చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘నారీ నారీ నడుమ మురారి’. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రై. లిమిటెడ్‌తో కలిసి అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. జనవరి 14న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. గ్రాండ్ రిలీజ్ ప్రెస్ మీట్ లో డైరెక్టర్ నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. నిర్మాతగా ఇది 16వ సంవత్సరం. జనవరి 14, 2010 నమో వెంకటేశా విడుదలైయింది. యాదృచ్ఛికంగా జనవరి 14న నారీనారీ నడుమ మురారి రిలీజ్ అవుతుంది. సామజవరగమన ఒక మిరాకిల్. కోవిడ్ సమయంలో…
Category: MOVIE REVIEWS
‘మన శంకర వర ప్రసాద్ గారు’ను సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగు ప్రేక్షకులకు థాంక్ యూ సో మచ్. ఈ సక్సెస్ క్రెడిట్ మొత్తం చిరంజీవి గారిదే: మెగా బ్లాక్ బస్టర్ థాంక్ యూ మీట్ లో డైరెక్టర్ అనిల్ రావిపూడి
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి మెగా బ్లాక్ బస్టర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో అలరించారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రంలో నయనతార కథానాయిక నటించారు. శ్రీమతి అర్చన ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేశారు. ప్రిమియర్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం మెగా బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకొని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ మెగా బ్లాక్ బస్టర్ థాంక్ యూ మీట్ నిర్వహించారు. థాంక్ యూ మీట్ లో డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ…
ఘనంగా ‘అనగనగా ఒక రాజు’ ప్రీ రిలీజ్ వేడుక
జనవరి 14న థియేటర్ కి రండి.. మీ అందరికీ పండగ సినిమా అందించే బాధ్యత మాది: కథానాయకుడు నవీన్ పొలిశెట్టి అసలు సిసలైన పండుగ సినిమాగా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం ‘అనగనగా ఒక రాజు’. మూడు వరుస ఘన విజయాలతో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయిక. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. మొదటి నుంచి ప్రచార చిత్రాలలో వైవిధ్యం చూపిస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం.. సంక్రాంతికి వినోదాల విందుని అందించడానికి 2026,…
వరల్డ్ వైడ్ గా ‘రాజాసాబ్’కు 201 కోట్ల గ్రాస్ వసూళ్లు
టాలీవుడ్ సంక్రాంతి పండుగ సీజన్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంటోంది రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాజా సాబ్’. ఈ సినిమా విడుదలైన 4 రోజుల్లో 201 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను వరల్డ్ వైడ్ సొంతం చేసుకుంది. 200 కోట్ల రూపాయల మార్క్ ను కేవలం నాలుగు రోజుల్లో అందుకోవడం “రాజా సాబ్” సినిమా జెన్యూన్ సక్సెస్ కు నిదర్శనంగా నిలుస్తోంది. ఫ్యామిలీ ఆడియెన్స్, పిల్లలు మూవీని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. రీసెంట్ గా యాడ్ చేసిన రాజా సాబ్ ఓల్డ్ గెటప్ సీన్స్ కు కూడా సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. వర్సటైల్ పర్ ఫార్మెన్స్ తో ప్రభాస్ చేసిన వన్ మ్యాన్ షో, హారర్ ఫాంటసీ జానర్ లో ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేసిన డైరెక్టర్ మారుతి టేకింగ్.…
మన పండగ, మన ఎంటర్‌టైన్‌మెంట్, మన తెలుగు జీ5.. సంక్రాంతి పండుగ సంబరాల క్యాంపెయిన్‌ను ప్రారంభించిన రాకింగ్ స్టార్ మంచు మనోజ్
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ నటించిన బ్రాండ్ ఫిల్మ్‌ను తెలుగు జీ 5 ఆవిష్కరించింది. సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు ప్రేక్షకుల కోసం దీన్ని రూపొందించారు. ఇందులో సంక్రాంతి పండుగ ఆత్మీయత అంతా ఘనంగా ప్రతిబింబిస్తోంది. అలాగే నిజంగా తెలుగు ప్రేక్షకులకు తిరుగులేని ఎంటర్‌టైన్మెంట్‌ను అందిస్తామనే జీ5 హామీ మరింత ప్రస్పుటంగా కనిపిస్తోంది. ‘మన పండగ, మన ఎంటర్‌టైన్‌మెంట్, మన తెలుగు జీ5’ అనే కమ్యూనికేషన్ లైన్‌తో రూపొందిన ఈ క్యాంపెయిన్, ప్రాంతీయ సంస్కృతి, ప్రేక్షకులతో జీ5కి ఉన్న గాఢమైన అనుబంధాన్ని తెలియజేస్తోంది.సంక్రాంతి సంబరాల మధ్య తెలుగు ప్రేక్షకులకు తిరుగులేని వినోదాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ బ్రాండ్ ఫిల్మ్‌ను రూపొందించినట్లు మేకర్స్ తెలిపారు. సంక్రాంతి సందర్భంగా రూపొందించిన సంప్రదాయ గ్రామీణ మండువ ఇంటి సెట్‌లో రూపొందించిన ఈ బ్రాండ్ ఫిల్మ్.. పండుగ సందర్భంలో కుటుంబ సభ్యుల మధ్య…
పవన్ కళ్యాణ్ : జపనీస్ మార్షల్ ఆర్ట్స్‌లో చారిత్రాత్మక ప్రపంచ గుర్తింపు
పవన్ కళ్యాణ్ బహుముఖ ప్రజ్ఞాశాలి. సినీ రంగంలో నటుడిగా చెరగని ముద్ర వేశారు. నటుడిగా మాత్రమే కాకుండా రచయితగా, దర్శకుడిగా, స్టంట్ కోఆర్డినేటర్ గా, కొరియోగ్రాఫర్ గా, గాయకుడిగా ఇలా పలు విభాగాల్లో తన ప్రతిభను చాటుకున్నారు. అలాగే రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ, ప్రజా నాయకుడిగా మన్ననలు పొందుతున్నారు. మార్షల్ ఆర్ట్స్ లోనూ ప్రావీణ్యులైన పవన్ కళ్యాణ్, ఓ అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్నారు. ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ అయిన ‘కెంజుట్సు’లో అధికారికంగా ప్రవేశం పొందడం ద్వారా ఒక గొప్ప అంతర్జాతీయ గౌరవాన్ని సాధించారు. మూడు దశాబ్దాలకు పైగా ఆయన క్రమశిక్షణతో సాగించిన సాధన, పరిశోధన, మార్షల్ ఆర్ట్స్ పట్ల ఉన్న అంకితభావానికి నిదర్శనంగా ఈ అరుదైన ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. సినిమాలు, రాజకీయాల్లోకి ప్రవేశించకముందే…
‘నారి నారి నడుమ మురారి’ హిలేరియస్ ట్రైలర్
చార్మింగ్ స్టార్ శర్వా పర్ఫెక్ట్ సంక్రాంతి ఎంటర్‌టైనర్ ‘నారి నారి నడుమ మురారి’తో అలరించబోతున్నారు. ఈనెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది. ‘సామజవరగమన’ ఫేమ్ కామెడీ మాస్ట్రో రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం టీజర్, మొదటి రెండు పాటల ద్వారా భారీ అంచనాలను పెంచింది. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్ర ట్రైలర్ ఈరోజు విడుదలైంది. ట్రైలర్ లో గౌతమ్(శర్వా) బి-టెక్ ఆర్కిటెక్ట్, తన గర్ల్ ఫ్రెండ్ (సాక్షి వైద్య)తో సాఫీగా సాగుతున్న అతడి జీవితం, ఒక్కసారిగా అతడి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ (సంయుక్త) తిరిగి జీవితంలోకి రావడంతో గందరగోళంగా మారుతుంది. అక్కడి నుంచి మొదలయ్యే హిలేరియస్ పరిస్థితులు, గౌతమ్ పాస్ట్ అండ్ ప్రజెంట్ మధ్య నలిగిపోవడం ప్రేక్షకులకి నవ్వులు పంచాయి.…
‘రాజా సాబ్’కు 183 కోట్ల గ్రాస్ వసూళ్లు
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాజా సాబ్’ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ జర్నీ కంటిన్యూ చేస్తోంది. ఈ సినిమా 3 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 183 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. రెండో రోజు మించిన కలెక్షన్స్ డే 3 దక్కించుకుందీ ప్రెస్టీజియస్ మూవీ. హారర్ ఫాంటసీ జానర్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా “రాజా సాబ్” నిలుస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ అందించేలా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు మారుతి. పీపుల్ మీడియా ఫ్యాక్టర్ బ్యానర్ పై గ్లోబల్ సినిమా స్థాయిలో గ్రాండ్ గా మూవీని నిర్మించారు ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ తమ పర్ ఫార్మెన్స్ లు, అందంతో ఆకట్టుకున్నారు.…
మన శంకర వర ప్రసాద్ గారు మూవీ రివ్యూ : అలరించే ఎంటర్‌టైనర్!
By -నవీన్ కుమార్ చెన్నం శెట్టి మెగాస్టార్ చిరంజీవి మూడేళ్ళ విరామం తర్వాత ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. చివరగా ఆయన ‘భోళాశంకర్’ చిత్రంలో నటించారు. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత ఫాంటసీ సినిమా ‘విశ్వంభర’ చేశారు. అనేక కారణాలతో ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలో అనూహ్యంగా ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన `మన శంకర వర ప్రసాద్ గారు’ తెరమీదకు వచ్చింది. ఇందులో వెంకటేష్ కీలక పాత్రలో సర్‌ప్రైజ్ చేయడం విశేషం. నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని శ్రీమతి అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించారు. సంక్రాంతి పండుగని పురస్కరించుకుని ఈ నెల 12న సోమవారం…
MBU, SVISలో 100% స్పోర్ట్స్ స్కాలర్‌షిప్‌లను ప్రకటించిన విష్ణు మంచు.. భారతదేశ భవిష్యత్ ఒలింపియన్లను నిర్మించే దిశగా ముందడుగు
భారతదేశంలో క్రీడా ప్రతిభను పెంపొందించే లక్ష్యంతో మా (MAA- మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) అధ్యక్షుడు, డైనమిక్ స్టార్ విష్ణు మంచు ఈరోజు (శనివారం) మోహన్ బాబు విశ్వవిద్యాలయం (MBU), శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్ (SVIS)లలో 100% స్పోర్ట్స్ స్కాలర్‌షిప్‌లను ప్రకటించారు. 2026–27 విద్యా సంవత్సరం నుండి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం అసాధారణ సామర్థ్యం ఉన్న యువ అథ్లెట్లకు పూర్తి మద్దతును అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రతిష్టాత్మక స్కాలర్‌షిప్ కార్యక్రమం మూడు ప్రధాన క్రీడా విభాగాలతో -క్రికెట్, బాస్కెట్‌బాల్, బ్యాడ్మింటన్ లతో ప్రారంభమవుతుంది. ఈ ప్రకటనతో ఎంపిక చేయబడిన విద్యార్థులు విద్యావేత్తలు, ప్రొఫెషనల్ కోచింగ్, పోషకాహారం, శిక్షణ సౌకర్యాలు, వసతిని కవర్ చేస్తూ పూర్తి మద్దతు పొందుతారు. ఈ సంస్థలు భారతదేశం, విదేశాల నుండి అగ్రశ్రేణి కోచ్‌లతో పని చేయనున్నాయి. అథ్లెట్లకు ప్రపంచ స్థాయి మార్గదర్శకత్వాన్ని…
