‘రౌడీ స్టార్’ చీప్ ట్రిక్స్ … దసరా రోజు ఫ్యాన్స్ కు బిస్కట్ వేసిన విజయ్ దేవరకొండ!

vijaya devarakonda still

విజయదశమి పండగ రోజు ‘రౌడీ స్టార్’ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా పేరుతో బిస్కేట్స్ వేశాడు. గత రాత్రి ట్విట్టర్ ద్వారా ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయిన విజయ్ దేవరకొండ అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తడానికి తెగ ప్రయత్నించాడు. ఫ్యాన్స్ ట్వీట్స్ కు రిప్లై ఇస్తూ, వాళ్లు కోరిన కోరికలు నెరవేరుస్తానని ప్రామిస్ చేశారు. ఒక అభిమాని కోరిక మేరకు అతని ఇంటికి భోజనానికి వస్తానని మాటిచ్చారు విజయ్. అలాగే మీతో ‘లైగర్’ మూవీ చూడాలని ఉందన్న మరో అభిమాని కోరిక తీర్చుతూ నువ్వు ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లోని థియేటర్ లో ‘లైగర్’ మూవీ చూద్దామని చెప్పి ఖుషీ చేయడానికి ప్రయత్నిచాడు. ఇంకొక అభిమానికి విజయ్ దేవరకొండ ఇటీవల ప్రారంభించిన ఏవీడీ మల్టీప్లెక్స్ లో ఏడాదిపాటు ఏ సినిమా అయినా చూసేందుకు టికెట్…

ప్రకృతినే పూజించే పండుగ సద్దుల బతుకమ్మ: చింతల సాయిబాబ

aler news

ప్రకృతినే పూజించే పండుగ సద్దుల బతుకమ్మ. ఆడబిడ్డలంతా ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ బతుకమ్మ అని దీనశరణ్య స్వచ్ఛందసేవా సంస్థ అధ్యక్షులు చింతల సాయిబాబ అన్నారు. గురువారం ఆయన ‘టాలీవుడ్ టైమ్స్ న్యూస్’ ప్రతినిధితో మాట్లాడుతూ ”గడిచిన ఎనిమిది రోజులుగా తీరొక్క పువ్వులతో ఎంతో సంబరంగా జరుపుకునే బతుకమ్మ వేడుకల్లో భాగంగా నేడు చివరి రోజు సద్దుల బతుకమ్మను ఆడబిడ్డలంతా ఘనంగా జరుపుకున్నారని అయన పేర్కొన్నారు. ప్రజాగాయని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్కతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నామన్నారు. పూలను పూజించి ప్రకృతిని ఆరాధించే పండగ బతుకమ్మ పండగ అని అన్నారు. ప్రేమ సేవా సదనం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సద్దుల బతుకమ్మలో పాల్గొని ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశామన్నారు. పూలను పూజించి ఆరాధించే తెలంగాణ బతుకమ్మకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందని తీరు…

‘ ప్రేమ సేవా సదనం’ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ

aler news

-తెలంగాణ బతుకమ్మకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వాయనాల కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాగాయని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క పూలను పూజించి ప్రకృతిని ఆరాధించే పండగ బతుకమ్మ పండగ అని ప్రజాగాయని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క అన్నారు. ప్రేమ సేవా సదనం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సద్దుల బతుకమ్మలో వాయనాల కార్యక్రమంలో ఆమె పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.బతుకమ్మ పాటలు పాడి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈసందర్భంగా మాట్లాడారు. పూలను పూజించి ఆరాధించే తెలంగాణ బతుకమ్మకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందని తీరు తీరు పువ్వులతో పేర్చే బతుకమ్మ విశిష్టతను నిరంతరంగా చాటి చెప్పడానికి బహుజన బతుకమ్మ కార్యక్రమం చేపట్టామని అన్నారు.అక్టోబర్ 6 న ఉస్మానియా ప్రాంగణంలో ప్రారంభమైన బహుజన బతుకమ్మ 9 రోజులు,9 జిల్లాలలో జరిగి గురువారం యాదాద్రి…

దీపావళికి రానున్న ‘బ్యాక్ డోర్’

పూర్ణ ప్రధాన పాత్రలో తేజ త్రిపురాన హీరోగా ఆర్చిడ్ ఫిలిమ్స్ పతాకంపై నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వంలో బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన ‘బ్యాక్ డోర్’ చిత్రం సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని దీపావళి విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి ‘క్లీన్ యు’ సెన్సార్ సర్టిఫికెట్ లభించడం విశేషం. ఈ సందర్బంగా నిర్మాత బి.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ…”బ్యాక్ డోర్’లో కుర్రకారును కట్టి పడేసే అంశాలతోపాటు…అన్ని వర్గాలవారిని అలరించే అంశాలు మెండుగా ఉన్నాయి. పూర్ణతోపాటు హీరో తేజ చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. త్వరలోనే థియేటర్ ట్రైలర్ రిలీజ్ చేసి దీపావళికి సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు. తను నటించిన ‘బ్యాక్ డోర్’ క్లీన్ యుతో రిలీజ్ కానుండడం పట్ల హీరోయిన్ పూర్ణ సంతోషం వ్యక్తం చేశారు.ఈ చిత్రానికి కో-డైరెక్టర్: భూపతిరాజు…

18న ‘ఆరాధన’ 26వ వార్షికోత్సవం

aaradhana news

విశిష్టమైన కార్యక్రమాల ద్వారా ఉన్నతమైన సేవలను అందిస్తూ హైదరాబాద్ కు చెందిన ‘ఆరాధన’ సంస్థ తనకంటూ ఓ ప్రత్యేకతను నిలుపుకుంటోంది. గత 25ఏళ్లుగా లెక్కకు మించి కార్యక్రమాలు నిర్వహించి వివిధరంగాలకు చెందిన ఎందరినో గుర్తించి సత్కరించి..అవార్డులను అందజేస్తూ వస్తోంది. అందులో భాగంగానే ఈనెల 18న తన 26వ వార్షికోత్సవాన్ని జరుపుకోనుంది. ‘విజయంలో భార్యాభర్తల భాగస్వామ్యం’ పేరుతో నిర్వహించే ఈ వార్షికోత్సవం సోమవారం 18న హైదరాబాద్ లోని చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభలో సాయంత్రం 6 గంటలకు జరగనుందని ‘ఆరాధన’ వ్యవస్థాపకులు, ప్రధానకార్యదర్శి లోకం కృష్ణయ్య తెలిపారు. ఈ సందర్బంగా నిర్వహించే వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా ప్రముఖ సాహితీవేత్త డా. ఓలేటి పార్వతీశం, సన్మాన కర్తలుగా సికింద్రాబాద్ ఉజ్జయని మహంకాళి దేవస్థానం కు చెందిన ప్రధానార్చకులు శ్రీ బి. రామతీర్థ శర్మ, శ్రీమతి బి. రాజ్యలక్ష్మి, సభాధ్యక్షులుగా లయన్స్…

ఆకాష్ పూరి ‘రొమాంటిక్’ నుంచి ‘పీనే కే బాద్’ లిరికల్ వీడియో సాంగ్ విడుదల

Peene Ke Baad Song From Akash Puri’s Romantic Is Out

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన తనయుడు ఆకాష్ పూరి రొమాంటిక్ చిత్రం కోసం కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అనిల్ పాడూరి తెరకెక్కిస్తున్నారు. కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందిస్తున్నారు.రొమాంటిక్ చిత్రం నుంచి ఇప్పటికే విడుదల చేసిన రెండు పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక నేడు పీనే కే బాద్ అంటూ మూడో పాటకు సంబంధించిన లిరికల్ వీడియోను విడుదల చేశారు. బాధల్లో ఉన్నప్పుడు, మద్యం సేవించిన అనంతరం ఉండే ఆ ఎనర్జీని చూపించేలా ఈ పాట సాగుతుంది. పాట థీమ్‌కు తగ్గట్టుగా ఓ పబ్‌లో ఈ పాటను షూట్ చేశారు. క్లబ్‌లో ఈ పాటను షూట్ చేస్తున్న సమయంలోనే అద్భుతమైన ఆదరణ వచ్చింది.పాటను భాస్కర భట్ల, పూరి జగన్నాథ్ గారు ఎంతో హాస్యధోరణిలో రాసేశారు.…

Shaan roped in as actor-singer for the Ilaiyaraaja musical ‘Music School’

Shaan roped in as actor-singer for the Ilaiyaraaja musical 'Music School'

by SALMA KHAN@Tollywoodtimes Renowned for his euphonious voice, singer Shaan has stepped aboard for Papa Rao’s Biyyala’s Hindi directorial debut, Music School, a musical by Ilaiyaraaja in the capacity of an actor. The director-writer was thoroughly impressed by the singer’s flamboyance as the latter sang in Ilaiyaraaja’s studio after which he was offered a part in the upcoming musical. Starring Sharman Joshi and Shriya Saran, the forthcoming musical shall witness Shaan in the role of Saran’s ex-boyfriend. What’s more is that apart from acting, he will also be singing a…

ఇళ‌య‌రాజా ‘మ్యూజిక్ స్కూల్’లో షాన్

Shaan roped in as actor-singer for the Ilaiyaraaja musical 'Music School'

వైవిధ్యమైన స్వరంతో పాటలు పాడుతూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ సింగర్ షాన్ ఇప్పుడు పాపారావు బియ్యాల దర్శకుడిగా పరిచయమవుతూ తెలుగు, హిందీ భాష‌ల్లో తెరకెక్కిస్తోన్న చిత్రం ‘మ్యూజిక్ స్కూల్‌’ కోసం న‌టుడిగా మారారు. మాస్ట్రో ఇళ‌య‌రాజా ఈ చిత్రానికి సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. త‌న విల‌క్ష‌ణ గాత్రంతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్న సింగర్ షాన్ ‘మ్యూజిక్ స్కూల్’ ద‌ర్శ‌క నిర్మాత‌ల‌ను కూడా ఆక‌ట్టుకున్నారు. అయితే గాత్రంతోనే కాదు బాడీ లాంగ్వేజ్‌తోనూ. ఇళ‌య‌రాజా స్టూడియోలో ఓ పాట పాడిన ఈ సింగ‌ర్‌ను చూసి, పాత్ర‌కు స‌రిపోతాడ‌ని భావించి త‌మ‌ సినిమాలో న‌టించాల‌ని చిత్ర‌ ద‌ర్శ‌క నిర్మాత‌లు కోరారు. శ‌ర్మ‌న్ జోషి, శ్రియా శ‌ర‌న్ న‌టిస్తున్న ఈ చిత్రంలో శ్రియ మాజీ ప్రేమికుడుగా షాన్ క‌నిపించ‌బోతున్నారు. షాన్ ఈ సినిమాలో న‌టించ‌డంతో పాటు సినిమాలో పాట…

జర్నలిస్టుల సమస్యలపై నిర్లక్ష్యం తగదు

general news

టీయుడబ్ల్యుజె రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆగ్రహం జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యం తగదని, వివిధ వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్నట్లు గొప్పలు చెబుకుంటున్న పాలకులు జర్నలిస్టుల సంక్షేమాన్ని ఎందుకు విస్మరిస్తున్నారని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ), తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యుజె) నాయకత్వం ప్రశ్నించింది.ఆదివారం నాడు హైదర్ గుడ లోని సెంటర్ పార్క్ హోటల్ కాన్ఫరెన్స్ హాలులో టీయుడబ్ల్యుజె రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై దాదాపు 6 గంటల పాటు సమావేశం చర్చించింది. ముఖ్యంగా కోవిడ్ తో పాటు వివిధ సంఘటనల్లో అకాల మరణం చెందిన జర్నలిస్టుల కుటుంబాలు దీనస్థితిలో జీవితాలు గడుపుతున్నా బాధితులను ప్రభుత్వం పట్టించుకోక పోవడం విచారకరమని ఐజేయూ జాతీయ అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి ఆవేదన…

‘గోర్ మాటి’ పాటని ఆవిష్కరించిన చంద్రబోస్

gormaati movie still

బంజారా బిగ్ సినిమాస్ పతాకంపై శంకర్ జాదవ్ , కరిష్మా, అదిరే అభి, సిరిరాజ్ ప్రధాన తారాగణంగా శంకర్ జాదవ్ దర్శకత్వంలో రేఖ్య నాయక్ రెండు బాషల్లో నిర్మిస్తున్న చిత్రం తెలుగులో రాజ్ పుత్ (బార్న్ ఆఫ్ వారియర్), బంజారాలో గోర్ మాటి (పవర్ ఆఫ్ యూనిటీ). ఈ చిత్రానికి సంబంధించిన పాటని గీత రచయిత చంద్రబోస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబోస్ మాట్లాడుతూ.. ‘ఇండియాలో 12 కోట్ల మంది బంజారాలు ఈ సినిమాను ఖచ్చితంగా చూడాల్సిన చిత్రం. కచ్చితంగా ఈ సినిమానిఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. నటీనటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. దర్శకుడు ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ చిత్రాన్ని ఆదరిస్తే ఇలాంటివి మరెన్నో చిత్రాలు వారు మీముందుకు తీసుకువస్తారు. ఈ సినిమా కచ్చితంగా హిట్ సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ‘జబర్దస్త్’…