కామ్రేడ్ బండ్రు నరసింహులు (104) జనవరి 22,2022న మ. 3 గంటలకు తుది శ్వాస విడిచారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో వారంరోజులుగా హాస్పిటల్ లో చికిత్స పొందిన బండ్రు నరసింహులు స్వస్థతపొంది 21 జనవరి రాత్రి డిశ్చార్జ్ అయ్యారు. ఆక్సిజన్ సహాయంతో బాగ్ అంబర్పేట్ లోనే తన పెద్ద కుమారుడు బండ్రు ప్రభాకర్ వద్ద చికిత్స పొందుతూ కార్డియాక్ అరెస్ట్ తో తనువు చాలించారు. తన పార్థివదేహాన్ని మెడికల్ కాలేజీకి డొనేట్ చేశారు. నిండు నూరేండ్లు బతకమనే పెద్దల దీవేనలన్నీ అపహాస్యమవుతూ రైతాంగపు బలవన్మరణాలు, ఎన్ కౌంటర్ హత్యలు, రాజ్యమేలుతున్న సమయంలో తూటాలు దిగిన శరీరంతో ఏటికి ఎదురీదుతూ నూరెండ్లుగా విప్లవ రాజకీయాలలో కొనసాగడం మామూలు విషయం కాదు. అమరులు వేసిన విప్లవ…

ఉపాధ్యాయుల మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి : యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ

Neelam padma

(T-Times News – ALER) ఉపాధ్యాయుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి అన్నారు. ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడుతూ మహబూబాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన ఇద్దరు మహిళ ఉపాధ్యాయులు గుండెపోటుతో బలవన్మరణానికి పాల్పడ్డారు. 317 జీవోను వెంటనే రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. నీళ్లు నిధులు నియామకాల పేరుతో ప్రభుత్వం ప్రజలను దగా చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్త నియామకాలు చేయకపోగా, ఉన్న ఉద్యోగాలకు ఎసరు పెడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇష్టారాజ్యంగా జిల్లాలను విభజించి ఉపాధ్యాయులను మారుమూల ప్రాంతాలకు పంపిస్తూ వారి కుటుంబాలలో నిప్పులు పోస్తున్నారని దుయ్యబట్టారు. భార్యాభర్తలు ఒకే దగ్గర పని చేయాలనే నిబంధనలు తుంగలోకి తొక్కార ని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపాధ్యాయులకు అన్యాయం జరిగితే ఊరుకునే…

జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాలి: టీయూడబ్ల్యూజే డైరీ ఆవిష్కరణలో మంత్రి హరీష్ రావు

Journalists Dairy

కోవిడ్ ను దృష్టిలో పెట్టుకొని  జాగ్రత్తలు తీసుకుంటూ జర్నలిస్టులు విధులు నిర్వర్తించాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీష్ రావు సూచించారు. బుధవారం నాడు కోకాపేట్ లోని తన నివాసంలో ఆయన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) రూపొందించిన మీడియా డైరీ-2022ని ఆవిష్కరించి మాట్లాడారు. కోవిడ్ మొదటి, రెండవ వేవ్ లలో పలువురు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. రాబోవు 45రోజుల్లో వైరస్ వ్యాప్తి మరింత ఉధృతంగా ఉండే అవకాశం ఉన్నందున విధిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. జర్నలిస్టులు నిత్యం ప్రజల మధ్యే ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నందున గతంలో తమ ప్రభుత్వం ప్రత్యేక  క్యాంపులను నిర్వహించి వేలాది మంది జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు కోవిడ్ వాక్సిన్ ఇచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు. అవసరమైతే…

నిజాయితీ పాలనకు నిదర్శనం బిజెపి ప్రభుత్వం : బిజెపి మహబూబ్‌నగర్ జిల్లా ఇంచార్జి ప్రేమ్ రాజ్ యాదవ్

ALER BJP NEWS

(టాలీవుడ్ టైమ్స్ ప్రతినిధి – ఆలేరు ) పాలనలో స్వార్దం లేకుండా నిజాయితీ గా పరిపాలన కొనసాగిస్తే దేశ ప్రజలు అంతే విధంగా బాగుంటారని బిజెపి మహబూబ్‌నగర్ జిల్లా ఇంచార్జి ప్రేమ్ రాజ్ యాదవ్ అన్నారు. ఆలేరు పట్టణంలో రెండు రోజుల బిజెపి రాజకీయ శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమానికి మంగళవారం హాజరైన ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రధాని మోడీ దేశంలోని అన్ని రాష్ట్రాలకు సమానంగా నిధులను కేటాయిస్తూ నిజాయితీ పాలనకు నిదర్శనంగా నిలుస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోఅనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు కోసం కేంద్రం భారీగా నిధులు కేటాయిస్తున్నా కేసీఆర్ ప్రభుత్వం పధకాలకు తమ సొంత పేరు పెట్టుకొని ప్రజలకు అందిస్తుందని‌ చెప్పారు.మోడీ ప్రభుత్వం ఏమీ చేయడం లేదని అబద్ధాలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు.తెలంగాణ లోని…

ఆలేరులో మహిళా కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశం : నియామక పత్రాలు అందజేత

aler news

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఇందిరా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం మహిళా కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ మండల పార్టీ అధ్యక్షులకు జిల్లా కమిటీ మెంబర్లకు నియామక పత్రాలు అందజేశారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సునీత రావు గారి ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ ఆధ్వర్యంలో మహిళా కాంగ్రెస్ చైతన్యవంతంగా పనిచేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరికి నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడం కోసం ప్రతి మహిళ ఒక ఆదిశక్తి గా మారి శక్తివంచన లేకుండా పార్టీ పటిష్టత కోసం పనిచేయాలని ఎక్కడైనా నా మహిళలపైన సంఘటన జరిగితే వెంటనే మహిళా కాంగ్రెస్ ముందుంటుందని వారికి న్యాయం జరిగేంత వరకు…

ఆలేరులో కోమటిరెడ్డి ప్రతిక్ రెడ్డి వర్ధంతి

aler news

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కోమటిరెడ్డి ప్రతిక్ రెడ్డి 10వ వర్ధంతి సందర్బంగా 100 మంది పేద ప్రజలకు దుప్పట్లు పంపిణీ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఎం.ఏ ఏజాజ్ మీడియాకు తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు, పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుమారుడు కోమటిరెడ్డి ప్రతిక్ రెడ్డి వర్ధంతి సందర్బంగా ప్రతీ ఏడు సేవా కార్యక్రమాలు, రక్తదానాలు నిర్వహించడం జరుగుతుందని, ఎందరో నిరుపేదలకు సాయం చేస్తూ అడుగడుగునా నేనున్నానంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎల్లవేళలా ముందుంటున్నారని, అందులో భాగంగానే కోమటిరెడ్డి ప్రతిక్ రెడ్డి 10వ వర్ధంతి సందర్బంగా 100 మంది పేద ప్రజలకు దుప్పట్లు పంపిణీ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో టీపీసీసీ సెక్రటరీ జనగామ ఉపేందర్ రెడ్డి, నీలం పద్మ వెంకటస్వామి,…

ఆలేరు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా కలకుంట్ల లోకేష్

aler news

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలానికి చెందిన కలకుంట్ల లోకేష్ ను ఆలేరు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా నియమిస్తూ ఆ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామక పత్రాన్ని భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారి చేతులమీదుగా లోకేష్ అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు నా వంతు కృషి చేస్తానని అలాగే ఆలేరు మండలంలోని అన్ని గ్రామాల్లో యూత్ కాంగ్రెస్ గ్రామ కమిటీలు నియమించి కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేస్తానని తెలియజేయడం జరిగింది. అలాగే తన నియామకానికి సహకరించిన పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారికి,రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి గారికి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్…

NSUI ఆధ్వర్యంలో ఆలేరులో ఇంటర్మీడియట్ కళాశాలలు బంద్

NSUI ALER NEWS

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో NSUI ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ కాలేజీలన్నీ బంద్ చేయడం జరిగింది. ఈ సందర్బంగా NSUI మండల అధ్యక్షులు సుంకరి విక్రమ్ మాట్లాడుతూ.. మొన్న విడుదలైన ఇంటర్మీడియేట్ ఫలితాలలో జరిగిన తప్పిదాలకు బలైన విద్యార్థుల న్యాయం కోసం NSUI పోరాడుతుంటే ఇంటర్మీడియేట్ బోర్డు కనీసం స్పందించకుండా పోలీసులను అడ్డం పెట్టుకోని మమ్మల్ని అడ్డుకోవడం వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకోవడంలో భాగమేనని మండిపడ్డారు. అలాగే విద్యార్థుల ప్రాణాలకు బాధ్యులైన తెలంగాణ ప్రభుత్వం మరియు తెలంగాణ ఇంటర్మీడియేట్ బోర్డు తీరుకు నిరసనగా ఈరోజు ఆలేరులో ఉన్నటువంటి అన్ని జూనియర్ కళాశాలను NSUI ఆధ్వర్యంలో బంద్ చేయడం జరిగిందని చెప్పారు.

ఎమ్మెల్సీ ఎల్.రమణకు బొట్ల పరమేశ్వర్ అభినందనలు

Botla Parameshwar-L Ramana

-అరుదైన వ్యక్తుల జాబితాలో ఎల్.రమణగారికి చోటు హైదరాబాద్: ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి ఎల్.రమణకు యాదాద్రి భువనగిరి జిల్లా టి.ఆర్.ఎస్ నాయకులు, ఆలేరు మాజీ జెడ్పిటిసి బొట్ల పరమేశ్వర్ శుభాభినందనలు అందజేశారు. ఉత్కంఠభరితంగా సాగిన కరీంనగర్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎల్.రమణ గారి గెలుపు కరీంనగర్ ప్రాంత ప్రజలకు శుభసూచకమని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా బొట్ల పరమేశ్వర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘స్థానిక’ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం పట్ల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని, ఆరూ.. కారుకే రావడం ఆనందదాయకమన్నారు. పెద్దల సభకు ఎల్‌.రమణ గారు బోణీ కొట్టారని, శాసన మండలి ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ హవా కొనసాగిందనిపేర్కొన్నారు. మొత్తం 12 స్థానాలకు గాను.. ఆరు సీట్లను ఇప్పటికే ఏకగ్రీవంగా…

తడిసిన ధాన్యం వద్దకు కాంగ్రెస్ నాయకులు

aler news

టిపిసిసి అధ్యక్షులు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మార్కెట్ యార్డ్ లో తడిసిన ధాన్యాన్ని కాంగ్రెస్ నాయకులు అందరూ సందర్శించడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి మార్చుకోవాలని రైతుల పట్ల దొంగ ప్రేమను చూపిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అటు మోడీ ఇద్దరు ఇద్దరే మార్కెట్లో ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల వివక్ష చూపుతూ నిన్న కురిసిన వర్షానికి ధాన్యం తడిసి మొలకలు కూడా వచ్చిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే సరైన ధర ఇచ్చి కొనుగోలు చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో లో మహిళా కాంగ్రెస్ ఇన్చార్జి కోఆర్డినేటర్ యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ టిపిసిసి కార్యదర్శి జనగామ ఉపేందర్ రెడ్డి…