Sk.Zakeer, Editor, Bunker News: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ,తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ ప్రజలను అత్యంత ప్రభావితం చేయగలుగుతున్న నాయకులని ఒక సర్వే వెల్లడించింది. వాగ్ధాటి,ప్రజల్ని మంత్ర ముగ్దుల్ని చేయగల ప్రసంగాలలో ఈ ఇద్దరికీ ఎవరూ సాటిలేరు.ప్రభావశీలుడైన నాయకుడు ప్రధాని మోడీతో టిఆర్ఎస్ నిర్మాత కేసీఆర్ పోటీ పడుతున్నారు.తెలంగాణ యాసతో కూడిన ప్రసంగం… అందులో దొర్లే సామెతలు,ఆకట్టుకునే నినాదాలు కేసీఆర్ సొంతం. తెలుగు,హిందీ,ఇంగ్లీష్ భాషలపై ఉన్న పట్టు వలన కేసీఆర్ ‘ప్రత్యేక’ నాయకునిగా గుర్తింపు పొందుతున్నారు. భాషా పటిమలో మమతా బెనర్జీ,స్టాలిన్,జగన్,నితీష్ కుమార్,ఉద్ధవ్ థాకరే వంటి ముఖ్యమంత్రులను కూడా ఆయన ఎప్పుడో వెనక్కి నెట్టిపారేశారు. ”గాడిదలకు గడ్డేసి… ఆవులకు పాలు పిండితే వస్తాయా?: కత్తి ఇంకొకనికి ఇచ్చి .. ఇంటోన్ని యుద్ధం చేయమంటే కుదురుతదా”? అంటూ ఉద్యమ కాలంలో ఆయన సంధించిన మాటలు తూటాల వలె…
Category: Politics
ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ రాహుల్ శ్రీకారం !!
Zakeer, Editor, Bunker News: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి రాహుల్ గాంధీ వరంగల్ లో శుక్రవారం శ్రీకారం చుడుతున్నారు.ఆయన పర్యటనతో రాజకీయంగా మైలేజ్ సంపాదించడానికి తెలంగాణ కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది.అన్ని రాజకీయ పార్టీల్లో రాహుల్ గాంధీ పర్యటన పైనే చర్చ జరుగుతుంది.సెంటిమెంట్ రాజకీయాలు ‘తల్లివేరు’గా ఉన్న టీఆర్‌ఎస్‌ను అదే సెంటిమెంట్ తో దెబ్బకొట్టాలన్నది టీపీసీసీ కాన్సెప్ట్.ఓయూ విద్యార్థులు తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన విషయంలో ఎవరికీ భిన్నాభిప్రాయం లేదు. ‘ఓయూ’ కేంద్రంగా రాజకీయం నడపాలని,అధికార టిఆర్ఎస్ ను డిఫెన్సులో పడేయాలని టీపీసీసీ భారీ వ్యూహాన్ని రచించింది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు ‘పికప్’ కాలేకపోతున్నదో రాహుల్ గాంధీ తన పర్యటనలో తెలుసుకోబోతున్నారు.పార్టీ కార్యకర్తలతో,పొలిటికల్ అఫైర్స్ కమిటీతోనూ ఆయన సమావేశమవుతారు.అనుమతి లభించకపోయినా రాహుల్ గాంధీని ఓయూకు తీసుకెళ్లడానికే రాష్ట్ర కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. రాహుల్ గాంధీ…
‘పీ.కే’ రాజకీయ ప్రత్యక్షం.. విఫల ప్రయోగం కానున్నదా ?
By Sk.Zakeer, Editor, Bunker News : ”రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడమంటే పాన్ డబ్బా పెట్టినట్టు కాదు ” అని టిఆర్ఎస్ నిర్మాత,ముఖ్యమంత్రి కేసీఆర్ చాలాకాలంగా చెబుతున్న మాట.నిజమే మరి ! రాజకీయపార్టీ పెట్టడానికి ఒక ప్రాతిపదిక తప్పనిసరి.తాత్విక భూమిక అవసరం.ప్రజల నుంచి డిమాండ్ రావాలి.కేసీఆర్ తన అనుభవాన్ని రంగరించి ఈ మాటలు అంటుంటారు.2001 లో ఆయన పార్టీ పెట్టడానికి అవసరమైన ప్రాతిపదిక ‘తెలంగాణ’ ఆకాంక్ష.ప్రత్యేక తెలంగాణ డిమాండును ఇరుసుగా చేసుకొని కేసీఆర్ 21 సంవత్సరాల కిందట రాజకీయ పార్టీని నిర్మించారు.ఇప్పుడా పార్టీ తెలంగాణలో ఎంత శక్తివంతంగా మారిందో,కెసిఆర్ ఎదురులేని మనిషిగా ఎట్లా మారారో కండ్ల ముందు కనబడుతున్నది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రాజకీయపార్టీని స్థాపించబోతుండడం జాతీయ స్థాయిలో చర్చకు దారితీస్తోంది.ఇందుకు కారణం ఆయన ట్రాక్ రికార్డు.ఆయనకు ఉన్న నెట్ వర్క్. కనీసం ఐదారుగురు…
ప్రజల హృదయాల్లో కేసీఆర్ కు సుస్థిరస్థానం : తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మాజీ జెడ్పిటీసీ బొట్ల పరమేశ్వర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి 21వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మాజీ జెడ్పిటీసీ బొట్ల పరమేశ్వర్ హార్థిక శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం ఆయన టీఆర్‌ఎస్ ప్లీనరీ వేదిక వద్ద తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టే నాటికి రాష్ట్ర సాధన కోసం చేసిన అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయని, నిస్పృహలో ఉన్న తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసి రాజకీయ ప్రక్రియ ద్వారా రాష్ట్రాన్ని సాధిస్తానని కేసీఆర్ ముందడుగు వేశారని ఆయన గుర్తు చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఇంతితై వటుడింతై అన్నట్లు 2001 నుంచి నేటి వరకు 21 ఏండ్లుగా ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుందన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి బలమైన సిద్దాంత పార్టీగా పేరుగాంచిందన్నారు.…
Shahnawaz khan rajendarnagar division president YSR telangana party
Today I’ve been appointed as rajendra nagar division president from YSR TELANGANA PARTY . Thank you for attending this occasion mr.ramna (khairtabad incharge) & Shaikh Ghulam saif (mailardevpall division president) & DR.emaam tehseen (mahila mandal chairman) and many more…….. Shahnawaz khan rajendarnagar division president YSR telangana party
కాంగ్రెస్ ఓబిసి సెల్ విభాగం ఆలేరు మండల అధ్యక్షునిగా బందారపు మధు గౌడ్ నియామకం
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల కాంగ్రెస్ ఓబిసి సెల్ విభాగం అధ్యక్షునిగా బందారపు మధు గౌడ్ ని నియమించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఓబిసి విభాగం జిల్లా అధ్యక్షుడు గోదా రాహుల్ గౌడ్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా బంధారపు మధు మాట్లాడుతూ… ”నాపై ఎంతో నమ్మకంతో ఈ పదవికి ఇచ్చినందుకు గాను కృతజ్ఞతలు తెలుగుకుంటున్నాను. ఆలేరు మండల కాంగ్రెస్ ఓబిసి సెల్ విభాగం అధ్యక్షునిగా శతవిధాల కృషి చేస్తాను. గౌరవ భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, ఓబిసి సెల్ రాష్ట్ర చైర్మన్ గారికి, భువనగిరి జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ గారికి ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల అయిలన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ పదవికి పార్టీకి అన్ని…
స్టేట్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సునీతా రావు ఆధ్వర్యంలో రిలేదీక్ష : మైనారిటీ సోదరీమణులకు మద్దతుగా హిజాబ్ పై నిషేధం కార్యక్రమం
శనివారం గాంధీభవన్ లో ఉదయం 10.గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు రిలే దీక్ష స్టేట్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సునీతా రావు గారి ఆధ్వర్యంలో మైనారిటీ సోదరిమణులకు మద్దతుగా హిజాబ్ పై నిషేధం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇతర భారతీయులతో పోలిస్తే ముస్లిములు సమాన హక్కులను పంచుకుంటారు అయితే హిజాబ్ పై నిషేధం దించడం ద్వారా హక్కులను బలహీన పరిచేందుకు బిజెపి. ఆర్ ఎస్ ఎస్ ప్రయత్నిస్తుంది. యూపీ మరియు ఇతర రాష్ట్రాల ఎన్నికలలో హిందుత్వ ఓటర్లను సేకరించేందుకు బిజెపి మతం కార్డు ప్లే చేస్తుంది. ఈ నిషేధం భారతీయుల లౌకికవాదానికి ముప్పు కలిగిస్తుంది. హిజాబ్ ముస్కాన్ మాండ్యా విద్యార్థిని వ్యక్తిగత స్వేచ్ఛ. హిందువులకు సింధూరం పెట్టుకోవడం వ్యక్తిగత స్వేచ్ఛ తాము ఏమి ధరించాలి .ఎలా ఉండాలి. ఏం చేయాలి అన్న విషయాలపై…
జర్నలిస్టులను ఎప్పుడూ గౌరవిస్తాను: ఆర్మూర్ ఎమ్యెల్యే జీవన్ రెడ్డి
– మీడియా స్వేచ్చకు భంగం కలిగిస్తే ఊరుకోను -మాక్లూర్ సంఘటనను ఖండిస్తున్నాను తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుండి నేటి వరకు జర్నలిస్టులను నేను ఎంతో గౌరవిస్తున్నాను… ఇవ్వాళ నేను ఈ స్థాయికి చేరుకోవడానికి జర్నలిస్టు మిత్రులే ప్రధాన కారణం… ఉద్యమంలో జర్నలిస్టులు నాకు అందించిన ప్రోత్సాహాన్ని జీవితంలో మరచిపోలేను….. తన నియోజకవర్గంలో జర్నలిస్టుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను… ఈ చర్యకు పాల్పడిన వారికి శిక్ష పడాల్సిందే….. భవిష్యత్తులో జిల్లాలో ఇలాంటి సంఘటనలు జరగకుండా తగు చర్యలు చేపడతానని నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఆర్మూర్ శాసన సభ్యులు ఏ.జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గం పరిధిలోని మాక్లూర్ సాక్షి విలేఖరి పోశెట్టిపై టీఆర్ఎస్ కార్యకర్తలు ఇటీవల దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయుడబ్ల్యుజె) జిల్లాలో ఆందోళన…
తెలంగాణ కాంగ్రెస్ డిజిటల్ సభ్యత్వ నమోదు మానిటరింగ్ కమిటీ సభ్యురాలిగా నీలం పద్మ వెంకటస్వామి
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేశారు ఈ కమిటీ సభ్యులుగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి చెందిన నీలం పద్మ నియమితులయ్యారు . ఈ సందర్బంగా తెలంగాణ మహిళా కాంగ్రెస్ ఇన్చార్జి కో -ఆర్డినేటర్ , యా దాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ మాట్లాడుతూ తనను 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు మానిటరింగ్ కమిటీ మెంబర్ గా నియమించడం జరిగింది. అవి.. 1. పెద్ద పెళ్లి, 2. కరీంనగర్, 3. చొప్పదండి, 4. వేములవాడ, 5. సిరిసిల్ల, 6. మానకొండూరు. ఈ నియోజకవర్గాలకు సంబంధించి డిజిటల్ సభ్యత్వాలను అధిక సంఖ్యలో చేపడుతామని అన్నారు. నా మీద నమ్మకంతో బాధ్యతలు అప్పగించి తన నియామకానికి సహకరించిన పిసిసి చీఫ్ రేవంత్…
ఆలేరులో ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి
(ఆలేరు -టాలీవుడ్ టైమ్స్) దేశ స్వతంత్ర సంగ్రామంలో కీలక పాత్ర పోషించి యువ భారతావనికి ఆదర్శంగా నిలిచిన స్వర్గీయ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి 125 జయంతి సందర్భంగా యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరులో ఈ రోజు ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఐలయ్య. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంధమల్ల అశోక్, టౌన్ అధ్యక్షులు MA, ఏజాస్, మండల్ అధ్యక్షులు కొండ్రాజు వెంకటేశ్వర్రాజ్,ఈ కార్యక్రమం లో పటేల్ గూడెం గ్రామ శాఖ అధ్యక్షులు జహంగీర్, ఆలేరు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కర్రే అజయ్, యూత్ కాంగ్రెస్ మండల్ అధ్యక్షులు కలకుంట్ల లోకేష్,ప్రభు, శ్రీను,టౌన్ వైస్ ప్రెసిడెంట్ కాసుల భాస్కర్,అంగిడి ఆంజనేయులు NSUI మండల్ అధ్యక్షులు సుంకరి విక్రమ్,కేతావత్ రాహుల్, మైనారిటీ టౌన్ అధ్యక్షులు md బాబా, నరేష్ తదితరులు…