ఆలేరు: సామాజిక విలువలను తూ.చ. తప్పకుండా ఆచరించి, ధర్మాన్ని కాపాడేందుకు తన జీవితాన్నే త్యాగం చేసిన మహోన్నత ప్రజా పాలకుడైన సీతారామచంద్రుడు భారతీయుల ఇష్ట దైవమని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మాజీ జెడ్పిటిసి బొట్ల పరమేశ్వర్ కీర్తించారు. ఆలేరు పోచమ్మ గుడి ఆవరణలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతా రామ చంద్ర స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా భక్తిశ్రద్ధలతో జరిగింది. ఆలేరు మాజీ జెడ్పిటిసి బొట్ల పరమేశ్వర్ దంపతులు స్వామివారి కల్యాణం ఘనంగా జరిపించారు. శ్రీరామనవమి సందర్భంగా ప్రజలకు బొట్ల పరమేశ్వర్ దంపతులు శుభాకాంక్షలు తెలిపారు. భద్రాచలంలో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోందన్నారు. లోక కల్యాణం కోసం ఎన్నో త్యాగాలకోర్చిన సీతారాముల బంధం అజరామరమైనది, భవిష్యత్ తరాలకు ఆదర్శనీయమైనదని తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి జనరంజక పాలన సాగించిన గొప్ప ప్రజాపాలకుడు శ్రీరాముడు.…
Category: Lifestyle
జన్మదినోత్సవాలు మధురమైన స్మృతులు : ఫ్రెండ్స్ యూత్ అధ్యక్షులు పూల నాగయ్య
ఓటమి ఎన్నో పాఠాలు నేర్పుతుంది అన్నది ఎంత నిజమో ఒక మంచి స్నేహితుడు కూడా జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పిస్తాడన్నది అంతే నిజం. అలాంటి నా జీవితంలో స్నేహితుల పాత్ర మరపురానిది అన్నారు ఫ్రెండ్స్ యూత్ అధ్యక్షులు పూల నాగయ్య. జె.ఎం.జె వ్యాయామ ఉపాధ్యాయులుగా తునికి రవికుమార్ మంచి మనసున్న వ్యక్తి అని పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఫ్రెండ్స్ క్లబ్ లో జె.ఎం.జె వ్యాయామ ఉపాధ్యాయులు తునికి రవికుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా జరిగిన సమావేశంలో పూల నాగయ్య మాట్లాడుతూ … ప్రతి ఒక్కరి జీవితంలో జన్మదినోత్సవాలు మధురమైన స్మృతులని పేర్కొంటూ ఆ దిశగా వ్యాయామ ఉపాధ్యాయులు కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పుట్టిన రోజుని ఎవరికి వారు తమ జీవితంలో ఒక అత్యంత ముఖ్యమైన రోజుగా భావిస్తారు.…
టీయూడబ్ల్యుజెలో చేరిన చిన్న పత్రికల అసోసియేషన్
-150 మంది ప్రచురణకర్తలు,ఎడిటర్ల చేరిక -ఇక టీయుడబ్ల్యుజెకు అనుబంధంగా కార్యకలాపాలు హైదరాబాద్ : గత కొంతకాలంగా 143 సంఘానికి అనుబంధంగా పనిచేస్తున్న తెలంగాణ చిన్న, మధ్యతరగతి పత్రికలు మరియు మేగజైన్స్ అసోసియేషన్ ఆ సంఘానికి గుడ్ బై చెప్పి తెలంగాణ రాష్ట్రంలో వేలాది జర్నలిస్టులకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యుజె)లో చేరింది. సోమాజిగుడ ప్రెస్ క్లబ్ లో ఇవ్వాళ జరిగిన తెలంగాణ చిన్న, మధ్యతరగతి పత్రికలు మరియు మేగజైన్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని చిన్న, మధ్యతరగతి పత్రికలు నిర్వహిస్తున్న దాదాపు 150మంది ప్రచురణకర్తలు, సంపాదకులు ఐజేయూ అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి, టీయుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీల సమక్షంలో టీయుడబ్ల్యుజె లో చేరారు. దాదాపు అరవై ఏండ్లుగా ఉమ్మడి రాష్ట్రంలో ఏపీయుడబ్ల్యూజే, రాష్ట్ర విభజన…
విప్లవ స్వాప్నికుడు కామ్రేడ్ బండ్రు నరసింహులు || నేల రాలిన ఎర్ర మందారం
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, CPI (ML) జనశక్తి నాయకులు, ప్రజావిమోచన సంపాదకులు కామ్రేడ్ బండ్రు నరసింహులు (104) జనవరి 22,2022న మ. 3 గంటలకు తుది శ్వాస విడిచారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో వారంరోజులుగా హాస్పిటల్ లో చికిత్స పొందిన బండ్రు నరసింహులు స్వస్థతపొంది 21 జనవరి రాత్రి డిశ్చార్జ్ అయ్యారు. ఆక్సిజన్ సహాయంతో బాగ్ అంబర్పేట్ లోనే తన పెద్ద కుమారుడు బండ్రు ప్రభాకర్ వద్ద చికిత్స పొందుతూ కార్డియాక్ అరెస్ట్ తో తనువు చాలించారు. తన పార్థివదేహాన్ని మెడికల్ కాలేజీకి డొనేట్ చేశారు. నిండు నూరేండ్లు బతకమనే పెద్దల దీవేనలన్నీ అపహాస్యమవుతూ రైతాంగపు బలవన్మరణాలు, ఎన్ కౌంటర్ హత్యలు, రాజ్యమేలుతున్న సమయంలో తూటాలు దిగిన శరీరంతో ఏటికి ఎదురీదుతూ నూరెండ్లుగా విప్లవ రాజకీయాలలో కొనసాగడం మామూలు విషయం కాదు. అమరులు వేసిన విప్లవ…
‘రాయల్ పోస్ట్’ న్యూ ఇయర్ 2022 క్యాలెండర్ ఆవిష్కరణ
హైదరాబాద్: సామాజిక, రాజకీయ తెలుగు దినపత్రిక ‘రాయల్ పోస్ట్’ ప్రచురించిన ప్రత్యేక న్యూ ఇయర్-2022 క్యాలెండర్ ఆవిష్కరణ వైభవంగా జరిగింది. గురువారం సాయంత్రం హైదరాబాద్ లోని ప్రెస్ క్లబ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో రాయల్ పోస్ట్ న్యూ ఇయర్ 2022 క్యాలెండర్ ను తెలంగాణ రాష్ట్ర చిన్న, మధ్య తరహా దినపత్రికలు, మరియు మ్యాగజైన్స్ అసోసియేషన్, మైనారిటీ జర్నలిస్ట్స్ ఫ్రంట్ అధ్యక్షులు యూసుఫ్ బాబు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జరిగిన ఆవిష్కరణలో సీనియర్ జర్నలిస్ట్, మైనారిటీ జర్నలిస్ట్స్ ఫ్రంట్ సెక్రటరీ మహమ్మద్ షరీఫ్, సీనియర్ జర్నలిస్ట్, నంది అవార్డు గ్రహీత, టాలీవుడ్ టైమ్స్ ఎడిటర్, మైనారిటీ జర్నలిస్ట్స్ ఫ్రంట్ జాయింట్ సెక్రటరీ ఎం.డి.అబ్దుల్, టీజేయూ స్టేట్ ఎగ్జిక్యూటీవ్ మెంబర్, ‘రాయల్ పోస్ట్’ ఎడిటర్ మహమ్మద్ ఖాజా ఫసియొద్దీన్, జనత టీవి సిఈఓ మహమ్మద్ షానూర్ బాబా,…
Nidhi Agarwal : ‘హీరో’ ఫర్ ఫెక్ట్ పండుగ సినిమా – నిధి అగర్వాల్
అశోక్ గల్లా. నిధి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా `హీరో. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. ఈ చిత్రాన్ని అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీమతి గల్లా పద్మావతి నిర్మించారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా నిధి అగర్వాల్ తో ఇంటర్వ్యూ విశేషాలు… – శ్రీరామ్ ఆదిత్య గారు ఓ సారి కథ చెప్పడానికి పిలిచారు. బయట ఆయన సినిమాల గురించి విన్నాను. ఆయన కథ చెప్పగానే ఆఫ్‌బీట్ సినిమాగా అనిపించింది. అయినా సాంగ్స్ వున్నాయి. కమర్షియల్ అంశాలున్న కథ బిన్నంగా అనిపించింది. – పెద్ద స్టార్స్‌తో నటించినా గల్లా అశోక్ తో నటించడం కష్టం అనిపించలేదు. తను హీరోగా ప్రిపేర్ అయి వున్నాడు. అందుకే నటుడిగా కొత్తవాడనే ఫీల్ నాకు కలగలేదు. – ఇస్మార్ట్…
ఘనంగా వడ్డెమాన్ నరేందర్ జన్మదిన వేడుక
T-Times News- ALER ఆలేరు, జనవరి 9: యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో ఆదివారం సాయంకాలం వడ్డెమాన్ నరేందర్ జన్మదిన వేడుక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో ఫ్రెండ్స్ క్లబ్ అధ్యక్షులు పూల నాగయ్య కేక్ కట్ చేసి శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బి జె పి జిల్లా కార్యదర్శి తునికి దశరథ, తునికి చంద్రశేఖర్, తునికి రవికుమార్, ఆర్.తునికి గణేష్, ఆలేటి చంద్రమౌళి పాల్గొన్నారు ఈ సందర్బంగా ఫ్రెండ్స్ క్లబ్ అధ్యక్షులు పూల నాగయ్య తన శుభాకాంక్షలను అందజేస్తూ.. వడ్డెమాన్ నరేందర్ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, నరేందర్ కు ఆ భగవంతుడు అన్ని విధాలా అష్టఐశ్వర్యాలు ఇవ్వాలని ఆకాంక్షించారు.
సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ కు మిజోరాం గవర్నర్ డా.కంభంపాటి హరిబాబు సత్కారం
విశాఖపట్నం: జర్నలిజంలో అడుగుపెట్టి 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సీనియర్ జర్నలిస్ట్ నేమాల హేమసుందరరావును మిజోరాం గవర్నర్ డా.కంభంపాటి హరిబాబు అభినందించి సత్కరించారు.నెహ్రూ యువ కేంద్ర , శ్రీ గాయత్రి వెల్ఫేర్ కల్చరల్ యూత్ అకాడమీ ,రూపాకుల విశాలాక్షి చారిటబుల్ ట్రస్ట్,ప్రకృతి చికిత్సాలయం సంయుక్త ఆధ్వర్యంలో బీచ్ రోడ్డులోని ప్రకృతి చికిత్సాలయం ఆవరణలో నిర్వహించిన స్వామి వివేకానంద 159వ జయంతి,ఆజాదీ క అమృత్ మహోత్సవ్ సేవా కార్యక్రమాలకు గవర్నర్ హరిబాబు ముఖ్యఅతిథిగా విచ్చేసి స్వామి వివేకానంద చిత్రపటం ముందు జ్యోతి వెలిగించి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. అనంతరం రాజీవగాంధీ మానవ సేవా జాతీయ అవార్డు గ్రహీత రూపాకుల రవికుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కోవిడ్ కష్టకాలంలో వైరస్ సోకిన బాధితులకు తమ ప్రాణాలు సైతం లెక్క చేయక సకాలంలో వైద్య సేవలందించిన వైద్యులకు, పోలీస్ శాఖ ,…
ఓ ఉద్విగ్న వాతావరణం..ఆత్మీయుల నులివెచ్చని స్పర్శ!
● స్వగ్రామం వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో మౌనశ్రీ మల్లిక్ కు పౌర సన్మానం ● నేను రూ.250 ● వర్ధన్నపేట ● హైదరాబాద్ నిన్న మా స్వగ్రామం వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో జరిగిన పౌర సన్మాన కార్యక్రమంలో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. మనసు నిండా చల్లని పొగమంచు ముసురుకుంది. ఆత్మీయుల నులివెచ్చని స్పర్శతో.. ఒక్కసారిగా 25ఏళ్ల ఒంటరి ప్రయాణం కళ్ళముందు కదలాడి సినిమా రీల్ లా గిర్రున తిరిగింది. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన నేను 250 రూపాయలు పట్టుకుని 1997 డిసెంబర్ 24వ తేదీన హైదరాబాదులో దిగాను. సముద్రంలో నీటి బిందువు పడినట్టుగా ఈ మహానగర జనారణ్యంలో అడుగు పెట్టాను. జీవితంలో ఎంత దుఃఖాన్ని భరించానో, అంత ఆనందాన్ని అనుభవించాను. దుఃఖంలో కుదేలు పడింది లేదు. ఆనందంలో కాలర్ ఎగరేసింది లేదు. ఆనంద విషాదాలను సమదృష్టితో…
సామ్రాట్ : ఒక పచ్చని జ్ఞాపకం!
మా హీరో కొడుకు ఎంట్రీ అంటే మాకెంత జోష్ ఉండాలి? అభిమానమంటే అభిమానమే. నాకు సూపర్ స్టార్ కృష్ణ అంటే పిచ్చి అభిమానం. ఎందుకో మరి… చిన్నప్పటి నుంచి ఉన్న ఆ అభిమానాన్ని మాటల్లో చెప్పలేను. ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నదనుకోండి. కృష్ణ వ్యక్తిత్వం కూడా ఈ అభిమానానికి కారణం కావొచ్చు. ఇక అభిమానమంటే ఒక్క ఆ హీరోకే పరిమితం కాదు. ఆ హీరో కుటుంబం నుంచి ఇంకొకరు సినీ ఎంట్రీ ఇస్తే వాళ్ళ మీదా పొంగుకొచ్చే గొప్ప అభిమానమన్నమాట. ఇది నా బాల్యంలో రమేష్ బాబుకూ, ఇప్పుడు మహేష్ కూ వర్తిస్తున్న అభిమానమే. నిన్న రమేష్ బాబు చనిపోయాడనే వార్త చెవిన పడగానే అతడితో అల్లుకున్న ఓ జ్ఞాపకం మళ్ళీ తాజా తాజాగా కదలాడసాగింది. ఈ జ్ఞాపకం జీవితాంతం వదలని జ్ఞాపకాల్లో ఒకటి. రమేష్ బాబు అనగానే…
