“In fact, the rulers of Pakistan, who were formed by dividing India on the basis of religion, have never been honest. They only show India as a class enemy and live a life of luxury, and they show Kashmir as a disgrace and subjugate the people. Even if that country is completely destroyed, they do not care. All this should be considered as the evil political shadow of the Indian rulers of that time, which has befallen us.” “The spark that caused the division of the country is still burning…
Category: Politics
మతం పేరుతో చంపేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా ? : ఉప్పల్ అసెంబ్లీ బీజేపీ అధికార ప్రతినిధి ఇలిటం నరసింహ్మరెడ్డితో ప్రత్యేక ఇంటర్వ్యూ
”నిజానికి మత ప్రాతిపదికన భారత్‌ను చీల్చుకుని ఏర్పడ్డ పాక్ పాలకులు ఏనాడూ నిజాయితీగా లేరు. భారత్‌ను వర్గశతృవుగా చూపించి పబ్బం గడుపుకోవడం, కాశ్మీర్ బూచి చూపి ప్రజలను వశపర్చుకోవడం తప్ప..ఆ దేశం సర్వ నాశనం అయినా వారికి పట్టింపు లేదు. ఇదంతా నాటి భారత పాలకులు చేసిన దుర్మార్గపు రాజకీయ క్రీనీడ కారణంగా మనకు సంక్రమించిన రావణకాష్టంగా చెప్పుకోవాలి” ”దేశ విభజన తెచ్చి పెట్టిన చిచ్చు ఇంకా రావణ కాష్టంలా కాలుతూనే ఉంది. మత ప్రాతిపదికన దేశాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్ పెద్దలు ఇప్పుడు సమాధానం చెప్పడం లేదు. ఆనాడు దేశాన్ని విభజించకుండా మహాత్ముడు కూడా అడ్డుకోలేక పోయాడు. కేవలం నెహ్రూకు ప్రధాని పదవి కావాలన్న పట్టుదలతో దేశం ముక్కలైనా ఫర్వాలేదన్న రీతిలో ఆనాడు వ్యవహరించారు. దాని ఫలితాలను నేటికీ అనుభవిస్తున్నారని ఉప్పల్ అసెంబ్లీ బీజేపీ అధికార…
రాజ్యాంగాన్ని అవమానిస్తే ఊరుకునేది లేదు : మొగిలి సునీత రావు
ఆలేరు, మే 1: ( టాలీవుడ్ టైమ్స్ ప్రతినిధి) యా దాద్రి భువనగిరి జిల్లా ఎగ్జిక్యూటివ్ మీటింగ్ కు తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మొగిలి సునీత రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ అధ్యక్షతన వహించారు. మొదటగా ఎస్.బి.హెచ్ బ్యాంక్ దగ్గర ఉన్న జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి. గాంధీ గారి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బస్టాండ్ చౌరస్తాలో ఎల్పిజి గ్యాస్ ధరలు పెంచినందుకు నిత్యావసర ధరలు పెంచినందుకు నిరసనగా ఖాళీ సిలిండర్లతో కూరగాయలతో నిత్యావసర వస్తులతోప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. తదుపరి అస్సాం సీఎం హేమంత్ విశ్వశర్మ మహిళలపై చేసిన అనుచిత వాక్యాలను ఖండిస్తూ…
తెలంగాణ కుటుంబ సర్వే దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తుంది: తెలంగాణ అడ్వకేట్ జేఏసీ ప్రెసిడెంట్, ప్రముఖ న్యాయవాది నాగుల శ్రీనివాస యాదవ్
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేతో తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తుందని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ ప్రెసిడెంట్, ప్రముఖ న్యాయవాది నాగుల శ్రీనివాస యాదవ్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ ప్రజల యొక్క స్థితిగతులు తెలుసుకునేందుకు, భవిష్య ప్రభుత్వ ప్రణాళిక ద్వారా మంచి మార్పు తీసుకు వచ్చే దిశగా, ప్రజలను భాగస్వాములను చేసుకుని ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే జరుగుతుందన్నారు. ఈ సర్వే తో తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచిగా ఉంటుందన్నారు. తెలంగాణ సమాజంలో గొప్ప మార్పు రావడానికి ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే చేపట్టడం జరిగిందన్నారు. ఈనెల 6 నుండి ఇండ్ల గుర్తింపు కార్యక్రమం, 9 నుండి ఇంటింటి సర్వే కార్యక్రమం ప్రారంభమైందన్నారు. రాష్ట్రంలో 87 వేల మందికి పైగా ఎన్యూమరేటర్లు సర్వే చేస్తున్నారని, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 30 శాతం…
ఘనంగా సమాజ్ వాది పార్టీ ఆవిర్భావ దినోత్సవం
సమాజ్ వాది పార్టీ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శుక్రవారం జూబ్లీహిల్స్ లో ఘనంగా జరిగాయి. గ్రేటర్ హైదరాబాద్ సమాజ్ వాది పార్టీ నేత దండు బోయిన నిత్య కళ్యాన్ యాదవ్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5 లోని దుర్గా భవాని నగర్ బస్తీలో పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కళ్యాణ్ యాదవ్ మాట్లాడుతూ సమాజ్ వాది పార్టీ ఆవిర్భావ దినోత్సవ తో పాటు దసరా పండుగ నేపథ్యంలో పేదల మధ్య వేడుకలు జరుపుకోవాలని ఉద్దేశంతో తాము పేద మహిళలకు చీరలు పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ లో వచ్చే జిహెచ్ఎంసి ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేస్తామని తెలంగాణ లో రాజ్యాధికారం లక్ష్యంగా పనిచేస్తామని ఆయన అన్నారు. త్వరలోనే నగరా వ్యాప్తంగా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తామని…
సికింద్రాబాద్ జై స్వరాజ్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఆర్.ఎస్.జె థామస్
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలోని సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ జై స్వరాజ్ పార్టీ అభ్యర్థిగా ఆర్ ఎస్ జె థామస్ ను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు కాసాని శ్రీనివాసరావుగౌడ్ ఖరారు చేశారు. హ్యుమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన థామస్ సీనియర్ జర్నలిస్ట్, అలాగే అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సమాజం పట్ల ఆయనకు ఉన్న సేవా దృక్పథాన్ని పరిగణనలోకి తీసుకుని థామస్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు కాసాని తెలిపారు. సికింద్రాబాద్ లో ఉన్న జై స్వరాజ్ పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన పార్టీ సమావేశాల్లో థామస్ ను కండువా కప్పి పార్టీలోకి కాసాని ఆహ్వానించారు. అనాధలు, అభాగ్యులు, పేదలకు తన ఎన్జీఓ సంస్థ ద్వారా సేవలు అందించే థామస్ జై స్వరాజ్ పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యారు. సామాన్య ప్రజల…
ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కాంగ్రెస్ లో చేరిక !!!
ముఖేష్ గౌడ్.. పరిచయం అవసరం లేని పేరు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ తరపున హైదరాబాద్ నుంచి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన నాయకుడు. తండ్రి బాటలోనే రాజకీయాల్లోకి వచ్చిన ఆయన కుమారుడు విక్రమ్ గౌడ్ కూడా అందరికి సుపరిచితమే. ఏమీ ఆశించకుండా బీజేపీ కోసం విక్రమ్ గౌడ్ పని చేశారు. తనకు సరైన గుర్తింపు లభించలేదనే కారణంగానే బిజెపికి రాజీనామా చేశారు విక్రమ్ గౌడ్. ఇదిలా ఉండగా.. విక్రమ్ గౌడ్ త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. విక్రమ్ గౌడ్ తన సొంత గూడు అయిన కాంగ్రెస్ లోకి పిసిసి అద్యేక్షుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో చేరబోతున్నారు. తెలంగాణలో బీసీ నేతగా సుదీర్ఘకాలం పాటు నాయకుడిగా ఉన్న ముఖేష్ గౌడ్ గారి కుమారుడు విక్రం గౌడ్ కాంగ్రెస్లో చేరడం ఒకసారిగా బీసీల నుంచి సపోర్ట్ బాగా పెరిగినట్లుగా…
బిజెపికి విక్రమ్ గౌడ్ రాజీనామా..త్వరలో కాంగ్రెస్ లో చేరిక !!!
హైదరాబాద్ : ముఖేష్ గౌడ్.. పరిచయం అవసరం లేని పేరు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ తరపున హైదరాబాద్ నుంచి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన నాయకుడు. తండ్రి బాటలోనే రాజకీయాల్లోకి వచ్చిన ఆయన కుమారుడు విక్రమ్ గౌడ్ కూడా అందరికి సుపరిచితమే. ఏమీ ఆశించకుండా బీజేపీ కోసం విక్రమ్ గౌడ్ పని చేశారు. తనకు సరైన గుర్తింపు లభించలేదనే కారణంగానే బిజెపికి రాజీనామా చేశారు విక్రమ్ గౌడ్. ఇదిలా ఉండగా.. విక్రమ్ గౌడ్ త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. విక్రమ్ గౌడ్ తన సొంత గూడు అయిన కాంగ్రెస్ లోకి పిసిసి అద్యేక్షుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో చేరబోతున్నారు. తెలంగాణలో బీసీ నేతగా సుదీర్ఘకాలం పాటు నాయకుడిగా ఉన్న ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రం గౌడ్ కాంగ్రెస్ లో చేరడం ఒకసారిగా బీసీల నుంచి సపోర్ట్…
రేవంత్ రెడ్డికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపిన అజహరుద్దీన్
నూతన సంవత్సరం సందర్భంగా టి.పి.సి.సి. వర్కింగ్ ప్రెసిడెంట్, జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మహ్మద్ అజారుద్దీన్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సెక్రటేరియట్ లో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్కలను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కాసేపు సెక్రటేరియట్ లో మంత్రులతో కలసి సందడిగ ముచ్చటించారు. సీఎంను, మంత్రులను కలిసిన వారిలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి మహ్మద్ అబ్దుల్ ఫహీం, కాంగ్రెస్ నేత అసదుద్దీన్ కూడా ఉన్నారు. ఈ సదర్భంగా అజహరుద్దీన్ మాట్లాడుతూ… ఈ కొత్త సంవత్సరంలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లోనూ తెలంగాణాలో అత్యధిక ఎంపీ సీట్లను గెలిచి… కేంద్రంలో రాహుల్ నాయకత్వంలో చాలా బలమైన ప్రభుత్వం ఏర్పాటుకు కృషి చేస్తాం అన్నారు.
మైనార్టీ కోటాలో మంత్రి ఎవరో..?!
తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. ఇందులో కొలువుదీరిన మంత్రి వర్గ కూర్పులోనూ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్క్ కనిపించింది. మొత్తం పదకొండు మంది మంత్రులు కొత్త ప్రభుత్వంలో కొలువుదీరారు. అయితే ఇందులో మాత్రం మైనారిటీలకు చోటు లభించలేదు. కారణం… మరోసారి మంత్రి వర్గ విస్తరణ ఉండటం వల్లనే… ఇంకా మిగిలిన సామాజిక వర్గాలకు ఆయా సమీకరణాలను అనుసరించి మంత్రి పదవులు వరించనున్నాయని ఇప్పటికే సంకేతాలందాయి. దాంతో ముఖ్యంగా మైనారిటీ వర్గాలకు చెందిన వారిలో మంత్రి పదవి ఎవరిని వరిస్తోందో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఇటీవల జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోటీ చేసి స్వల్ప తేడాతే పరాజయం చెందిన మాజీ ఎంపీ, మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ ను రాష్ట్ర మంత్రి వర్గంలోకి తీసుకోవాలని ముస్లిం మైనారిటీ నాయకులు కోరుతున్నారు. గత రెండు దశాబ్దాలుగా…