జయమ్మ పంచాయితీ సినిమా విడుదలకుముందు ప్రివ్యూనాడే సినీ ప్రముఖుల ప్రశంసలు దక్కించుకుంది. ఇక విడుదలైనరోజే భారీ ఓపెనింగ్‌తో మహిళల ఆదరణతో పాలకొండ, శ్రీకాకుళం, విజయనగరంపాటు అన్నిచోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్లతో ప్రదర్శించడం ఆనందంగా వుందని చిత్రయూనిట్ తెలియజేస్తోంది. సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ`. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మించగా విజయ్ కుమార్ కలివరపు దర్శకుడిగా పరిచయం అయ్యారు. యువ జంటగా దినేష్ కుమార్, షాలినీ నటించారు. మే6న విడుదలైన ఈ సినిమా సినీ ప్రముఖులతోపాటు ప్రేక్షకుల ఆదరణ పొందుతూ, విమర్శకుల ప్రశంసలను సైతం పొందింది. ఈ సందర్భంగా శనివారంనాడు రామానాయుడు స్టూడియోలో చిత్ర యూనిట్ తమ ఆనందాన్ని మీడియా సమావేశంలో పంచుకున్నారు. సుమ మాట్లాడుతూ, దర్శకుడు చిన్న చిన్న అంశాలతోపాటు కులం, మతం, నక్సలిజం వంటి అంశాలనూ చాలా…
Category: MOVIE REVIEWS
నాటి టైటిల్ తో మరోసారి ప్రేక్షకులను ఉర్రూతలుగించడానికి వస్తున్న ‘ప్రేమదేశం’ గ్లిమ్స్ కు అనూహ్య స్పందన : యూట్యూబ్ లో 1 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్న’ప్రేమదేశం’ గ్లిమ్స్!!
1996లో విడుదలై పెద్ద సూపర్ హిట్ సాధించిన” ప్రేమదేశం” సినిమా అప్పట్లో యువతను విపరీతంగా ఆకట్టుకుని ఉర్రూతలూగించింది. ఏఆర్ రహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు దాదాపు దశాబ్దంపాటు ఎక్కడ చూసినా వినపడుతూ ఉండేవి.అప్పట్లో ప్రేమదేశానికి ప్రత్యేకమైన స్థానం ఉండేది ప్రేమకథల్లో. చాలా కాలం తర్వాత అదే టైటిల్ తో ఇప్పుడు వస్తున్న “ప్రేమదేశం’ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఏఆర్ రహమాన్ సంగీతం అందించిన నాటి “ప్రేమదేశం” సినిమాకు ఏఆర్ రహమాన్ ప్రాణం పోస్తే.. నేడు మణిశర్మ తన బ్యాగ్రౌండ్ స్కోర్ తోను సంగీతంతోను అంతే ప్రాణం పోశాడు అని చెప్పాలి.ఈ సందర్భంగా దర్శకుడు శ్రీకాంత్ సిద్ధం విడుదల చేసిన “ప్రేమదేశం” గ్లిమ్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది.సరిగమప యూట్యూబ్ లో విడుదలైన ఈ సినిమా గ్లిమ్స్ 1 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది…
మెగాస్టార్ చిరంజీవి- సల్మాన్ ఖాన్ ‘గాడ్ ఫాదర్’ కోసం ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా కొరియోగ్రఫీలో దద్దరిల్లిపోయే పాట!
మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 153వ చిత్రం ‘గాడ్ ఫాదర్’ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్త నిర్మాణంలో మోహన్ రాజా దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ చిత్రంతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. టాప్ హీరోయిన్ నయనతార కీలక పాత్రలో నటిస్తుండగా, స్టార్ దర్శకుడు పూరి జగన్నాధ్ అతిధి పాత్రలో కనిపించనున్నారు. భారీ అంచనాలతో రూపుదిద్దుకుంటున్న గాడ్ ఫాదర్ లో మరో ప్రత్యేకమైన ఆకర్షణ చేరింది. ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా కొరియోగ్రఫీలో చిరంజీవి- సల్మాన్ ఖాన్ పై ఒక ఎలెక్ట్రిఫయింగ్ సాంగ్ ని షూట్ చేయబోతుంది చిత్ర యూనిట్. ఈ విషయాన్ని గాడ్ ఫాదర్ సంగీత దర్శకుడు మ్యూజికల్ సెన్సేషన్ తమన్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు ” గ్రేట్ న్యూస్. బాస్ చిరంజీవి, సల్మాన్ ఖాన్ కోసం…
‘సర్కారు వారి పాట’లో మహేష్ బాబు గారి సిగ్నేచర్ మూమెంట్స్ నెక్స్ట్ లెవల్ లో వుంటాయి : స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’ కోసం ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా అంచనాలని మరో స్థాయికి తీసుకెళ్లింది సర్కారు వారి పాట థియేట్రికల్ ట్రైలర్. తాజాగా విడుదలైన ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని ఆల్ టైం రికార్డ్ ని సృష్టించింది. సర్కారు వారి పాట ట్రైలర్ 24గంటల్లో 27 మిలియన్స్ వ్యూస్ ని క్రాస్ చేసి టాలీవుడ్ ఫాస్టెస్ట్ వన్ డే రికార్డ్ నెలకొల్పింది. అలాగే 1.2 మిలియన్స్ కు పైగా లైక్స్ సొంతం చేసుకొని రికార్డ్ వేగంతో దూసుకుపోతుంది. ఇక మ్యూజికల్ సెన్సేషన్ తమన్ సంగీతంలో ‘సర్కారు…
ఆసక్తికలిగిస్తున్న పెళ్లికూతురు పార్టీ ట్రైలర్
ప్రిన్స్. అర్జున్ కళ్యాణ్, అనీషా ధామా, సీత, జయత్రీ, సాయికీర్తన్, ఫణి ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం పెళ్లికూతురు పార్టీ. ఎ.వి.ఆర్. స్వామి నిర్మించారు. అపర్ణ దర్శకత్వం వహించారు. లేడీ సెంట్రిక్ మూవీగా రూపొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రం మే 20న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా మంగళవారంనాడు పెళ్లికూతురు పార్టీ ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ ఎలా వుందంటే, మగవారే పెండ్లికి ముందు బ్యాచ్లర్ పార్టీ చేసుకుంటున్నారు. మరి ఆడ వాళ్ళు చేసుకుంటే ఎలా వుంటుందనేది ఇందులో చూపించారు. సరదాగా నలుగురు అమ్మాయిలు బ్యాచ్లర్ పార్టీ చేసుకుందామని ఇంటిలో చెబితే బామ్మనుకూడా తీసుకెళ్ళమంటారు. ఇలా కొంచెం ఫన్నీగా మరికొంచెం సీరియస్ యాక్షన్ ఎపిసోడ్స్తో సాగే రోడ్ జర్నీ కథ ఇది. ప్రిన్స్ యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి. యూత్…
‘ఎఫ్ 2’ కి మించిన ఫన్ రైడ్ ‘ఎఫ్ 3’ లో వుంటుంది : ఎడిటర్ తమ్మిరాజు
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, దిల్ రాజు సూపర్ హిట్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఎఫ్ 3’. డబుల్ బ్లాక్బస్టర్ ‘F2’ ఫ్రాంచైజీ నుంచి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘F3’ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిర్మాత దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. ప్రేక్షకులకు నవ్వులు పంచడానికి మే 27న ఎఫ్ 3 ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధమైమౌతున్న ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. తాజాగా ఈ చిత్రాని కి పని చేసిన స్టార్ ఎడిటర్ తమ్మిరాజు మీడియాతో ముచ్చటించారు. ఆయన పంచుకున్న ‘ఎఫ్ 3’ విశేషాలు మీ సినీ ప్రయాణం ఎలా…
Attractive first glimpse of Samantha’s Yashoda out now!
Yashoda opened her eyes. The world she’s been watching around her isn’t the same anymore. The environment, her dress, her watch and the silence seemed surprisingly different to her. While the heartbeat is resonating in her ears, she went to open the window. Noticing a pigeon that resembled the freedom she wants, tried to catch it. Then, what happened? All of this is part of ‘Yashoda’ first glimpse. Raising the expectations on its enthralling content, Senior producer Sivalenka Krishna Prasad says there’s more on the way. Starring Samantha as the…
ఎట్రాక్టివ్ ఫస్ట్ గ్లిoప్స్ తో సమంత ‘యశోద’
యశోద కళ్లు తెరిచి చూసింది. రోజూ తను చూసే ప్రపంచానికి పూర్తి భిన్నంగా ఉందా ప్రదేశం. చుట్టూ పరిసరాలు, తను వేసుకున్న డ్రెస్సు, తన చేతికున్న వాచ్ తో పాటు అక్కడున్న నిశబ్దం కూడా యశోదకు చాలా కొత్త కొత్త గాను, వింత వింత గానూ అనిపిస్తున్నాయి. తన గుండె చప్పుడు తనకే వినబడుతుండగా మెల్లిగా వెళ్లి అక్కడున్న కిటికీ తెరిచి చూసింది. తన స్వేచ్ఛే అక్కడ వాలినట్టుగా ఉన్న తెల్లటి పావురాన్ని ఆత్రంగా అందుకోవడానికి ప్రయత్నించింది. కానీ, అక్కడేం జరిగింది? ఇదంతా ‘యశోద’ ఫస్ట్ గ్లిoప్స్ లో కనిపిస్తుంది. దీన్ని బట్టే ‘యశోద’ సినిమా ఎంత వైవిద్యంగా ఉంటుందో ఊహించుకోవచ్చునంటున్నారు సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్. సమంత ప్రధాన పాత్రలో శ్రీదేవి మూవీస్ పతాకం పై ప్రొడక్షన్ నం.14 గా రూపొందుతున్న చిత్రం ‘యశోద’. జంట…
ఐశ్వర్య రాజేష్ ‘డ్రైవర్ జమున’ ఫస్ట్ లుక్ విడుదల
అద్భుతమైన నటనతో విభిన్నమైన సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ఐశ్వర్య రాజేష్. విలక్షణమైన పాత్రలలో ఆకట్టుకుంటున్న ఐశ్వర్య రాజేష్ తాజాగా ‘డ్రైవర్ జమున’ పేరుతో మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమౌతున్నారు. ఔట్ అండ్ ఔట్ రోడ్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పా. కిన్స్లిన్ దర్శకత్వం వహిస్తుండగా 18 రీల్స్పై ఎస్.పి.చౌదరి నిర్మిస్తున్నారు. తాజాగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు “డ్రైవర్ జమున” ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో ముఖం మీద చెమటలు, రక్తం మరకలతో ఫిరోషియస్ గా కనిపించారు ఐశ్వర్య రాజేష్. లేడీ క్యాబ్ డ్రైవర్ జీవితంలో చోటు చేసుకున్న నాటకీయ సంఘటనల నేపధ్యంలో ‘డ్రైవర్ జమున’ చిత్రాన్ని థ్రిల్లింగ్ గా రూపొందిస్తున్నారు. ఐశ్వర్య రాజేష్ ఈ పాత్ర…
కలర్స్ స్వాతి రెడ్డి ‘ఇడియట్స్’ ఫస్ట్ లుక్ విడుదల
ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా, రావణాసురుడు, డెవిల్ వంటి భారీ బడ్జెట్ ఎంటర్టైనర్లతో పాటు కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలకీ ప్రాధాన్యత ఇస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్ నుండి తాజా ప్రొడక్షన్ వెంచర్ అమోఘ ఆర్ట్స్, ఎమ్ఎన్ఓపి కలిసి నిర్మిస్తున్న చిత్రానికి ‘ఇడియట్స్’ అనే క్రేజీ టైటిల్ ని ఖారారు చేశారు. రియల్ హీరోస్ అనేది ఉప శీర్షిక. ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఈరోజు విడుదలైంది. కలర్స్ స్వాతి రెడ్డి ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఇడియట్స్’.. తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో వినోదాత్మక అంశాలతో కూడిన స్వచ్చమైన ప్రేమకథగా ఉండబోతుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో ప్రముఖ తారాగణం అంతా క్యారికేచర్ డిజైన్ లో ప్రతి పాత్ర విభిన్న భావోద్వేగాలతో కనిపించడం గమనించవచ్చు. స్వాతితో పాటు నిఖిల్ దేవాదుల, సిద్ధార్థ్ శర్మ, శ్రీ…
