ప్రస్తుతం తెలివిజన్ రంగంలో భారతదేశంలో అత్యధికంగా అభివృద్ధి చెందుతున్న OTT ప్లాట్‌ఫారమ్ ZEE5, ZEE5 100+ టేస్ట్ క్లస్టర్‌లలో విభిన్నమైన కంటెంట్‌కు ప్రసిద్ధి చెందింది మరియు నిజమైన, సంబంధిత మరియు ప్రతిధ్వనించే కథాంశాలపై దృష్టి సారించింది. ఈ రోజు, ZEE5 5 లక్షల+ గంటల కంటే ఎక్కువ డిమాండ్ కంటెంట్ మరియు 160+ లైవ్ టీవీ ఛానెల్‌లకు నిలయంగా ఉంది. 3500కి పైగా చలనచిత్రాలు, 1750 టీవీ కార్యక్రమాలు, 700 ఒరిజినల్‌లతో కూడిన గొప్ప లైబ్రరీతో ZEE5 12 భారతీయ భాషల్లో కంటెంట్‌ను అందిస్తుంది: ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, మరాఠీ, ఒరియా, భోజ్‌పురి, గుజరాతీ మరియు పంజాబీ. ప్లాట్‌ఫారమ్ 2022 కోసం అద్భుతమైన లైనప్‌ను కలిగి ఉంది, ఇది దాని విస్తృతమైన కంటెంట్ లైబ్రరీకి జోడిస్తుంది, వినోదం కోరుకునేవారికి విస్తృత శ్రేణి…
Category: MOVIE REVIEWS
‘విరాట పర్వం’ ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా : సాయి పల్లవి ఇంటర్వ్యూ
పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న చిత్రం ‘విరాటపర్వం’. డి. సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానున్న నేపధ్యంలో హీరోయిన్ సాయి పల్లవి మీడియాతో మాట్లాడారు. సాయిపల్లవి పంచుకున్న విరాటపర్వం విశేషాలివి. సరళ గారి కుటుంబాన్ని కలవడం ఎలా అనిపించింది ? సరళ గారి కుటుంబాన్ని కలవడం చాలా ఎమోషనల్ మూమెంట్. చాలా ఆప్యాయంగా మాట్లాడారు. అమ్మ నన్ను దీవించి చీర కానుకగా ఇచ్చారు. సరళకు జరిగిన అన్యాయం గురించి ఎలా ఫీలయ్యారు ? నిజంగా ఆ సమయంలో జరిగిన విషయాలన్నీ మనకు తెలీవు. దిన్ని ఒక కథలానే అప్రోచ్ అయ్యాను. వెన్నెల పాత్రగానే చేశాను. వేణు ఊడుగుల కథ చెప్పినపుడు…
ఎంఎస్ రాజు గారి సినిమా అనగానే ఎగిరి గంతేశా : ‘7 డేస్ 6 నైట్స్’ హీరో రోహన్ ఇంటర్వ్యూ..
మెగా మేకర్ ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించిన తాజా సినిమా ‘7 డేస్ 6 నైట్స్’. ‘డర్టీ హరి’తో గతేడాది బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ఆయన, ఆ తర్వాత తీసిన చిత్రమిది. మెగా బ్యానర్ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో సుమంత్ అశ్విన్ .ఎం, రజనీకాంత్ .ఎస్ నిర్మించారు. వైల్డ్ హనీ ప్రోడక్షన్స్, వింటేజ్ పిక్చర్స్ మరియు ఏబిజి క్రియేషన్స్ వారు చిత్రనిర్మాణంలో భాగస్వాములు. ఇందులో సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలు. సినిమా జూన్ 24న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా రోహన్ మీడియాతో ముచ్చటించారు. ప్రశ్న: మీది ఏ ఊరు? మీ నేపథ్యం ఏమిటి? రోహన్: మా తల్లిదండ్రులు ఇద్దరిదీ గుంటూరు. నాన్నగారు ఎయిర్ ఫోర్స్ పైలట్. అందువల్ల, చిన్నతనం నుంచి దేశంలో వివిధ ప్రాంతాల్లో పెరిగా. పాన్ ఇండియా చైల్డ్ అనుకోండి. హైదరాబాద్‌లోనూ చదివా. ఫ్రాన్స్‌లో స్కాలర్షిప్ వస్తే మెకానికల్ ఇంజనీరింగ్ & రోబోటిక్స్‌లో బ్యాచిలర్…
కాలేజీ నుంచి రాజకీయ ప్రవేశం వరకూ… కొండా మురళి, సురేఖ దంపతుల ప్రయాణమే ‘కొండా’ సినిమా : రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ
కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా రూపొందిన సినిమా ‘కొండా’. రామ్ గోపాల్ వర్మ దర్శకుడు. కొండా మురళి పాత్రలో త్రిగుణ్, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ నటించారు. శ్రేష్ఠ పటేల్ మూవీస్ సమర్పణలో ఆపిల్ ట్రీ, ఆర్జీవీ ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మించాయి. కొండా సుష్మితా పటేల్ నిర్మాత. జూన్ 23న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా వర్మతో ఇంటర్వ్యూ… ప్రశ్న: మీరు ఇంతకు ముందు తీసిన కథలకు, ఈ కథకు వ్యత్యాసం ఏంటి? ‘కొండా’ సినిమా తీయడానికి మీకు స్ఫూర్తి ఏంటి? విజయవాడలో చదువుకోవడం వల్ల రౌడీయిజం మీద కొంత అవగాహన ఉంది. ‘రక్త చరిత్ర’ తీసినప్పుడు రాయలసీమ గురించి తెలిసింది. నేను ఎప్పుడూ తెలంగాణను పట్టించుకోలేదు. రిటైర్డ్ పోలీస్ ఒకరిని కలిసినప్పుడు మాటల మధ్యలో కొండా మురళి గురించి చెప్పారు.…
‘సాఫ్ట్ వేర్ బ్లూస్’ రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేసిన ప్రముఖ దర్శకుడు క్రిష్ ..జూన్ 24న గ్రాండ్ రిలీజ్
శ్రీరాం, భావనా, ఆర్యమాన్, మహబూబ్ బాషా, కె.యస్. రాజు, బస్వరాజ్ నటీనటులుగా ఉమా శంకర్ దర్శకత్వంలో సిల్వర్ పిక్సెల్ మీడియా వర్క్స్ పతాకంపై నిర్మిస్తోన్న చిత్రం “సాఫ్ట్ వేర్ బ్లూస్”. ఇటీవలే ఈ చిత్ర రిలీజ్ ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు క్రిష్ విడుదల చేయడం జరిగింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 24 న గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా… దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ.. సాఫ్ట్ వేర్ బ్లూస్” అంటే పెద్ద పెద్ద బిల్డింగ్ లు లక్షల లో శాలరీలు, అమ్మాయిలు పబ్బులు కాదు దూల తీరపోద్ధిరా.. రే.. అనే డైలాగ్ ఉన్న ట్రైలర్ చూస్తుంటే చాలా హిలెరియస్ గా ఎగ్జైటింగ్ గా ఉంది. సాఫ్ట్ వేర్ లో జరిగే చిన్న చిన్న గమ్మత్తులు వారి జీవితాల గురించి చాలా…
‘అంటే సుందరానికీ’ తీసినందుకు చాలా గర్వంగా ఫీలౌతున్నాం : మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ యెర్నని
‘అంటే సుందరానికీ’ మాకు గొప్ప అనుభూతిని ఇచ్చిన చిత్రం. మా బ్యానర్ లో ఎప్పటికీ నిలిచిపోయే చిత్రం. ఇదో క్లాసిక్. ‘అంటే సుందరానికీ’ సినిమా తీసినందుకు నిర్మాతలుగా మేము చాలా గర్వంగా ఫీలౌతున్నాం.” అన్నారు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ యెర్నేని. నేచురల్ స్టార్ నాని- నజ్రియా నజీమ్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ‘అంటే సుందరానికీ’. జూన్ 10 విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని, అరుదైన చిత్రంగా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ..’అంటే సుందరానికీ’ విజయం…
`షికారు` నుంచి యూత్ ఫుల్ క్రేజీ సాంగ్ విడుదల – జూన్ 24న సినిమా రిలీజ్
సాయిధన్సిక, తేజ్ కూరపాటి, అభినవ్ మేడిశెట్టి, కె.వి. ధీరజ్, నవకాంత్, చమ్మక్ చంద్ర ప్రధాన తారాగణంగా నటించిన చిత్రం `షికారు` శ్రీసత్యసాయిబాబాగారి ఆశీస్సులతో నాగేశ్వరి (పద్మ) సమర్పణలో పి.ఎస్.ఆర్. కుమార్ (బాబ్జీ, వైజాగ్) నిర్మాతగా శ్రీసాయి లక్ష్మీ క్రియేషన్స్ బేనర్‌మీద హరి కొలగాని దర్శకత్వంలో రూపొందింది. (యాన్ అన్‌లిమిటెడ్ ఫన్ రైడ్) అనేది ట్యాగ్‌లైన్. శేఖర్ చంద్ర సంగీతం సమకూర్చిన షికారు నుండి `దేవదాసు పారు వల్ల బ్యాడు` అనే క్రేజీ సాంగ్‌ను చిత్ర బృందం శనివారంనాడు ఫిలింఛాంబర్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదలచేసింది. ఈ కార్యక్రమంలో ఛాంబర్ కార్యదర్శి ప్రసన్నకుమార్, నిర్మాత వివేక్ కూచిభట్ట, ఆదిత్య మహేంద్ర, చిత్ర బృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటుడు చమక్ చంద్ర మాట్లాడుతూ, చాలాకాలం తర్వాత మంచి పాత్ర పోషించాను. ఒక పాట నామీద చిత్రీకరించారు. అది నేను ఊహించలేదు.…
‘విరాట పర్వం’ మొదలు పెట్టినప్పుడు మాకు పాన్ ఇండియా ఆలోచన లేదు : రానా దగ్గుబాటి ఇంటర్వ్యూ..
పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న చిత్రం ‘విరాటపర్వం’. డి. సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానున్న నేపధ్యంలో హీరో రానా మీడియాతో మాట్లాడారు. ఆయన పంచుకున్న ‘విరాటపర్వం’ విశేషాలివి. * అరణ్య నుండి విరాటపర్వంలోకి రావడం ఎలా అనిపించింది ? -అడవులకూ నాకూ ఏదో అనుబంధం ఉన్నట్లుంది.(నవ్వుతూ) గత నాలుగేళ్ళుగా అడవుల్లోనే ఎక్కువ షూటింగులు జరిగాయి. అక్కడే ఎక్కువ గడిపాను. విరాట పర్వానికి వచ్చేసరికి 90లో జరిగే కథ. దళం సభ్యులు అడవుల్లో వుండే రోజులు.,నాటి వాతావరణం.. చాలా యదార్ధంగా తీశాం. నా కెరీర్ లో ఫస్ట్ టైం ఒక గ్రేట్ లవ్ స్టొరీ చేశాను. చాలా లోతైన ప్రేమకథ.…
‘గాడ్సే’తో టాలీవుడ్ లో అడుగుపెట్టడం హ్యాపీగా ఉంది : ఐశ్వర్య లక్ష్మి ఇంటర్వ్యూ..
వెర్సటైల్ హీరో సత్యదేవ్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘గాడ్సే’. గోపి గణేష్ పట్టాభి దర్శకత్వం వహించారు. సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి. బ్యానర్‌పై సి.కళ్యాణ్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 17న గ్రాండ్ విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ఇతర ప్రమోషనల్ యాక్టివిటీస్‌తో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ ఇందులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా నటించింది. సినిమా విడుదల సందర్భంగా ఐశ్వర్య లక్ష్మీ ఇంటర్వ్యూ విశేషాలు ఆమె మాటల్లోనే… – నేను హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసి మూడేళ్లు అవుతుంది. నా తొలి చిత్రాన్ని మలయాళంలో చేశాను. రెండో చిత్రాన్ని తెలుగులోనే చేయాల్సింది. కానీ కుదరలేదు. తర్వాత దర్శక నిర్మాతలు అనుకున్న పాత్రలకు నేను సూట్ కాకపోయి ఉండొచ్చు. వచ్చిన పాత్రలు నాకు నచ్చలేదు.. ఇలా పలు కారణాలతో తెలుగులో సినిమాలు చేయలేకపోయాను.…
‘విక్రమ్’ను బిగ్గెస్ట్ హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు : కమల్ హాసన్
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కథానాయకుడిగా సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్’. కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలలో స్టార్ హీరో సూర్య గెస్ట్ రోల్ లోరూపొందిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం ‘శ్రేష్ఠ్ మూవీస్’ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సుధాకర్ రెడ్డి తెలుగులో భారీగా విడుదల చేశారు. జూన్ 3 విడుదలై ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. హీరో రానా దగ్గుబాటి ఈ వేడుకకు అతిధిగా హాజరయ్యారు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ మాట్లాడుతూ.. విక్రమ్…
