‘విక్రమ్’ను బిగ్గెస్ట్ హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు : కమల్ హాసన్

'విక్రమ్'ను బిగ్గెస్ట్ హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు : కమల్ హాసన్

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కథానాయకుడిగా సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్’. కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలలో స్టార్ హీరో సూర్య గెస్ట్ రోల్ లోరూపొందిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం ‘శ్రేష్ఠ్ మూవీస్’ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సుధాకర్ రెడ్డి తెలుగులో భారీగా విడుదల చేశారు. జూన్ 3 విడుదలై ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. హీరో రానా దగ్గుబాటి ఈ వేడుకకు అతిధిగా హాజరయ్యారు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ మాట్లాడుతూ.. విక్రమ్…

ఇన్‌స్టాగ్రామ్‌లో సమంత నెల సంపాదన ఎంతో తెలుసా?

samatha monthly income?

దక్షిణాదిలో తిరుగులేని గుర్తింపును సంపాదించుకున్న టాలీవుడ్ బ్యూటీ సమంతకు ఇన్‌స్టాగ్రామ్‌లో రెండుకోట్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ‘ఫ్యామిలీమెన్‌-2’’ వెబ్‌సిరీస్‌తో బాలీవుడ్‌ ప్రేక్షకులకు కూడా చేరువైన ఈ భామ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసే ప్రకటనల ద్వారా నెలకు మూడు కోట్ల వరకు ఆర్జిస్తున్నదని సమాచారం. నెలకు మూడు కోట్లా..? అని ఆశ్చర్యపోకండి! సోషల్‌మీడియా ప్రభావంతో సినీ తారలకు కొత్త ఆదాయ మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. సామాజిక మాధ్యమాల్లో వారికి ఉన్న ఫాలోవర్లు, పాపులారిటీని బట్టి వ్యాపార సంస్థలు తమ ప్రకటనల కోసం భారీ మొత్తంలో తారలకు చెల్లింపులు జరుపుతున్నాయి. ఈ వరుసలో సమంత ముందున్నది చెబుతున్నారు. తాజాగా ఈ భామ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ల్లో పలు బ్రాండ్‌లకు సంబంధించిన ప్రకటనలు జోరుగా కనిపిస్తున్నాయి. యువతరంలో ఈ భామకున్న క్రేజ్‌ దృష్ట్యా ఇన్‌స్టాగ్రామ్‌ ప్రకటనల కోసం భారీ మొత్తంలో డిమాండ్‌ చేస్తున్నదని…

ఆహా ఒరిజినల్ ‘అన్య’స్ ట్యుటోరియల్’ టీజర్ ను లాంచ్ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్

ఆహా ఒరిజినల్ 'అన్య'స్ ట్యుటోరియల్' టీజర్ ను లాంచ్ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్

ఆహా అంటే ఆహా అనిపించే రీతిలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా వారి హారర్ వెబ్ సిరీస్ ‘అన్య’స్ ట్యుటోరియల్’ టీజర్ ను శుక్రవారం సాయంత్రం లాంచ్ చేసారు. రెజీనా కెసాండ్రా మరియు నివేదితా సతీష్ ముఖ్య పాత్రధారులుగా రూపుదిద్దుకున్న ఈ వెబ్ సిరీస్ ను బాహుబలి ప్రొడ్యూసర్స్ ఆర్కా మీడియా నిర్మిస్తుంది. ఆహా ఈ వెబ్ సిరీస్ తెలుగు మరియు తమిళ్ భాషలలో అతి త్వోరలోనే లాంచ్ చేయనుంది. టీజర్ లాంచ్ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ, “అన్య’స్ ట్యుటోరియల్ టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ టీజర్ లాంచ్ చేయడం నాకు సంతోషంగా ఉంది. అల్ ది బెస్ట్ టు టీం అఫ్ అన్య.” https://fb.watch/dy_MnVIpVj/ ప్రపంచం మొత్తం ఇప్పుడు డిజిటల్ దిక్కు అడుగులు వేస్తుంది. కానీ అదే డిజిటల్ రంగం అందరిని…

జూన్ 17న తెలుగు ఇండియన్ ఐడల్ మెగా ఈవెంట్ జరగబోతోంది..అందరూ ఎంజాయ్ చేయండి : స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్

జూన్ 17న తెలుగు ఇండియన్ ఐడల్ మెగా ఈవెంట్ జరగబోతోంది..అందరూ ఎంజాయ్ చేయండి : స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్

అత్యుత్త‌మ‌మైన తెలుగు గాత్రాన్ని క‌నుగొనే ఉద్దేశంతో ప్ర‌పంచంలోనే బిగ్గెస్ట్ స్జేజ్ ప్రోగ్రామ్ తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్‌ను ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఆహా నిర్వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే. సంగీత ప్రియుల మధ్య గణనీయమైన ఆదరణ పొందిన తెలుగు ఇండియన్‌ ఐడల్‌ షో ముగింపుకు వచ్చింది. స్వర మాధుర్యంతో అలరించిన ఐదుగురు ఫైనలిస్టులతో ఓ ప్రోగ్రాంను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో.. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్.తమన్ మాట్లాడుతూ.. ‘ఇలాంటి షోను ఓ టీంగా చేసినందుకు నాకు ఆనందంగా ఉంది. టీంగా మేం గెలిచాం. గత ఆరు నెలలుగా ఈ టీంతో ప్రయాణిస్తూ వచ్చాను. నాకు చాలా సిగ్గు. కానీ నేను ఎలా మారిపోయానో నాకే తెలియడం లేదు. ఆ స్పేస్ క్రియేట్ చేసిచ్చిన అరవింద్ గారికి థ్యాంక్స్. ఆయన నన్ను రెండు విషయాల్లో చాలా మార్చారు. నేను చాలా లో స్టేజ్‌లో ఉన్నప్పుడు…

ఎం.ఎస్. రాజు ‘7 డేస్ 6 నైట్స్’ ట్రైలర్ కి అనూహ్య స్పందన!!

ఎం.ఎస్. రాజు '7 డేస్ 6 నైట్స్' ట్రైలర్ కి అనూహ్య స్పందన!!

ఎం.ఎస్. రాజు దర్శకునిగా ‘డర్టీ హరి’ తో గతేడాది బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. తాజాగా, మెగా బ్యానర్ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఆయన దర్శకత్వం వహించిన మరో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘7 డేస్ 6 నైట్స్’ జూన్ 24న విడుదల కి సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా విడుదల చేసిన కొత్త ట్రైలర్ కి అద్భుతమైన స్పందన రావడంతో సినిమా పై భారీ అంచనాలు పెరిగాయి. సరికొత్త ట్రీట్మెంట్ తో, విజువల్స్ తో ట్రైలర్ లో సుమంత్ అశ్విన్, మెహెర్ చాహల్ తో పాటు రోహన్, క్రితిక శెట్టి మరో జంటగా కనిపించారు. కామెడీ తో యూత్ ఫుల్ కంటెంట్ ని కలిపి పూర్తిగా ఆకట్టుకునే విధంగా చిత్రం ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా హీరో, నిర్మాత సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ “ఈ చిత్రాన్ని…

Ante Sundaraniki Movie Review : కామెడీ ఎంటర్‌టైనర్!

ante sundaraniki movie telgu review

By ABDUL M.D – Tollywoodtimes చిత్రం : అంటే…సుందరానికీ! రచన-దర్శకత్వం : వివేక్ ఆత్రేయ విడుదల తేది : 10 జూన్ 2022 రేటింగ్ : 2.75/5 నటీనటులు : నాని, నజ్రియా నజీమ్‌, నరేశ్‌ హర్షవర్థన్‌, నదియా, రోహిణి , అజగం పెరుమాల్, నిక్కీ తంబోలీ, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు నిర్మాణ సంస్థ : మ్రైతీ మూవీ మేకర్స్‌ నిర్మాతలు: నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ వై. దర్శకత్వం : వివేక్‌ ఆత్రేయ సంగీతం : వివేక్‌ సాగర్‌ సినిమాటోగ్రఫీ : నికేత్‌ బొమ్మి ఎడిటింగ్ : రవితేజ గిరిజాల) నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘అంటే… సుందరానికీ’ పై విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘ఇదొక రొమాంటిక్ కామెడీ…

జులై 15న సత్యదేవ్, తమన్నా ‘గుర్తుందా శీతాకాలం’ విడుదల

జులై 15న సత్యదేవ్, తమన్నా ‘గుర్తుందా శీతాకాలం’ విడుదల

టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ యంగ్ హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నాగ శేకర్ తెరకెక్కిస్తున్న సినిమా ‘గుర్తుందా శీతాకాలం’. ప్ర‌తీ ఒక్క‌రు త‌మ జీవితంలో సెటిల్ అయిన తర్వాత కొన్ని విష‌యాల్ని ఎప్ప‌టికీ మ‌రిచిపోరు. ముఖ్యంగా టీనేజ్, కాలేజ్ ఆ తర్వాత వ‌చ్చే యూత్ లైఫ్‌లో జ‌రిగే సంఘ‌ట‌న‌లు జీవితాంతం గుర్తుకు వ‌స్తూనే ఉంటాయి. ఇలాంటి ఆహ్లాద‌క‌ర‌మైన సంఘ‌ట‌ణ‌లు ప్రేక్ష‌కుల‌కి గుర్తు చేసే ఉద్దేశంతో నాగ‌శేఖ‌ర్ మూవీస్ బ్యాన‌ర్, మణికంఠ ఎంటర్‌టైన్మెంట్స్, వేదాక్షర ఫిల్మ్స్ బ్యానర్స్‌పై భావ‌న‌ ర‌వి, నాగశేఖర్, రామారావు చింతపల్లి, ఎమ్ ఎస్ రెడ్డి, చిన‌బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా గుర్తుందా శీతాకాలం. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన రామారావు చింతపల్లి గారు వరస సినిమాలతో ఇండస్ట్రీలో తన మార్క్ చూపించుకుంటున్నారు. క్రేజీ ప్రాజెక్టులను ఆయన నిర్మిస్తూ హ్యాపెనింగ్ ప్రొడ్యూసర్‌గా మారుతున్నారు.…

మైత్రీ మూవీ మేకర్స్ విజయాలకు అవే నిద‌ర్శ‌నం : న‌రేశ్ వి.కె ఇంటర్వ్యూ…

మైత్రీ మూవీ మేకర్స్ విజయాలకు అవే నిద‌ర్శ‌నం : న‌రేశ్ వి.కె ఇంటర్వ్యూ.. నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'అంటే సుందరానికీ`. ఈ చిత్రం ట్రైల‌ర్ విడుద‌ల‌య్యాక భారీ అంచనాలు నెలకొన్నాయి. న‌జ్రియా ఫహద్ తెలుగులో పరిచయం కాబోతుంది. జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతున్న నేపధ్యంలో నాని తండ్రిగా న‌టించిన న‌రేశ్ వి.కె మీడియాతో ప‌లు విశేషాలు పంచుకున్నారు. # మీ కెరీర్‌లో ఎన్నో పాత్ర‌ల‌ను పండించారు. 'అంటే సుందరానికీ` చిత్రంలో మీ పాత్ర ఎంత వైవిధ్యంగా వుండ‌బోతోంది? -ఈ ఎరాలో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా అద్భుత‌మైన పాత్ర‌లు పోషించ‌డం అదృష్టం. నేను పోషించిన తండ్రి పాత్ర‌ల‌కు ఆడ‌పిల్ల‌ల‌నుంచి మంచి ఫాలోయింగ్ వ‌చ్చింది. అ..ఆ., భ‌లేభ‌లేమ‌గాడివోయ్‌, స‌మ్మోహ‌నం వంటి చిత్రాల్లో బెస్ట్ ఫాద‌ర్‌ గా నిలిచాయి. అంటే సుందరానికీ` సినిమాలో నానికీ నాకు మంచి ర్యాపో వుంది. నాని కామెడీ టైమింగ్ చాలా స్పార్క్‌గా వుంటుంది. సెక‌న్‌లో క్యాచ్ చేసేస్తాడు. నేను ఆ స్కూల్ నుంచి వ‌చ్చిన‌వాడిని క‌నుక నాకు తెలుసు. నేను ఇందులో చేసిన ఫాద‌ర్ పాత్ర `ది బెస్ట్‌` అని చెప్ప‌గ‌ల‌ను. దానికి రెండు కార‌ణాలున్నాయి. మొద‌టిది ద‌ర్శ‌కుడు రూపుదిద్దిన విధానం, రెండోది.. నాని, నాకూ మ‌ధ్య కామెడీ టైమింగ్‌. ఎమోష‌న్‌ ను క్యారీ చేస్తూ ఆడియ‌న్స్‌ను న‌వ్వించే పాత్ర. కీల‌క‌మైన పాత్ర ఇది. నానితో ఫాద‌ర్‌ గా, దేవ‌దాసులో బ్రదర్ గా చేశాను. మ‌ళ్ళీ ఫాద‌ర్‌ గా చేశాను. మా ఇద్ద‌రి మ‌ధ్య డిఫ‌రెంట్ ఎమోష‌న్స్ కూడిన‌వి. మేమిద్ద‌రం న‌టిస్తుంటే సెట్లో అంద‌రూ లీన‌మైపోయి ఓన్ చేసుకున్నారు. అలాగే రోహిణి పాత్ర కూడా. త‌ను మంచి న‌టి. ఈ సినిమా త‌ర్వాత నెక్ట్స్ లెవ‌ల్ పాత్ర కోసం నేను ఎదురుచూడాల్సివుంటుంది. నానికి చాలా కాలం త‌ర్వాత హ్యూమ‌ర్ జోన‌ర్ ప‌డ‌డం అదృష్టం. # మైత్రీ మూవీస్ నిర్మాణ సంస్థ‌లో ప‌నిచేయ‌డం ఎలా వుంది? - ఈ మ‌ధ్య వ‌రుస‌గా యాక్ష‌న్ సినిమాలు వ‌చ్చాయి. అన్నీ హిట్ అయి తెలుగులో విజ‌య‌ప‌తాకాన్ని ఎగుర‌వేస్తున్నాయి. ఇలాంటి టైమ్‌లో కుటుంబ‌క‌థా చిత్రాలు త‌గ్గాయి. మైత్రీ మూవీ మేకర్స్ మంచి కుటుంబ‌క‌థాచిత్రాల‌కు ఆణిముత్యంలాంటి సంస్థ అని చెప్పొచ్చు. మెమొర‌బుల్ హిట్ అవుతుంది. మైత్రీనుంచి పుష్ప‌, స‌ర్కారువారి పాట ఇలా వ‌ర‌స విజ‌యాల్లో ఈ సినిమా మ‌రోటి అవుతుంది. ముఖ్యంగా మైత్రీ మూవీస్ నిర్మాణ విలువ‌లు, న‌టీన‌టుల‌కు కంఫ‌ర్ట్ ఇస్తారు. వారు మిత‌బాషీయులు. వారు ఎంచుకునే క‌థ‌లు హైల‌ట్ అవుతాయి. అవే వారి విజ‌యానికి నిద‌ర్శ‌నం. # మీరు చాలా పాత్ర‌లు పోషించారు. బ్రాహ్మ‌ణుడి పాత్ర చేయ‌డం ఎలా వుంది? - గ‌తంలో జంథ్యాల గారి సినిమాల్లో బ్రాహ్మ‌ణుడి పాత్ర‌లు చేశాను. ఆ త‌ర్వాత ఇలాంటి పాత్ర ఏదీ చేయ‌లేదు. మొద‌టి లాక్‌డౌన్‌లో వివేక్ ఆత్రేయ‌గారు క‌థ రాసుకున్న‌ప్పుడే నన్ను ఊహించి రాసుకున్నార‌ని చెప్పారు. క‌రోనా విప‌రీతంగా వున్న టైంలో కూడా కుటుంబంలా ఈ సినిమాకు అంద‌రం ప‌నిచేశాం. బ్రాహ్మ‌ణుడి పాత్ర కోసం బ‌రువు త‌గ్గాను. మేకోవ‌ర్ మార్చుకున్నా.శైవ‌త్వం వున్న బ్యాక్‌గ్రౌండ్ కాబ‌ట్టి ఆవిధంగా తీర్చిదిద్దుకున్నాను. నా ఫేస్ నాకే బోర్ కొట్ట‌కూక‌డ‌దు. అందుకే మేకోవ‌ర్ చేసుకుంటాను. ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల‌య్యాక నాని, నా కాంబినేష‌న్ అదిరిపోయింద‌ని చాలామంది చెప్పారు. హీరోయిన్ కూడా మ‌ల‌యాళంలో స్టార్‌. త‌ను బాగా చేసింది. # నిజ ‌జీవితంలో మీ కుమారుడితో ఫ్రెండ్లీగా వుంటారు. కానీ ఇందులో నాని మిమ్మ‌ల్ని ఇరిటేట్ చేస్తాడు. ఎలా అనిపించింది? - ఇప్ప‌టి జ‌న‌రేష‌న్‌ లో తండ్రి కొడుకుతో ఫ్రెండ్లీగానే వుండాలి. లేదంటే తేడాలు వ‌చ్చేస్తాయి. ఈ సినిమాలో సాంప్ర‌దాయాలు, క‌ట్టుబాట్లు గ‌ల కుటుంబం క‌నుక చిన్న‌ప్ప‌టినుంచి ఒక ప‌ద్ద‌తిలో నాని పెరిగిన‌వాడు. అలాంటివ్య‌క్తి స్వంత నిర్ణ‌యాలు తీసుకుంటే ఎలా వుంటుంద‌నేది సినిమా. ఇప్ప‌టివ‌రకు పెండ్లిచూపులు, పెండ్లి తంతు వుండేవి. కానీ కాలం మార‌డంతో రివ‌ర్స్ అయింది. అందుకే నాని పాత్ర‌కు ఇప్ప‌టి జ‌న‌రేష‌న్ బాగా క‌నెక్ట్ అవుతారు. రెండు భిన్న‌మైన మ‌న‌స్త‌త్వాలు గ‌ల కుటుంబాల మ‌ధ్య ఏం జ‌రిగింది అనేది ఆస‌క్తిగా వుంటుంది. నేను ఇప్ప‌టివ‌ర‌కు 200కుపైగా సినిమాలు చేశాను. కానీ ఈ సినిమాలో బ్రాహ్మ‌ణుని పాత్ర‌కు యాస‌లో డ‌బ్బింగ్ చెప్ప‌డానికి 9రోజులు ప‌ట్టింది. ఇలా ఎప్పుడూ జ‌ర‌గలేదు. ఇదంతా వివేక్ ఆత్రేయ డ్రాఫ్టింగ్ వ‌ల్లే. ఆయ‌న‌కు మంచి క్లారిటీ వుంది. # ట్రైల‌ర్లో మూలిక‌లు సీన్ బాగా వ‌ర్క‌వుట్ అయిందే? - ఆ సీన్ చేసేట‌ప్పుడు సెట్లో అంద‌రూ న‌వ్వేశారు. నేను న‌వ్వు ఆపుకోలేక‌పోయాను. దాంతో మూడు టేక్‌లు చేయాల్సివ‌చ్చింది. నాదేకాదు అన్ని పాత్ర‌లు అలానే చేశాయి. న‌దియా, పెరుమాళ్ళు పాత్ర‌లు బాగా వ‌చ్చాయి. వేరియేష‌న్స్ అద్భుతంగా చిత్రీక‌రించారు. ఈ చిత్రం ఆల్ క‌మ్యూనిటీ అండ్ ఆల్ లాంగ్వేజ్ ఫిలిం అని చెప్ప‌వ‌చ్చు. # కులాలు అనేది సున్నిత‌మైన అంశం దాన్ని ఎలా బ్యాలన్స్ చేశారు? - ఆ క్రెడిట్ అంతా ద‌ర్శ‌కుడు వివేక్‌దే. ఏ ఒక్క క‌మ్యూనిటీని నొప్పించ‌కుండా చేయ‌డం అనేది గ్రేట్‌. ఈ సినిమా చూస్తే రెండు క‌మ్యూనిటీవారు ఎంజాయ్ చేస్తారు. ఈరోజుల్లో కులాలు, మ‌తాలు, ఖండాంత‌రాలు దాటి పెండ్లిళ్లు జ‌రుగుతున్నాయి. క‌నుక ఇది నేటి జ‌న‌రేష‌న్‌ కు ఫ‌ర్‌ ఫెక్ట్ ఫిలిం. ఒకప్పటి పెండ్లి తంతులు దూర‌మ‌యి స‌హ‌జీవ‌నం వచ్చేస్తున్నాయ్. ఇక ఈ సినిమాకు నికేత్ బొమ్మి కెమెరా నైపుణ్యం అద్భుతంగా వుంది. మొత్తంగా చెప్పాలంటే ఈ సినిమా 16 కూరల తెలుగు కంచం. # ఈ చిత్రాన్ని మ‌రోచ‌రిత్ర‌, సీతాకోక‌చిలుతో పోల్చ‌వ‌చ్చా? - అలా చెప్ప‌లేం. అవి వేరే సినిమాలు ఇది వేరే సినిమా. న‌టుడిగా నాకు తృప్తినిచ్చిన సినిమా. నా కెరీర్‌ ను త‌ర్వాత స్థాయికి తీసుకెళ్ళే సినిమా అవుతుంది. # ఈ మ‌ధ్య కామెడీ చిత్రాలు ఎక్కువయ్యాయి. వాటి గురించి మీ విశ్లేష‌ణ‌? - కామెడీ సినిమాలు గ‌తంలో జంథ్యాల‌, వంశీ, రేలంగి న‌ర‌సింహారావు చిత్రాలు వ‌చ్చాయి. ఇవాళ నేటి ఆడియ‌న్స్ ప‌ల్స్ బ‌ట్టి సినిమాలు తీస్తున్నారు. అప్ప‌ట్లో తెలుగు సినిమాకు ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు ఒక్క‌రే. దానివ‌ల్ల మంచి సినిమాలు వ‌చ్చేవి. ద‌ర్శ‌కుడు, ర‌చ‌యిత వేరు వేరు అయితే స‌రిగ్గా తీయ‌డం క‌ష్టం. మ‌ర‌లా ఇప్పుడు పాత రోజులు మాదిరే ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు ఒక్క‌రే అయ్యేలా యంగ్ ద‌ర్శ‌కులు రావ‌డం ఆనందంగా వుంది. అయితే కామెడీ సినిమాలు రాయ‌డం క‌ష్టం. తీయ‌డం మ‌రీ క‌ష్టం. న‌టీన‌టులు కుద‌ర‌డం మ‌రింత క‌ష్టం. ఈ సినిమాలో అన్ని భాష‌ల న‌టీన‌టులున్నారు. వారంతా టైమింగ్ వున్న వారే. నా మ‌ద‌ర్‌ గా భిక్షు గారి భార్య న‌టించింది. త‌ను బాగా న‌టించింది. ఏది ఏమైనా ఒక సినిమా హిట్ అయితే వ‌ర‌స‌గా కొద్దికాలం అవే వ‌స్తుంటాయి. మారుతీ ద‌ర్శ‌క‌త్వం లో ప్రేమ‌క‌థా చిత్రం వ‌చ్చాక హార‌ర్ కామెడీ వ‌రుస‌గా వ‌చ్చాయి. # కొత్త సినిమాలు? - నేను లీడ్ రోల్స్‌గా రెండు సినిమాలు చేస్తున్నాను. 38 ఏళ్ళ పాత్ర కూడా చేస్తున్నా. # కామెడీ సినిమాలంటే న‌టీన‌టులు ఎక్కువ‌గా వుంటారు. సీనియ‌ర్‌గా మీకు మిగ‌తా వారి స‌పోర్ట్ ఎలా వుంటుంది? - జ‌న‌ర‌ల్‌ గా నేను ఎవ‌రికీ క్లాస్ పీక‌ను. కొత్త‌వారైనా పాత‌వారైనా నాకు కంఫ‌ర్ట్ జోన్ ఇస్తారు. ఒక‌రినొక‌రు ఓవ‌ర్ టేక్ చేయ‌డం వుండ‌దు. నేను ద‌ర్శ‌కుడి న‌టుడ్ని. న‌టించ‌డం కంటే ప్ర‌వ‌ర్తిస్తాను. అదే మా అమ్మ‌గారు చెప్పారు. అదే ఫాలో అవుతున్నా. న‌టుడికి బాడీలాంగ్వేజ్ వున్న‌ట్లే ద‌ర్శ‌కుడికి కంట్రోల్ వుండాలి. అది వివేక్‌ లో బాగా వుంది. నేను ఇంత‌కుముందు మ‌హాన‌టి, శ్రీ‌దేవిసోడాసెంట‌ర్‌.. ఇలా ఎన్ని పాత్ర‌లు చేసినా అవ‌న్నీ ద‌ర్శ‌కుల క్రియేష‌న్‌. # న‌టుడిగా మీ నెక్ట్ లెవ‌ల్ ఎలా వుండ‌బోతోంది? - నేను శ్రీ‌వారికి ప్రేమ‌లేఖ‌, జంబ‌లకిడిపంబ‌.. ఇలా భిన్న‌మైన జోనర్స్ చేశాను. మ‌ధ్య‌లో రాజ‌కీయాల్లోకి వెళ్ళాను. తిరిగి వ‌చ్చాక ఎలాంటి పాత్ర‌లు న‌రేశ్ చేస్తాడో అనే అనుమానం చాలా మందిలో వుంది. ఆ టైంలో దృశ్యం, చంద‌మామ‌క‌థ‌లు చిత్రాల్లో మంచి పాత్ర‌లు వ‌చ్చాయి. మీరు ఏ పాత్ర‌నైనా చేయ‌గ‌ల‌రు అనే స్థాయికి వెళ్ళ‌గ‌లిగాను అంటే గ‌ర్వంగా వుంది. # సెకండ్ ఇన్నింగ్స్‌ లో ఇమ‌డ‌డానికి ఎంత‌కాలం ప‌ట్టింది? - నేను సెకండ్ ఇన్నింగ్స్‌లో రావ‌డానికి ఎస్‌.వి. రంగారావును స్పూర్తిగా తీసుకున్నాను. ఆయ‌న మెప్పించ‌ని పాత్ర లేదు. అలా న‌న్ను నేను సెట్ చేసుకోవ‌డానికి ప‌దేళ్ళు ప‌ట్టింది. తెలుగులో మంచి పాత్ర‌లు రావ‌డం అదృష్టంగా భావిస్తున్నాను. చిన్న సినిమాల‌కు రెమ్యున‌రేష‌న్ చూడ‌కుండా మంచి పాత్ర అనిపిస్తే చేస్తున్నాను. నేను సినీ కుటుంబం నుంచి వ‌చ్చాను కాబ‌ట్టి నిర్మాత సాధ‌క బాధ‌లు తెలుసు.

నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అంటే సుందరానికీ`. ఈ చిత్రం ట్రైల‌ర్ విడుద‌ల‌య్యాక భారీ అంచనాలు నెలకొన్నాయి. న‌జ్రియా ఫహద్ తెలుగులో పరిచయం కాబోతుంది. జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతున్న నేపధ్యంలో నాని తండ్రిగా న‌టించిన న‌రేశ్ వి.కె మీడియాతో ప‌లు విశేషాలు పంచుకున్నారు. # మీ కెరీర్‌లో ఎన్నో పాత్ర‌ల‌ను పండించారు. ‘అంటే సుందరానికీ` చిత్రంలో మీ పాత్ర ఎంత వైవిధ్యంగా వుండ‌బోతోంది? -ఈ ఎరాలో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా అద్భుత‌మైన పాత్ర‌లు పోషించ‌డం అదృష్టం. నేను పోషించిన తండ్రి పాత్ర‌ల‌కు ఆడ‌పిల్ల‌ల‌నుంచి మంచి ఫాలోయింగ్ వ‌చ్చింది. అ..ఆ., భ‌లేభ‌లేమ‌గాడివోయ్‌, స‌మ్మోహ‌నం వంటి చిత్రాల్లో బెస్ట్ ఫాద‌ర్‌…

‘మాయా పేటిక’ టైటిల్ లుక్ విడుదల చేసిన రానా దగ్గుబాటి

‘మాయా పేటిక’ టైటిల్ లుక్ విడుదల చేసిన రానా దగ్గుబాటి

జ‌స్ట్ ఆర్టిన‌ర్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నెం.2 మూవీగా రూపొందుతోన్న చిత్రం ‘మాయా పేటిక’. ఈ సినిమా టైటిల్ లుక్‌ను టాలీవుడ్ హండ్స‌మ్ హంక్ రానా ద‌గ్గుబాటి విడుద‌ల చేశారు. ‘థాంక్యూ బ్రదర్’ వంటి వైవిధ్యమైన చిత్రాన్ని రూపొందిన ఇదే నిర్మాణ సంస్థ‌లో మ‌రో వెరైటీ చిత్రాన్ని ప్రేక్ష‌కుల‌కు అందించ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. ర‌మేష్ రాపార్తి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రానికి మాగుంట శ‌ర‌త్ చంద్రా రెడ్డి, తార‌క్‌నాథ్ బొమ్మి రెడ్డి నిర్మాతలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ సినిమాకు గుణ బాల సుబ్ర‌మ‌ణియ‌మ్ సంగీతాన్ని స‌మ‌కూరుస్తుండ‌గా సురేష్ ర‌గుతు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. కామెడీ, డ్రామా జోన‌ర్‌లో రూపొందుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన ఇత‌ర వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామని మేక‌ర్స్ తెలియ‌జేశారు. సాంకేతిక నిపుణులు : క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం : ర‌మేష్ రాపార్తి నిర్మాత‌లు : మాగుంట శ‌ర‌త్…

నిర్మాతగా ‘గాడ్సే’ వంటి సినిమా చేయడం గర్వంగా ఫీల్ అవుతున్నా : ప్రొడ్యూస‌ర్ సి.క‌ళ్యాణ్‌

నిర్మాతగా ‘గాడ్సే’ వంటి సినిమా చేయడం గర్వంగా ఫీల్ అవుతున్నా : ప్రొడ్యూస‌ర్ సి.క‌ళ్యాణ్‌

వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ తనకంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న వెర్స‌టైల్ హీరో స‌త్య‌దేవ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘గాడ్సే’. గోపి గణేష్ పట్టాభి దర్శకుడు.ఈ చిత్రం జూన్ 17న గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఇంతకు స‌త్య‌దేవ్ – గోపి గ‌ణేష్ కాంబినేషన్‌లో ‘బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌’ వంటి సూప‌ర్ హిట్ మూవీ రూపొందిన సంగ‌తి తెలిసిందే. మ‌రోసారి ఈ హిట్ కాంబో క‌లిసి చేస్తోన్న గాడ్సే చిత్రం ట్రైలర్‌ను గురువారం చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో.. నిర్మాత కె.ఎస్‌.రామారావు మాట్లాడుతూ ‘‘135 కోట్ల మంది ప్రజలున్న ఈ దేశంలో ఈ మ‌ధ్య గాడ్సే గురించి చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. చాలా కాంట్ర‌వ‌ర్సీలు కూడా అవుతున్నాయి. కానీ సి.క‌ళ్యాణ్ నిర్మించిన ఈ గాడ్సే అలాంటి గాడ్సే కాదు. అయితే ఈ సినిమా…