మెగాస్టార్ తో మరోసారి త్రిష!?

Megastar-Trisha

త్రిష మెగాస్టార్ కి హీరోయిన్ గా నటించబోతుందట అంటూ సోషల్ మీడియాలో వార్త బాగా వైరల్ అవుతోందిప్పుడు. మెగాస్టార్ చిరంజీవితో యువతరం దర్శకుడు వెంకీ కుడుముల ఓ పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా శృతి హాసన్ ను ఫైనల్ చేశారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు మెగాస్టార్ సరసన మరో హీరోయిన్ త్రిష పేరు కూడా వినిపిస్తోంది. చిరు – త్రిష జోడీ గతంలోనే ఒక సినిమా చేయాలి. కానీ, కొన్ని కారణాల కారణంగా ఆ సినిమా నుంచి త్రిష తప్పుకుంది. ఇప్పుడు ఈ జోడీ వెంకీ కుడుముల సినిమాలో కనిపింబోతుందట. మెగాస్టార్ కంటిన్యూగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు కాబట్టి, వెంకీ సినిమాని కూడా త్వరలోనే పట్టాలెక్కి స్తారట. కాగా…

సౌత్ లో ‘అఖండ‌’ నార్త్ లో స‌ల్మాన్‌తో మెయిన్ ఛాలా… జోరుమీదున్న ప్ర‌గ్యా జైస్వాల్‌

heroine pragya jaiswall

`కంచె` సినిమా హీరోయిన్ ప్ర‌గ్యాజైస్వాల్‌కి సౌత్‌లో ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలేవీ అక్క‌ర్లేదు. రీసెంట్‌గా అఖండ బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ కావ‌డంతో ప్ర‌గ్యా జోరు మ‌రో రేంజ్‌లో ఉంది. 50 రోజులు పూర్తి చేసుకుని స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది నంద‌మూరి బాల‌కృష్ణ స‌ర‌స‌న ప్ర‌గ్యా న‌టించిన అఖండ సినిమా. అదే జోరుతో నార్త్ లోనూ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది ప్ర‌గ్యా జైస్వాల్‌. సల్మాన్ ఖాన్ స‌ర‌స‌న మెయిన్ ఛాలా అంటూ ఆడిపాడి హిందీ డెబ్యూ ఇచ్చేశారు ప్ర‌గ్యా. ఈ పాట‌లో స‌ల్మాన్‌, ప్ర‌గ్యా మ‌ధ్య కెమిస్ట్రీ అద్దిరిపోయింద‌ని అంటున్నారు ఆడియ‌న్స్. రీసెంట్ టైమ్స్ లో రిలీజైన సింగిల్స్ లో మెయిన్ ఛాలాకు మంచి స్పంద‌న వ‌స్తోంది. ఈ పాట గురించి ప్ర‌గ్యా మాట్లాడుతూ “స‌ల్మాన్ ఖాన్ సార్‌తో ప‌నిచేయాల‌ని ప్ర‌తి ఆర్టిస్టుకీ ఒక క‌ల ఉంటుంది. నేను ఈ రంగంలో అడుగుపెట్టిన‌ప్పుడు…

ఫిబ్రవరి 25న ‘భీమ్లా నాయక్’ విడుదల

Bheemla-Nayak

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘భీమ్లా నాయక్’ విడుదలకు సిద్దమయ్యాడు. ఈ సినిమాపై మాస్ ఆడియెన్స్ లో మంచి అంచనాలు నెలకొంటున్నాయి. మరి దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మేకర్స్ వచ్చే ఫిబ్రవరి 25న ఎట్టి పరిస్థితుల్లో థియేటర్స్ లో రిలీజ్ చేయాలని సిద్ధమయ్యారు. ఈ సినిమా ఫిబ్రవరి 25 రిలీజ్ లో ఎలాంటి మార్పు లేదట. ఆల్రెడీ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ కి గాను ఒక క్లారిటీ ఇచ్చేశారట. అందులో భాగంగా ఈ చిత్రాన్ని అక్కడ భారీ స్థాయి విడుదలకి ప్లాన్ చెయ్యాలని చూస్తున్నారట. అన్ని భాషల నుంచి కూడా పెద్దగా ఎలాంటి సినిమాలు లేకపోవడంతో ‘భీమ్లా నాయక్’ కు మరింత ప్లస్ అయ్యిందని చెప్పాలి.

బాలయ్య ‘అన్ స్టాపబుల్’ షోకు చిరు ఎందుకు రాలేదు?

balakrishna-unstoppable-show-writer-bvs-ravi-about-chiranjeevi

ఓటీటీలో అన్ లిమిటెడ్ ఎంటర్ టైన్మెంట్ తో ‘అన్ స్టాపబుల్’ అనే టాక్ షోతో బాలయ్య యావత్తు తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ షోకి చాలా మంది సేలబ్రిటీలు వచ్చారు. వారితో సరదాగా మాట్లాడుతూనే ప్రేక్షకులకు కావల్సిన కాంట్రవర్సీస్ మొదలకొని ఎమోషన్స్ వరకు అన్ని కోణాల్లో ప్రశ్నలు గుప్పిస్తూ అలరిస్తారు బాలయ్య. అయితే తాజాగా ఒక న్యూస్ బాగా వైరల్ అయింది. అదేంటంటే ఇంత మంది సెలబ్రిటీలు వచ్చిన ఈ షోకి టాలీవుడ్ మెగా బాస్ చిరంజీవి రాకపోవడం వెనక ఏంటి మతలబు అంటూ కొందరు ఆరా తీస్తున్నారు. మొదలుపెట్టిన రోజు నుంచి ఈ షోకు చిరంజీవి వస్తారా.. రారా? అనే చర్చ ఓవైపు నడుస్తూనే ఉండగా, మరోవైపు బాలయ్య టాక్ షో సీజన్-1 పూర్తయింది. చిరంజీవి లేకుండానే ఓ సీజన్ ముగిసింది. ఇంతకీ బాలయ్య టాక్…

‘జయహో ఇండియన్స్’ నుంచి విడుదలైన ‘ఆంథమ్‌’కు అనూహ్య స్పందన!!

jayaho Indians

ది భీమ్ రెడ్డి క్రియేషన్స్ పతాకంపై రాజ్ భీమ్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా జయహో ఇండియన్స్. ఆర్ రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకుడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మతం పేరుతో రగిలే కార్చిచ్చులో బలయ్యేదెవరు.. నాయకులా..? అమాయకులా..? దేశమా..? ఈ కాన్సెప్టుతో ఈ సినిమా తెరకెక్కుతుంది. అది స్పష్టంగా పోస్టర్లో కనిపించేలా హీరో లుక్ డిజైన్ చేశారు దర్శక నిర్మాతలు. తాజాగా ఈ సినిమా వీడియో సాంగ్ విడుదలైంది. జయహో ఇండియన్స్ ఆంథమ్ ఇది. గణతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ పాటకు అనూహ్య స్పందన వస్తుంది. ఈ పాటలో లిరిక్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. జైపాల్ రెడ్డి నిమ్మల సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నాడు. బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటర్. ఈ…

‘సర్కారు వారి పాట’ విడుదల తేదీపై క్లారిటీ రాదా?!

Sarkaru-Vaari-Paata

సూపర్ స్టార్ మహేష్ బాబు -కీర్తి సురేష్ జంటగా రూపొందుతున్న ‘సర్కారు వారి పాట’ చిత్రానికి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్స్ వస్తూనే ఉన్నాయి. దర్శకుడు పరశురామ్ ఈ చిత్రాన్ని ప్రిన్స్ మహేష్ కెరీర్ లోనే మరో మైలు రాయిగా నిలిచిపోయే విధంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంపై మహేష్ అభిమానులు కూడా అంతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ కొంచెం బ్యాలన్స్ ఉంది. ఆ బ్యాలన్స్ ను మేకర్స్ కాస్త నెమ్మదిగానే ప్రారంభించనున్నట్టు తెలిసింది. అయితే.. ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ ఇప్పుడు ప్రచారంలో ఉంది. అతి త్వరలో ఈ సినిమాకి సంబంధించి ఒక కొత్త అప్డేట్ ని మేకర్స్ రివీల్ చెయ్యబోతున్నట్టు తెలిసింది. మరి అది కూడా బహుశా సినిమా ఫస్ట్ సింగిల్…

అదేంటి? ధనుష్‌, ఐశ్వర్యలు మళ్లీ కలిశారా?

Dhanush-iswarya

ధనుష్‌, ఐశ్వర్యలు విడిపోయిన తర్వాత కూడా మళ్లీ కలిశారా? కలిసే ఉంటున్నారా? అవును.. ఇది నిజమే అంటున్నారు కోలీవుడ్ జనాలు. కోలీవుడ్‌ స్టార్‌ ధనుష్‌, ఆయన మాజీ భార్య ఐశ్వర్య రజనీకాంత్‌ ఒకేచోట కనిపించారట. అదేంటి? వాళ్లిద్దరూ విడిపోయారు కదా! మరి ఒకేదగ్గర ఉండటం ఏంటి? అనుకుంటున్నారా? అదే కదా మీ డౌటు? మరేం లేదు.. వ్యక్తిగత విషయాలతో డిస్టర్బ్‌ అయిన ఈ ఇద్దరూ అప్పుడే తమతమ పనుల్లో మునిగిపోయారు. ధనుష్‌ సినిమా షూటింగ్‌ కోసం హైదరాబాద్‌లో ఉండగా, అటు ఐశ్వర్య కూడా లవ్‌ సాంగ్‌ చిత్రీకరణ కోసం సిటీలో పాగా వేసింది. అయితే వీళ్లిద్దరు కూడా ఒకే హోటల్‌లో ఉంటున్నట్లు సమాచారం. తమ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి సిటీకి వచ్చేసిన వీళ్లిద్దరూ రామోజీ రావు స్టూడియోలోని సితార హోటల్‌లో బస చేసినట్టు సమాచారం. ఐశ్వర్య ప్రస్తుతం…

శంకర్ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయమా?

Ramcharan Movie

సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ -కియారా అద్వానీ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఓ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రొడ్యూసర్స్ దిల్ రాజు-శిరీష్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. భారీ పాన్ ఇండియా చిత్రమిది. డైరెక్టర్ శంకర్ భారీ బడ్జెట్ సినిమాలు చేస్తుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే.. ‘ట్రిపుల్ ఆర్’ చిత్రం తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా ఇదే కాబట్టి ఈ మూవీ పైన భారీ అంచనాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇందులో రామ్ చరణ్ ఐఏఎస్ అధికారిగా, ముఖ్యమంత్రిగానూ కనిపించబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు సోషల్ మీడియాలో తీవ్రంగా హల చల్ చేస్తున్నాయి. అయితే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి కలిసి భారీ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ ఆర్ ఆర్’…

జీతభత్యాలు, భద్రతలేని కొలువు విలేఖరిది : కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి

TUWJ News

హైదరాబాద్ : జీతాభత్యాలు లేని అభద్రతతో కూడిన కొలువులో విలేఖరులు కొనసాగుతూ దీనస్థితిలో వారి కుటుంబాలను పోషించుకుంటున్నారని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి సిహెచ్.మల్లారెడ్డి విచారం వ్యక్తం చేశారు. సోమవారం నాడు మల్లాపూర్ లోని వి.ఎన్.ఆర్ గార్డెన్స్ లో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యుజె) ఉప్పల్ నియోజకవర్గ కమిటీ రూపొందించిన మీడియా డైరీని ఉప్పల్ శాసన సభ్యులు బేతి సుభాష్ రెడ్డి, టీయుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గ, మండల కేంద్రాల్లో పనిచేస్తున్న చాలా మంది విలేఖరులు దారిద్య్రరేఖ దిగువకు చెందిన వారేనని, అయితే వారికి నీడ కల్పించేందుకు తమ ప్రభుత్వం తగు చర్యలు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. ఇళ్ల స్థలాల సబ్ కమిటీలో తాను సభ్యుడినని, 2007లో…

కీర్తి సురేష్ ‘గుడ్ లక్ సఖి’ ట్రైల‌ర్ విడుదల

Keerthy Suresh’s Good Luck Sakhi Theatrical Trailer Launched

జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం గుడ్ లక్ సఖి. స్పోర్ట్స్ రొమ్‌-కామ్ గా రూపొందుతున్న ఈ ఉమెన్ సెంట్రిక్ మూవీలో కీర్తి సురేష్ షూటర్‌గా కనిపించనున్నారు. ఆది పినిశెట్టి, జగపతి బాబు ప్రధాన పాత్రలు పోషించారు. సహ నిర్మాతగా శ్రావ్య వర్మ నేతృత్వంలో ఎక్కువ మంది మ‌హిళా టెక్నీషియన్స్ తో ఈ చిత్రం రూపొందింది. ఈ రోజు `గుడ్ లక్ సఖి` థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ని విడుద‌ల చేసింది చిత్ర యూనిట్. దేశంలో టాప్ షూటర్లను తయారు చేస్తానని జ‌గ‌పతిబాబు ప్రకటించడంతో ట్రైల‌ర్‌ ప్రారంభమవుతుంది. బ్యాడ్‌ల‌క్ స‌ఖి గా కీర్తి సురేష్ ప‌రిచ‌యం అవుతుంది. అయితే కీర్తి పేరును జ‌గ‌ప‌తిబాబుకు సూచిస్తాడు ఆది పినిశెట్టి. ఇంత‌లో షూటింగ్ మహిళల కోసం కాదు అని గ్రామస్తులు దీనిని వ్యతిరేకిస్తారు. దాంతో…