‘సీతారామ‌పురంలో ఒక ప్రేమ జంట’ షూటింగ్ పూర్తి!

Director-Vinaybabu-Hero-RanadheerHeroin-NandiniProducer-Chander-Goud

శ్రీ ధ‌న‌ల‌క్ష్మి మూవీస్ ప‌తాంక‌పై ఎమ్.విన‌య్ బాబు ద‌ర్శ‌క‌త్వంలో చంద‌ర్ గౌడ్ నిర్మిస్తోన్న చిత్రం `సీతారామ‌పురంలో ఒక ప్రేమ జంట‌`. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో న‌డిచే ఈ ప్రేమ‌క‌థా చిత్రంతో ర‌ణ‌ధీర్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు. నందిని రెడ్డి హీరోయిన్ గా ప‌రిచ‌యం అవుతోంది. ప్ర‌స్తుతం ఈ చిత్రం హైద‌రాబాద్ లోని భూత్ బంగ్లాలో షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ సంద‌ర్భంగా ఆన్ లొకేష‌న్ లో గురువారం పాత్రికేయుల స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ద‌ర్శ‌కుడు విన‌య్ బాబు మాట్లాడుతూ….“రేపటితో షూటింగ్ పూర్త‌వుతుంది. సినిమా అనుకున్న దానిక‌న్నా చాలా బాగొచ్చింది. ప్ర‌స్తుతం వ‌స్తోన్న ప్రేమ‌క‌థా చిత్రాల‌క‌న్నా ఎంతో విభిన్నంగా ఈ చిత్రం ఉంటుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ ల‌వ్ స్టోరి. ప్రేమ‌లో ఉన్న ప్రతి జంట చూడాల్సిన చిత్రం. అలాగే త‌ల్లిదండ్రుల‌కు కూడా మంచి సందేశం…

దిల్ రాజు ప్రొడక్షన్స్, జీ 5 కాంబినేషన్‌లో వెబ్ సిరీస్ ‘ATM’ అనౌన్స్‌మెంట్

Diraju News

తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాలను అందించిన హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజుకి చెందిన దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్ ఇప్పుడు డిజిట‌ల్ రంగంలోకి అడుగు పెట్టింది. దిల్ రాజు ప్రొడక్షన్స్, ZEE 5 క‌ల‌యిక‌లో రూపొందిన ఒరిజిన‌ల్ ATM (ఎనీ టైమ్ మెమొరీ). శిరీష్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్.హరీష్ శంకర్, హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత నిర్మాత‌లుగా వెబ్ సిరీస్ రూపొందుతుంది. ATM వెబ్ సిరీస్‌కి సంబంధించిన అనౌన్స్‌మెంట్ ఈవెంట్ గురువారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ZEE 5 వైస్ ప్రెసిడెంట్ ప‌ద్మ‌, నిర్మాత హ‌న్షిత‌, ATM ఢైరెక్ట‌ర్ చంద్ర‌మోహ‌న్‌, డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్‌, నిర్మాత దిల్ రాజు త‌దిత‌రులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ZEE 5 వైస్ ప్రెసిడెంట్ ప‌ద్మ మాట్లాడుతూ ‘‘మంచి కంటెంట్‌ను ఆడియెన్స్‌కు అందించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాం. అలాగే అందిస్తూ వ‌స్తున్నాం. ఇలాంటి త‌రుణంలో దిల్‌రాజుగారు, హ‌రీష్…

రవితేజ జోరు మామూలుగా లేదు!?

Raviteja Hero

రవితేజను ఖచ్చింతంగా మాస్ మహారాజే అంటున్నారు టాలీవుడ్ వర్గాలు. అందుకు కారణం లేకపోలేదు. విషయాల్లోకి వెళితే.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం లేక రవితేజ సినిమాలన్నీ ఢమాల్ మన్నాయి. చాలా కాలం తర్వాత వరుస ప్రయాజయాల నుండి మాస్ కంబ్యాక్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపాడు మాస్ మాహారాజ్ రవితేజ. ఒకటి తర్వాత ఒకటి నాలుగు డిసాస్టర్ మూవీస్ తర్వాత చేసిన ‘క్రాక్’ లాస్ట్ ఇయర్ సంక్రాంతికి అనేక ఇబ్బందులను ఫేస్ చేసి మరీ విడుదలను సొంతం చేసుకున్నా కానీ 50% ఆక్యుపెన్సీతోనే సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ వద్ద రవితేజ కెరీర్ లోనే ఆల్ టైం నంబర్ 1 చిత్రంగా నిలిచి సంచలనం సృష్టించింది. ఈ సినిమా తర్వాత రవితేజ అప్ కమింగ్ మూవీస్ ఒకటి తర్వాత ఒకటి మొదలు…

వివిధ భాషల్లోకి బాలయ్య ‘అఖండ’ ప్రయోగం!?

vividha bhasahalloki Akhanda Prayogam!!

మాస్ నాడిని పట్టుకోవడం బహుశా .. దర్శకుడు బోయపాటి శ్రీనుకు తెలిసినంత మరే దర్శకుడికి తెలియదేమో.. అనిపిసిస్తుంది ‘అఖండ’ ప్రభంజనం చూస్తూంటే! నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో ఆయనకు జోడీగా బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ నటించింది. జగపతిబాబు, శ్రీకాంత్‌, పూర్ణ ఇతర కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఎస్.ఎస్. థమన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఎన్నో అంచనాల మధ్య 2021 డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తాజాగా డిస్నీ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతూ సత్తా చాటుతూనే ఉంది. అయితే.. ఈ ‘అఖండ’ను హిందీతో పాటు మిగతా భాషల్లో డబ్ చేయనున్నట్టు తెలిసింది. బాలయ్యకు సంబంధించి గతంలో ఏ సినిమా కూడా డిస్నీ హాట్ స్టార్‌లో సెట్ చేయని రికార్డు ఓటీటీ వేదికగా ‘అఖండ’ క్రియేట్ చేయడం విశేషంగా చెప్పుకోవాలి. అంతేకాదు..…

Radhe Shyam Release : ‘రాధేశ్యామ్’ ఓటీటీ ప్లాట్​ఫామ్​లో రానుందా?

Radhe-Shyam

వినోదరంగాన్ని తనవైపునకు మరల్చుకున్న ఓటీటీ చిన్న సినిమాలనే కాదు.. పెద్ద సినిమాలు.. పాన్​ ఇండియా అనబడే చిత్రాలను సైతం లాగేసుకుంటోంది! ఇప్పుడు ఎవ్వరినోటా విన్నా ఓటీటీ మాటే! తాజాగా ఈ ఓటీటీలో నేరుగా ‘రాధేశ్యామ్’​ రాబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్త తెగ చక్కర్లు కొడుతోంది. పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్​ చిత్రం కోసం అభిమానులే కాదు..సినిమాను అభిమానించే సినీజీవులు సైతం ఎంతగానో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఇదిగో.. అప్పడు..ఇప్పుడు అంటూ జనవరిలో విడుదలవుతుందనుకున్న ‘రాధేశ్యామ్’​కు అనేకసార్లు బ్రేక్​ పడింది. దీంతో ప్రేక్షకుల్లో, ప్రభాస్​ హార్ట్​కోర్​ ఫ్యాన్స్​లో తీవ్ర నిరాశ నెలకొంది. అయితే ఈ లవ్​స్టోరీ అనబడే ‘రాధేశ్యామ్’ ని థియేటర్లలో కాకుండా ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, తప్పకుండా అందులోనే వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని కూడా ఇదివరకే చాలా సార్లు..వార్తలు గుప్పుమన్నాయి.…

శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’ ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేసి అమ‌ల అక్కినేనికి అంకితం ఇచ్చిన అఖిల్ అక్కినేని

Akhil Akkineni Launches First Single From Sharwanand’s Oke Oka Jeevitham And Dedicates It To Amala Akkineni

యంగ్ హీరో శర్వానంద్ కెరీర్ లో 30వ సినిమాగా తెరకెక్కుతోన్న మైల్ స్టోన్ చిత్రం `ఒకే ఒక జీవితం` ఈ సినిమాతో శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయమ‌వుతున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ప‌తాకంపై ఎస్ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ప్ర‌స్తుతం విడుదలకు సిద్దంగా ఉంది. జేక్స్ బిజోయ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. నేడు ఈ మూవీ మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభించారు. ఈ చిత్రంలోని అమ్మ పాటను అఖిల్ అక్కినేని విడుదల చేసి త‌న‌ తల్లి అమ‌ల అక్కినేనికి ఈ పాట‌ను అంకితం ఇచ్చారు. ప్రతీ తల్లికి అంకితం ఇచ్చేలా ఈ పాట ఉంటుంది. ఈ పాట ఎంతో వినసొంపుగా ఉంది. సిధ్ శ్రీరామ్ గాత్రం ప్రత్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. అమ్మ గొప్పదనం చెప్పేందుకు స్వర్గీయ సిరివెన్నెల సీతారామశాస్త్రి…

సినిమా ప‌రిశ్ర‌మ‌లో ఆడ‌వాళ్ళు, మ‌గ‌వాళ్ళు అనే తేడాలేదు అంద‌రూ స‌మాన‌మే : కీర్తి సురేష్ ‘గుడ్ లక్ సఖి’ ప్రీ రిలీజ్ వేడుక‌లో రామ్‌చ‌ర‌ణ్

gudluck sakhi preelese event

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘గుడ్ లక్ సఖి’. స్పోర్ట్స్ రొమ్‌-కామ్ గా రూపొందిన‌ ఈ ఉమెన్ సెంట్రిక్ మూవీలో కీర్తి సురేష్ షూటర్‌గా కనిపించనున్నారు. ఆది పినిశెట్టి, జగపతి బాబు ప్రధాన పాత్రలు పోషించారు. సహ నిర్మాతగా శ్రావ్య వర్మ నేతృత్వంలో ఎక్కువ మంది మ‌హిళా టెక్నీషియన్స్ తో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాని తెలుగు, తమిళ మరియు మలయాళ భాషలలో ఏకకాలంలో రూపొందించారు. ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పణలో ‘వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్’ బ్యానర్ పై సుధీర్ చంద్ర ప‌దిరి ఈ చిత్రాన్ని నిర్మించారు. న‌గేష్ కుకునూర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా జ‌న‌వ‌రి 28న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం రాత్రి హైద‌రాబాద్‌లో పార్క్ హ‌య‌త్ లో `గుడ్ లక్ సఖి` ప్రీ రిలీజ్…

రవితేజ ‘ధమాకా’ నుంచి స్పెషల్ పోస్టర్ విడుద‌ల‌

Ravi Teja’s Birthday Poster From Trinadha Rao Nakkina, People’s Media Factory, Abhishek Aggarwal Arts’ Dhamaka Revealed

మాస్ మహారాజ రవితేజ, త్రినాథరావు నక్కిన కాంబినేషన్‌లో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్‌గా `ధమాకా` చిత్రం రాబోతోంది. డబుల్ ఇంపాక్ట్ అంటూ ఇంట్రెస్టింగ్ ట్యాగ్ లైన్‌తో ఈ మూవీ రూపొందుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకు నిర్మాతగా టీజీ విశ్వ ప్రసాద్, సహ నిర్మాతగా వివేక్ కూచిబొట్ల వ్యవహరిస్తున్నారు. రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో రవితేజ ట్రెండీ వేర్‌లో ఫుల్ఎనర్జీగా కనిపిస్తున్నారు. ఇక ఈ డ్యాన్స్ మూమెంట్ ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకునేలా ఉంది. మొత్తానికి ఈ స్పెష‌ల్ పోస్టర్ కలర్ ఫుల్‌గా ఉంది. ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో ఫేమస్ నటీనటులు కనిపించబోతన్నారు. ఇక సాంకేతికంగానూ గొప్ప టెక్నీషియన్లు ఈ ప్రాజెక్ట్‌కి వర్క్ చేస్తున్నారు. ప్రసన్న కుమార్ బెజవాడ…

రవితేజ పుట్టిన రోజు సందర్భంగా ‘రామారావు ఆన్ డ్యూటీ’ నుంచి స్పెషల్ పోస్టర్ విడుదల

Mass Maharaja Ravi Teja’s Special Birthday Poster From Sarath Mandava, Sudhakar Cherukuri’s Ramarao On Duty Unveiled

మాస్ మహారాజా రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాతో శరత్ మండవ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ మూవీ విడుదలకు సిద్దమవుతోంది. నేడు ఈ మూవీ సాంగ్ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైంది. రవితేజ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి స్పెషల్ పోస్టర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్లో రవితేజ విభిన్న ఎమోషన్స్లో కనిపిస్తున్నారు. ఒకచోట ఫ్యామిలీతో కనిపిస్తుండగా..మరోచోట ఆఫీస్ పనుల్లో బిజీగా ఉన్నట్టు.. ఇంకోదాంట్లో యాక్షన్లోకి దిగేందుకు రెడీగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక మరో ఫోటోలో ట్రైన్ మంటల్లో కాలిపోతోండటం కూడా కనిపిస్తోంది. మొత్తానికి రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ఎమోషన్స్ ఉన్నట్టు ఈ పోస్టర్…

Mass Maharaja Ravi Teja’s Special Birthday Poster From Sarath Mandava, Sudhakar Cherukuri’s Ramarao On Duty Unveiled

Mass Maharaja Ravi Teja’s Special Birthday Poster From Sarath Mandava, Sudhakar Cherukuri’s Ramarao On Duty Unveiled

Mass Maharaja Ravi Teja’s unique action thriller Ramarao On Duty being directed by debutant Sarath Mandava under Sudhakar Cherukuri’s SLV Cinemas LLP and RT Teamworks is gearing up for its theatrical release. They will begin canning a song from today in Ramoji Film City. The makers have released a new poster to wish Ravi Teja on his birthday. Ravi Teja appears aggressive in the action-packed poster that also shows his various emotions. He can be seen with his wife in one image, while his family can be seen in another.…