లఖింపూర్ రైతు హంతకులను శిక్షించాలని మౌనదీక్ష

pcc monadheeksha

ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఉత్తర ప్రదేశ్ లఖింపూర్ రైతు హంతకులను శిక్షించాలని సోమవారం పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేపట్టిన మౌనదీక్షలో పాల్గొన్న పీసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు, యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి, మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు వరలక్ష్మి, ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

భద్ర ప్రొడక్షన్ ‘తగ్గేదే లే’ ఫస్ట్ లుక్ విడుదల

thaggedele telugu movie first look vidudhala

టాలీవుడ్‌లో కొత్త బ్యానర్ ప్రారంభమైంది. నిర్మాతలు ప్రేమ్ కుమార్ పాండే, పీవీ సుబ్బారెడ్డి సంయుక్తంగా కలిసి ప్రారంభించిన భద్ర ప్రొడక్షన్‌ను ఈ రోజు ఎంఈఐఎల్ పీపీరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. భద్ర ప్రొడక్షన్స్ పతాకంపై మొదటి చిత్రంగా తగ్గేదేలే.. అనే ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నవీన్ చంద్ర, దివ్య పిళ్లై, అనన్య సేన్ గుప్తా, రవి శంకర్, రాజా రవీందర్, నాగ బాబు, అయ్యప్ప శర్మ, పృథ్వీ తదితరులు నటించారు. భద్ర ప్రొడక్షన్ కంపెనీ లోగోను ఎంఈఐఎల్ పీపీరెడ్డి ఆవిష్కరించగా.. నిర్మాతలు ప్రేమ్ కుమార్ పాండే, పీవీ సుబ్బారెడ్డి తగ్గేదేలే ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.నిర్మాత ప్రేమ్ కుమార్ పాండే మాట్లాడుతూ.. ‘మంచి కథలను చెప్పేందుకు ఈ ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభించాం. మన చరిత్రలో ఎన్నెన్నో కథలున్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో కల్చర్ ఉంటుంది. మన…

‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు

maa adyakshudigaa manchu vishnu

హోరాహోరీగా సాగిన ఈ పోరులో మంచు కుటుంబానికే ‘మా’ పీఠం దక్కింది. ‘మా’ ఎన్నికల్లో అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలుపొందారు. విమర్శలు, వివాదాల మధ్య రసవత్తరమైన పోరు సాగిన ఎన్నికల్లో మొదటి నుంచి ఆధిక్యంలో ఉన్న ఆయన ప్రకాశ్‌రాజ్‌పై ఊహించని ఘన విజయం సాధించారు. జాయింట్‌ సెక్రటరీగా మంచు విష్ణు ప్యానల్‌కు చెందిన గౌతమ్‌ రాజు గెలుపుపొందగా, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ నుంచి శ్రీకాంత్‌ అధిక ఓట్లతోవిజయాన్ని కైవసం చేసుకున్నారు. . వైస్‌ ప్రెసిడెంట్‌గా మంచు విష్ణు టీమ్‌ నుంచి పృథ్వీ రాజ్‌ విజయం సాధించారు. మొత్తం మీద ఈసీ మెంబర్స్ గా ప్రకాశ్ రాజ్ 11, మంచు విష్ణు 7 గెలుచుకున్నారు. ‘మా’ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నప్పుడే అందరిలో ఉత్కంఠ నెలకొంది. ప్రకాశ్ రాజ్ ప్యానల్‌ నుండి జబర్దస్త్…

అట్టహాసంగా సినీ గోయర్స్ స్వర్ణోత్సవ సినిమా అవార్డుల వేడుకలు

cine goyers awards

హాజరైన గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ సినిమా రంగం మాత్రమే కాదు, ఏ రంగం లో అయినా పురస్కారాలు మంచి ప్రోత్సాహాన్ని అందిస్తాయని, బాధ్యతను మరింత పెంపొందిస్తాయని, అన్ని విధాలుగా రాణించేందుకు దోహదపడతాయని తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ అన్నారు. ప్రతిష్టాత్మక సినీ గోయర్స్ 52వ స్వర్ణోత్సవ ఫిలిం అవార్డుల వేడుకలు శుక్రవారం శిల్పకళా వేదిక లో అట్టహాసంగా జరిగాయి.ముఖ్యఅతిధిగా విచ్చేసిన గవర్నర్ తమిళి సై మాట్లాడుతూ సమాజం లో అత్యంత శక్తివంతమైన ప్రభావవంతమైన వినోద మాధ్యమం సినిమా అని, బాధ్యతాయుత సినిమాలు నిర్మించాలని కోరారు. దక్షిణాది రాష్ట్రాల్లో టాలీవుడ్ సినిమా కు ప్రత్యేక గుర్తింపు ఉందని, లక్షల మంది సినిమా రంగం లో ఉపాధి పొందుతున్నారని అభినందించారు. సమాజం లో నెలకొన్న పరిస్థితులను అధిగమించేందుకు సినిమా రంగం కృషి చేయాలనీ పిలుపునిచ్చారు.డాక్టర్…

మెగాస్టార్ కు ఐదు దశాబ్దాల స్వర్ణోత్సవ సినీ గోయర్స్ పురస్కారం

cinegoyer awards

రాఘవేంద్రరావు, ప్రకాష్ రాజ్, జయప్రదలకు స్వర్ణోత్సవ సినీ గోయర్స్ పురస్కారాలు నేడు సినీగోయర్స్ ఫిలిం అవార్డ్స్- కోట శ్రీనివాసరావు, రాజేంద్ర ప్రసాద్ లకు జీవన సాఫల్య పురస్కారాలు ప్రతిష్టాత్మక సినీ గోయర్స్ 52వ స్వర్ణోత్సవ సినిమా అవార్డ్స్ వేడుక శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు మాదాపూర్ శిల్పకళా వేదిక లో నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ అధ్యక్షులు డాక్టర్ పి.శ్రీధర్, ప్రధాన కార్యదర్శి బి.రామకృష్ణ తెలిపారు. తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ముఖ్య అతిధిగా పాల్గొంటున్నారు. పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె వి రమణాచారి, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తదితరులు పాల్గొంటారని వారు వివరించారు. పాసులు ఉన్నవారికే ప్రవేశం అని, కోవిద్ నిబంధనల ప్రకారం మాస్కులు ధరించి హాజరు కావాలని కోరారు.…

‘మను చరిత్ర’ అందరికీ నచ్చే సినిమా : హీరో శివ కందుకూరి

manucharithra

‘చూసీ చూడంగానే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శివ కందుకూరి హీరోగాా నటించిన తాజా చిత్రం ‘మను చరిత్ర’. లవ్ అండ్ వార్ కాన్సెప్ట్ తో రూపొందుతోన్న ఈ సినిమాను ప్రొద్దుటూరు టాకీస్ ప‌తాకంపై నార‌ల శ్రీనివాసరెడ్డి నిర్మిస్తున్నారు. భరత్ పెదగాని దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ‘మను చరిత్ర’ ప్రీ ఫేస్ పేరుతో టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో.. రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ‘ఇంటెన్స్ లవ్ స్టోరీలతో వచ్చిన చిత్రాలు కచ్చితంగా హిట్ అవుతాయి. దేనితోనూ పోల్చను కానీ ఇటు వంటి కథలతో వచ్చిన చిత్రాలు హిట్ అవుతాయి. ఆర్ఆర్ లేకుండా ఈ చిత్రాన్ని నేను చూశాను. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌కు తగ్గట్టుగా భరత్ కథ రాసుకున్నాడు.…

ఘనంగా ‘వరుణ్ డాక్టర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌

varun doctor pree relese event

‘రెమో’, ‘సీమ రాజా’, ‘శక్తి’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన తమిళ కథానాయకుడు శివ కార్తికేయన్‌. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘వరుణ్‌ డాక్టర్‌’. ఇప్పుడు తమిళ స్టార్‌ హీరో విజయ్‌ ‘బీస్ట్‌’కు దర్శకత్వం వహిస్తున్న నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ తెరకెక్కించిన చిత్రమిది. కె.జె.ఆర్‌. స్టూడియోస్‌ అధినేత కోటపాడి జె. రాజేష్‌… గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఎస్‌.కె. ప్రొడక్షన్స్‌తో సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. విజయదశమి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో అక్టోబర్‌ 9న ‘డాక్టర్‌’ విడుదలవుతోంది. ఈ సందర్భంగా బుధవారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా హాజరైన ప్ర‌ముఖ నిర్మాత‌లు ఏషియ‌న్ సునీల్‌, సుధాక‌ర్‌ రెడ్డి, ‘ఠాగూర్’ మ‌ధు ‘వ‌రుణ్ డాక్ట‌ర్’ బిగ్ టికెట్‌ను ఆవిష్క‌రించారు. అనంతరం సినిమా భారీ విజయం సాధించాలని ఆకాంక్షించారు. హీరో శివ కార్తికేయన్,…

పద్మజ ఫిలిం ఫ్యాక్టరీ ప్రొడక్షన్ నంబర్-2 ప్రారంభం

padmaja filim factory movie opining

పద్మజ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై తొలి ప్రయత్నంగా తీసిన ‘ఇక్షు’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగానే ఈ బ్యానర్ లో రెండో సినిమాను మొదలెట్టారు. ‘ఇక్షు’ చిత్రానికి దర్శకత్వం వహించిన వి వి రుషిక దర్శకత్వంలో నిర్మాత హనుమంత్ రావు నాయుడు నిర్మిస్తున్న ప్రొడక్షన్ 2 చిత్రం గురువారం హైద్రాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో పూజ కార్యక్రమాలతో ప్రారంభం అయింది. ఈ సందర్బంగా చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ‘ఎంఎల్ఏ’ ఫేమ్ దర్శకుడు ఉపేంద్ర క్లాప్ ఇవ్వగా, నిర్మాత డి ఎస్ రావు కెమెరా స్విచ్ ఆన్ చేయగా తొలి షాట్ కు చిత్ర దర్శకురాలు రుషిక గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కో ప్రొడ్యూసర్ సాయి కార్తీక్ మాట్లాడుతూ .. “దసరా నవరాత్రుల సందర్బంగా ఈ రోజు ఈ చిత్రాన్ని…

వాడి-వేడిగా ఊపందుకున్న ‘మా’ ఎన్నికల ప్రచారం

maa elections

-రసవత్తర పోరులో ‘నేను సైతం.. ‘ అంటూ స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో మధు వింజమూరి -ఈసీ మెంబెర్ గా సీరియల్ నెం -31కి విలువైన ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థన ‘మా’ కోసం-మనకోసం’ మనమే అంటూ బరిలో ముందంజ అక్టోబర్‌ 10న జరగనున్న మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎన్నడూ ‘మా’ ఎన్నికల్లో ఇలాంటి ఊపును చూడలేదు. ఇప్పుడు అందరి దృష్టి ‘మా’ ఎన్నికలపైనే ఉంది. ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల వ్యవహారం వాడి-వేడిగా రోజు రోజుకూ తీవ్రంగా వేడెక్కుతోంది. అధ్యక్ష పదవికి ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ఇద్దరూ నువ్వా నేనా? అన్నట్టుగా పోటీ పడుతున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనేది ఉత్కంఠగా మారింది. ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు, మంచు విష్ణు ప్యానల్ సభ్యులు ఎవరికివారే…