మేనేజర్ తో విబేధాలు లేవు, ఇకపై విడిగా కెరీర్ సాగిస్తాం : హీరోయిన్ రష్మిక మందన్న

Rashmika Mandanna, manager clarify on rumors .

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తన మేనేజర్ తో ఇక కలిసి పనిచేయడం లేదనే విషయంపై మీడియాలో పలు కథనాలు వెలువడుతున్నాయి. మేనేజర్ తో విబేధాల కారణంగానే రష్మిక ఆయనతో వర్క్ చేయడం లేదంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రూమర్స్ పై స్పందించింది రష్మిక. తాము విడిగా పని చేయాలని నిర్ణయించుకోవడం వెనక ఎలాంటి గొడవలు లేవని తెలిపింది. ఆరోగ్యకర వాతావరణంలో కలిసి పనిచేశాం. పరస్పర ఒప్పందంతో విడిగా కెరీర్ లో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం. ప్రొఫెషనల్ గా ఉండే వాళ్లం కాబట్టి అలాగే కలిసి వర్క్ చేశాం. ఇప్పుడు అంతే హుందాగా విడిగా పని చేయాలని అనుకుంటున్నాం అని రష్మిక, ఆమె మేనేజర్ తాజా ప్రకటనలో తెలిపారు.

MAA’S HISTORIC TIE-UP WITH BOLLYWOOD ARTISTS’ ASSOCIATION

MAA'S HISTORIC TIE-UP WITH BOLLYWOOD ARTISTS' ASSOCIATION

HYDERABAD, JUNE 22: The three-decade-old saga of the Movie Artists Association (MAA) has reached a milestone by entering into a historic tie-up with the Bollywood Artists Association thanks to the concerted efforts of the MAA president, Vishnu Manchu. Vishnu Manchu has started the mission of uniting all the film industries of India. Tamil/ Kannada/ Malayalam/ Hindi industries have come forward agreeing to the proposal Vishnu has proposed. In lieu of this, MAA and Cinetaa(Hindi Film and TV Association) have signed a pact. The pact will usher in a new wave…

‘మా’తో చేతులు కలిపిన బాలీవుడ్ ఆర్టిస్ట్ అసోసియేషన్!

MAA'S HISTORIC TIE-UP WITH BOLLYWOOD ARTISTS' ASSOCIATION

మూడు దశాబ్దాల చరిత్ర కలిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఇప్పుడు సరికొత్త మైలురాయిని చేరుకుంది. భారతదేశంలోని అన్ని చిత్ర పరిశ్రమలను ఏకం చేసే మిషన్‌ను విష్ణు మంచు ప్రారంభించారు. అందులో భాగంగా మా ప్రెసిడెంట్ విష్ణు మంచు మరియు కోశాధికారి శివ బాలాజీ కలిసి జూన్ 17న ముంబై వెళ్లి బాలీవుడ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళతో కలిసి రెండు అసోసియేషన్ లు కలిసికట్టుగా ఉండాలి అనే ప్రతిపాదన ఉంచారు. దానికి హిందీ పరిశ్రమ అంగీకారం తెలిపింది. “మా” (MAA), Cinetaa (హిందీ చలనచిత్రం మరియు TV అసోసియేషన్) ఒక ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందం తెలుగు చిత్ర పరిశ్రమలోని కళాకారులు, బాలీవుడ్ సోదరుల మధ్య సోదరభావానికి నాంది పలుకుతుంది. ఈ సందర్భంగా మా ప్రెసిడెంట్ విష్ణు మంచు మాట్లాడుతూ “మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మరియు…

జూలై 7న పాన్‌ ఇండియా స్థాయిలో UFO మూవీస్ ద్వారా ‘ఓసాథియా’ విడుదల

జూలై 7న పాన్‌ ఇండియా స్థాయిలో UFO మూవీస్ ద్వారా 'ఓసాథియా' విడుదల

ప్రేమ కథల్లో కొత్త కోణం తీసుకొని నేటితరం ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా సరికొత్త ప్రేమకథగా రూపొందించిన చిత్రం ‘ఓ సాథియా’. ఆర్యన్‌గౌరా, మిస్టీ చక్రవర్తి జంటగా నటించిన ఈ చిత్రాన్ని తన్వికా–జశ్వికా క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కించారు. ఈ మూవీతో దివ్య భావన దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. చందన కట్టా, సుభాష్‌ కట్టా నిర్మాతలుగా వ్యవహరించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జూలై 7న పాన్‌ ఇండియా లెవెల్‌లో భారీగా విడుదల కాబోతోంది. ఓ సాథియా చిత్రం విడుదల తేది ప్రకటించిన తర్వాత నిర్మాత సుభాష్‌ మాట్లాడుతూ.. చిన్న సినిమా అయినా పెద్ద బ్యాక్‌అప్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో సినిమా విడుదల కావడానికి ముఖ్య కారణం UFO మూవీస్ సంస్థ ఏ.పి, తెలంగాణ వైస్‌ ప్రెసిడెంట్‌ జి.లక్ష్మణ్‌ అని చెప్పారు. లక్ష్మణ్ గారు ‘ఓ సాథియా’…

ఈ నెల 23 న ‘మా ఆవారా జిందగీ’ విడుదల

ఈ నెల 23 న 'మా ఆవారా జిందగీ' విడుదల

బయటి లైఫ్ స్టైల్ కు అలవాటు పడిన నలుగురు ఆవారా కుర్రాళ్ళు నాలుగేళ్లు చదవాల్సిన బి.టెక్ ను ఎనిమిదేళ్లు చదివి బయటికి వచ్చిన తరువాత వారికి జాబ్స్ దొరకక ఇంట్లో వారికి సమాధానం చెప్పుకోలేక ఎలాంటి ఇబ్బందులు పడ్డారు.. తమ క్యారెక్టర్స్‌తో ఈ ఆవారా కుర్రోళ్ళు ప్రేక్షకులను ఎలా ఎంటర్‌టైన్ చేశారనే కథాంశంతో తెరకెక్కిన చిత్రమే “మా ఆవారా జిందగీ”. బిగ్ బాస్ శ్రీహాన్, ముక్కు అజయ్, ఢీ చెర్రీ, జస్వంత్, షియాజీ షిండే నటీ నటులుగా దేపా శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో విభా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మాత నంద్యాల మధుసూదన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న 100% ఫన్ 0% లాజిక్ మూవీ “మా ఆవారా జిందగీ. ఈ చిత్రానికి కంభంపాటి విజయ్ కుమార్ సహ నిర్మాతగా వ్యవహరించగా.. ప్రతీక్ నాగ్ సంగీతం అందించారు. అన్ని…

‘లో ఎయిమ్ ఈజ్ ఎ క్రైమ్’ అంటున్న ధీరజ అప్పాజీ!!

'లో ఎయిమ్ ఈజ్ ఎ క్రైమ్' అంటున్న ధీరజ అప్పాజీ!!

సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ – అనలిస్ట్ ధీరజ అప్పాజీ దర్శకత్వంలో అతి త్వరలో సెట్స్ కు వెళ్లనున్న “దొంగముద్దు” వెబ్ సిరీస్ టైటిల్ లోగో విడుదలైంది. ఫిల్మ్ జర్నలిస్ట్ గా తెలుగు చిత్రసీమతో రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుబంధంతోపాటు… 200 పైచిలుకు చిత్రాలకు “పి.ఆర్.ఓ”గా పని చేసిన అనుభవం కలిగిన అప్పాజీ… “దొంగముద్దు” వెబ్ సిరీస్ తో దర్శకుడిగా మారుతున్నారు. ప్రస్తుతం నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుపుకుంటున్న ఈ వెబ్ సిరీస్ పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి!!!

“ది కానిస్టేబుల్” షూటింగ్ లో హీరో వరుణ్ సందేశ్ కు గాయాలు

"ది కానిస్టేబుల్" షూటింగ్ లో హీరో వరుణ్ సందేశ్ కు గాయాలు

వరుణ్ సందేశ్ హీరోగా ‘జాగృతి మూవీ మేకర్’ బ్యానర్ పై నిర్మాణం అవుతున్న చిత్రం ‘కానిస్టేబుల్’ నిన్న చిత్రానికి సంబంధించిన ఫైటింగ్ సీన్ షూటింగ్ సమయంలో హీరో వరుణ్ సందేశ్ కాలికి బలమైన గాయం అయింది. డాక్టర్లు వరుణ్ ని మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా చెప్పారు. దాంతో కానిస్టేబుల్ సినిమా షూటింగ్ అద్దాంతంగా వాయిదా వేయాల్సి వచ్చిందని చిత్ర దర్శకుడు ఆర్యన్ శుభాన్ అన్నారు. పూర్తిగా పల్లెటూరి వాతావరణం లో నిర్మాణం అవుతున్న ఈ చిత్రం ఒక కానిస్టేబుల్ జీవిత కథ చుట్టూ తిరుగుతుందని 40% పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండవ షెడ్యూల్ హీరో వరుణ్ సందేశ్ కోలుకున్న తర్వాత మొదలవుతుందని నిర్మాత బలగం జగదీష్ తెలియజేశారు.

పవన్ కల్యాణ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు : నట్టి కుమార్

పవన్ కల్యాణ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు : నట్టి కుమార్

  ముద్రగడ చేసిన కాపు ఉద్యమాలేవీ సక్సెస్ కాలేదు ముద్రగడ, ద్వారంపూడిల విమర్శలపై ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ ఫైర్ ఏ పార్టీల వారైనా ఒకరినొకరు విమర్శలు చేసుకోవడం సర్వసాధారణమని, అయితే వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లి విమర్శలు చేయడం ఎవరికీ మంచిది కాదని ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ హితవు పలికారు. బుధవారం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏ నాయకులు ఎక్కడికి మీటింగు లకు వెళ్లినా, అక్కడి లోకల్ సమస్యల గురించి మాట్లాడటం సహజం. దానిని బేస్ చేసుకుని కాకినాడలో పవన్ కల్యాణ్ ను బ్యానర్ కట్టనివ్వం. అడుగు పెట్టనివ్వం అంటూ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనడం కరెక్ట్ కాదు. కాకినాడ ఆంధ్ర ప్రదేశ్ లో ఉందా? ఇంక ఎక్కడైనా ఉందా?…

శ్రీవిష్ణు ‘సామజవరగమన’ నుంచి హోలా రే హోలా.. పాట విడుదల!

శ్రీవిష్ణు 'సామజవరగమన' నుంచి హోలా రే హోలా.. పాట విడుదల!

హీరో శ్రీవిష్ణు ‘సామజవరగమన’ తో హిలేరియస్ ఎంటర్ టైమెంట్ అందించడానికి సిద్ధంగా వున్నారు. వివాహ భోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో హాస్య మూవీస్ బ్యానర్‌పై ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి రాజేష్ దండా నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్, ఇతర ప్రమోషనల్ స్టప్ స్ట్రాంగ్ బజ్ ని క్రియేట్ చేసి క్యురియాసిటీ పెంచాయి. అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్న ఈ చిత్రంలో శ్రీవిష్ణు సరసన రెబా మోనికా జాన్ కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి హోలా రే హోలా అనే పాటని విడుదల చేశారు మేకర్స్. గోపీ సుందర్ ఈ పాటని క్యాచి బీట్స్ తో ఆకట్టుకునే మెలోడీలా కంపోజ్ చేశారు. జెవి సుధాన్షు & సోనీ కొమందూరి పాడిన ఈ పాటకు శ్రీమణి అందించిన లిరిక్స్ మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా వున్నాయి. ఈ…

స్టార్ హీరోలు ఆర్య & గౌతమ్ కార్తీక్ హీరోలుగా పాన్ ఇండియన్ మూవీ ‘మిస్టర్ X’ ప్రారంభం

Star actress Manju Warrier comes onboard for the pan Indian movie “Mr. X” starring Arya & Gautham Karthik, written and directed by Manu Anand; produced by Prince Pictures. The film’s Pooja ceremony was conducted today.

స్టార్ హీరోలు ఆర్య & గౌతమ్ కార్తీక్ ప్రధాన పాత్రలో మను ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియన్ మూవీ “మిస్టర్ X. ప్రముఖ నటి మంజు వారియర్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అనఘ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కొన్ని వారాల క్రితం విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ ని అందుకుంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘ఎఫ్‌ఐఆర్’ ఫేమ్ మను ఆనంద్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ప్రిన్స్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌.లక్ష్మణ్‌ కుమార్‌ ఈ భారీ బడ్జెట్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. “మిస్టర్ X” యాక్షన్ సన్నివేశాల్ని భారతదేశం, ఉగాండా, అజర్‌బైజాన్, జార్జియా దేశాల్లో చిత్రీకరిస్తారు. స్టంట్ సిల్వా యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ధిబు నినాన్ థామస్ (మరగధ నానయం,…