ఇప్పడు ‘రాధే శ్యామ్’ పరిస్థితి ఎలా ఉందంటే..?

Radhesyam Movie

‘ట్రిపుల్ ఆర్‌’ కొత్త రిలీజ్ డేట్లు వ‌చ్చేశాయి. మార్చి 18 లేదంటే… ఏప్రిల్ 28న ఈసినిమాని విడుద‌ల చేస్తామ‌ని చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. ఇది ఊహించిన ప‌రిణామ‌మే. ఎందుకంటే ఏప్రిల్ 28న ఆర్‌.ఆర్‌.ఆర్ విడుద‌ల అవుతుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు ముందే ఊహించాయి. ఆర్‌.ఆర్‌.ఆర్ కి త‌గిన స్లాట్ అక్క‌డే ఉంది. రాజ‌మౌళి ఆర్‌.ఆర్‌.ఆర్ రిలీజ్ డేట్ చెప్పేసి, చేతులు దులుపుకున్నాడు గానీ, ఇప్పుడు మిగిలిన సినిమాల‌న్నీ ఒత్తిడిలో ప‌డిపోయాయి. ముఖ్యంగా రాధేశ్యామ్‌. టాలీవుడ్ లో తెర‌కెక్కిన రెండు భారీ చిత్రాలు ఆర్‌.ఆర్‌.ఆర్‌, రాధే శ్యామ్. రెండూ పాన్ ఇండియా సినిమాలే. రెండూ సంక్రాంతికి వ‌ద్దామ‌నుకుని వాయిదా ప‌డ్డాయి. ఇప్పుడు ఈ రెండు సినిమాలూ వీలైనంత త్వ‌ర‌గా రావాలి. లేదంటే.. వ‌డ్డీల భారం మోయ‌లేక ఇబ్బంది ప‌డాల్సి వుంటుంది. అందుకే ముందుగా రాజ‌మౌళి రంగంలోకి దిగిపోయాడు. త‌న సినిమా రిలీజ్…

Ramcharan- Shankar Movie: రామ్‌చరణ్‌ – కియారాల పాటతో ప్రారంభం?

Ramcharan- Shankar Movie: రామ్‌చరణ్‌ - కియారాల పాటతో ప్రారంభం?

రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. చిన్న బ్రేక్‌ తర్వాత ఈ సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌ను ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. ఈ షెడ్యూల్‌ను ఫిబ్రవరి రెండో వారంలో ఓ పాట చిత్రీకరణతో ప్రారంభించాలనే ఆలోచనలో ఉందట చిత్రబృందం. సునీల్, నవీన్‌ చంద్ర, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని ‘దిల్‌’ రాజు, శిరీష్‌లు నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు.

‘పుష్ప’ తర్వాత స్థానంలో ‘ఏకమ్’

Ekam Movie

# అమెజాన్ ప్రైమ్ లో అమేజింగ్ రెస్పాన్స్!! # బ్రహ్మరథం పడుతున్న ఓటిటి ఆడియన్స్!! ఎస్.ఎమ్.ఎస్ క్రియేషన్స్ పతాకంపై యువప్రతిభాశాలి “వరుణ్ వంశీ.బి”ని దర్శకుడుగా పరిచయం చేస్తూ ఎ.కళ్యాణ్ శాస్త్రి-పూజ.ఎమ్-శ్రీరామ్.కె సంయుక్తంగా నిర్మించిన విభిన్న కథాచిత్రం “ఏకమ్”. “ది జర్నీ ఆఫ్ ఏ జాబ్ లెస్ గాడ్” అన్నది ఉప శీర్షిక. అమెజాన్ ప్రైమ్ లో లభ్యమవుతున్న ఈ చిత్రం ఉత్తమాభిరుచి కలిగిన ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తోంది. అభిరామ్ వర్మ, శ్వేతావర్మ, తనికెళ్ళ భరణి, అదితి మ్యాకల్, కల్పిక గణేష్, దయానంద్ రెడ్డి ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రం… యువదర్శకుడు వరుణ్ వంశీపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. అమెజాన్ ప్రైమ్ లో మొదటి స్థానంలో ఉన్న “పుష్ప” సరసన సగర్వంగా సెకండ్ ప్లేస్ లో నిలిచి అందరి దృష్టి విశేషంగా ఆకర్షిస్తోంది. అమెజాన్ ప్రైమ్ లో 503…

జనవరి 28న కీర్తి సురేష్ ‘గుడ్ లక్ సఖి’ విడుదల

Keerthy Suresh’s Good Luck Sakhi Releasing On January 28th

జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం గుడ్ లక్ సఖి. క్రీడా నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ షూటర్‌గా కనిపించనున్నారు. ఇందులో ఆది పినిశెట్టి, జగపతి బాబు ప్రధాన పాత్రలు పోషించారు. సహ నిర్మాతగా శ్రావ్య వర్మ నేతృత్వంలో ఎక్కువ మంది మ‌హిళా టెక్నీషియన్స్ తో ఈ చిత్రం రూపొందింది. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని చిత్రయూనిట్ ప్రకటించింది. రిపబ్లిక్ డే అయిన రెండు రోజులకు అంటే జనవరి 28న గుడ్ లక్ సఖి సినిమా విడుదల కానుంది. ఇక గుడ్ లక్ సఖి సినిమాకు పోటీగా మరే చిత్రం లేకపోవడంతో మేకర్ల మరింతగా ప్రమోట్ చేయాలని భావిస్తున్నారు. ఇక సినిమా విడుదలకు వారం రోజులే ఉండటంతో ప్రమోషన్స్‌ ను వేగవంతం చేయనున్నారు. నగేష్…

Keerthy Suresh’s Good Luck Sakhi Releasing On January 28th

Keerthy Suresh’s Good Luck Sakhi Releasing On January 28th

National Award-Winning Actress Keerthy Suresh will next be seen in a woman-centric sports rom-com film Good luck Sakhi, where she played the role of a shooter. Aadhi Pinisetty will be seen as male lead, while Jagapathi Babu essayed a crucial role in the film boasts proudly of a female dominated crew lead by co-producer Shravya Varma. The makers today announced the release date of the movie. Good Luck Sakhi will be releasing on January 28th, two days after the Republic Day. The film will most probably have no competition, as…

ద‌ర్శ‌కుడు మారుతీ విడుద‌ల‌ చేసిన‌ `కొత్త కొత్త‌గా..’ ​నుంచి డైమండ్ రాణి సాంగ్ కు మంచి స్పంద‌న‌

Kottakottaga Movie song relesed by director Maaruthi

అజయ్‌, వీర్తి వఘాని, హీరో హీరోయిన్లుగా, ఆనంద్ (సీనియర్ హీరో), తులసి, కాశీవిశ్వనాద్, కల్యాణి నటరాజన్ ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టిస్తున్న చిత్రం `కొత్త కొత్త‌గా`. బి జి గోవిందరాజు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని మురళీధర్ రెడ్డి ముక్కర నిర్మిస్తున్నారు యూత్ ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి హనుమాన్ వాసంశెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రంలోని `డైమండ్ రాణి ..`సాంగ్ ను శుక్ర‌వారం ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతీ ఆవిష్క‌రించారు. అనంత‌రం ఆయ‌న చిత్ర యూనిట్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. శేఖర్ చంద్ర సంగీతం దర్శకత్వంలో కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా, అనురాగ్ కులకర్ణి పాడిన `డైమండ్ రాణి ..`సాంగ్ ను ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుద‌ల చేసిన కొద్ది సేప‌టికే మంచి స్పంద‌న రావ‌డం విశేషం. మంచి ప్రేమ‌క‌థా చిత్రంగా రూపొందుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ను…

‘న‌ల్ల‌మ‌ల’ చిత్రంలోని `మ‌న్నిస్తారా మూగ‌జీవులారా…` పాట‌కి స్పంద‌న‌

Nallamala movie

అమిత్‌ తివారీ, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్‌ ఘోష్, కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం `నల్లమల`. నల్లమల అడవి చుట్టూ జరిగిన ఎన్నో చీకటి కోణాలను, సామాన్య జనానికి తెలియని అవినీతి ఒప్పందాల నేప‌థ్యంలో ఆస‌క్తిక‌ర క‌థా క‌థ‌నాల‌తో తెర‌కెక్కిన ఈ చిత్రానికి ఆర్‌.ఎమ్ నిర్మాత‌. ఈ మూవీలోని సిద్ శ్రీ‌రామ్ పాడిన ఏమున్న‌వే పిల్లా సాంగ్ మిలియ‌న్స్ కి పైగా వ్యూస్ సాధించి సోష‌ల్ మీడియాలో సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌, అన్ని పాట‌ల‌కి విశేష స్పంద‌న ల‌భించింది. తాజాగా ఈ చిత్రంలోని `మ‌న్నిస్తారా మూగ‌జీవులారా…` పాట‌ను ద‌ర్శ‌కేంద్రుడు కే.రాఘ‌వేంద్ర‌రావు విడుద‌ల‌చేశారు. ఈ సంద‌ర్భంగా .. ద‌ర్శ‌కేంద్రుడు మాట్లాడుతూ – “ద‌ర్శ‌కుడు ర‌విచ‌ర‌ణ్ మ‌న్నిస్తారా పాట‌ను చాలా బాగా చిత్రీక‌రించాడు. అప్పుడ‌ప్పుడు న‌ల్ల‌మ‌ల సినిమా ప్రోమోస్ చూస్తుంటాను. కొత్త…

Dhanush Divorce: ఆ హీరోయిన్ల వల్లే ధనుష్‌-ఐశ్వర్యలు విడిపోయారు!?

Dhanush Divorce:

భార్య ఐశ్వర్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన తరువాత తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ పేరు మరోసారి సంచలనమైంది. తన భార్య ఐశ్వర్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అభిమానులకే కాదు కోలీవుడ్ కు ఊహించని షాక్‌ ఇచ్చారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఐశ్వర్య- ధనుష్‌లు18 ఏళ్ల తర్వాత తమ వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. మంచి స్నేహితులుగా, దంపతులుగా, ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులుగా, పరస్పర శ్రేయోభిలాషులుగా ఇంతకాలం కలిసి జీవిస్తున్న తాము ఇకపై భార్యభర్తలుగా విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. నిజానికి వీరిద్దరి మధ్య సుచీలీక్స్‌ వ్యవహారంతోనే కలహాలు మొదలయ్యాయని కోలీవుడ్‌ టాక్‌. తమిళనాట స్టార్‌ హీరోగా పేరు సంపాదించుకున్న ధనుష్‌ పేరు సుచీ లీక్స్‌లో బయటపడటం అప్పట్లో సెన్సేషన్‌కు దారితీసిన విషయం తెలిసిందే. 2017లో కోలీవుడ్‌ను ఊపేసిన అత్యంత వివాదాస్పద…

టాలీవుడ్ స్టార్ హీరోల రేంజ్ ఇది !?

special Story Tollywood Heros

పాన్ ఇండియా పాట పాడుతున్న మన టాలీవుడ్ స్టార్ హీరోలు.. అంతే రేంజ్ లో భారీ రెమ్యూనరేషన్ లు కూడా అందుకుంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. ‘బాహుబలి’ ఎప్పుడైతే విడుదలైయిందో.. మన టాలీవుడ్ రేంజే పూర్తిగా మారిపోయింది. మన హీరోలంతా.. పాన్ ఇండియా జపం చేయడంతో టాలీవుడ్ సినిమాల పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. దాంతో మన కథలకు మన హీరోలకు దేశవ్యాప్తంగా డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. ఒకప్పుడు మన టాలీవుడ్ ను చిన్న చూపు చూసిన బాలీవుడ్, కోలీవుడ్ లాంటి ఇండస్ట్రీలే ఇప్పుడు బాప్..రే టాలీవుడ్ అంటున్నాయి. దాంతో మన హీరోల స్థాయి కూడా అమాంతం పెరిగిపోయింది. దాంతో పాటు వారి రెమ్యూనరేషన్లు కూడా భారీగా రెట్టింపు అయ్యాయి. అందులో భాగంగానే దేశ వ్యాప్తంగా ఇఫ్పుడు భారీ పారితోషికం తీసుకుంటున్న హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. పాన్…

మలినేని గోపీచంద్ సినిమాలో బాల‌య్య 60 ఏళ్ల వృద్ధుడిగా కనిపించబోతున్నారా?

NBK-Malineni Gopichand

నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ సాధించిన కలెక్షన్స్ తో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిసింది. దాంతో ఇప్పుడు ఎవ్వరినోటా విన్నా బాలయ్య జపమే! యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం ‘అఖండ’ సినిమా స‌క్సెస్ బాగా ఎంజాయ్ చేస్తున్నవిషయం తెలిసిందే. ‘అఖండ’ ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా వ‌సూళ్లు రాబ‌ట్ట‌డంతో పాటు విజయవంతంగా 50 రోజులు 103 థియేటర్లలో పూర్తిచేసుకుంది. అస‌లు ఇప్పుడు ఉన్న ఈ క్లిష్ట ప‌రిస్థితుల్లో ఓ సినిమాకు లాంగ్ ర‌న్ ఉండ‌డం లేదు. అలాంటిది ‘అఖండ’ ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 50కు పైగా కేంద్రాల్లో 50 రోజులు పూర్తిచేసుకోవడమంటే మాటలు కాదు. . మ‌రోవైపు బుల్లితెర‌పై అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్బీకే షోతో అక్క‌డ కూడా బాల‌య్య షేక్ చేస్తున్నాడు. ఇదే ఊపులో బాల‌య్య వ‌రుస పెట్టి సినిమాలు అంగీక‌రిస్తున్నాడు. ఆయన తదుపరి చిత్రం మ‌లినేని…