విజయవంతంగా టీయుడబ్ల్యూజే జిల్లా మహాసభ : భారీగా తరలివచ్చిన జర్నలిస్టులు

-భారీగా తరలివచ్చిన జర్నలిస్టులు

తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) సంగారెడ్డి జిల్లా ద్వితీయ మహాసభ గురువారం నాడు జిల్లా పరిషత్ హాలులో విజయవంతంగా జరిగింది. జిల్లాలోని సంగారెడ్డి, పటాన్ చెరువు, జహీరాబాద్, ఆందోల్ నియోజకవర్గాల నుండి జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం 11 గంటలకే హాలు కిక్కిరిసిపోవడంతో, 100మందికి పైగా జర్నలిస్టులు హాలు బయట కూర్చొని సమావేశాన్ని తిలకించడం విశేషం. జిల్లా అధ్యక్షులు కే.మల్లికార్జున్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో జిల్లా కార్యదర్శి విష్ణు కుమార్ తన నివేదికను సమర్పించారు. అతిథులుగా రాష్ట్ర హైండ్లూమ్ అభివృద్ధి సంస్థ ఛైర్మెన్ చింత ప్రభాకర్, రాష్ట్ర బేవరేజెస్ కార్పోరేషన్ ఛైర్మెన్ గజ్జెల నాగేష్, జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు, మాజీ ఎమ్యెల్సి ఆర్.సత్యనారాయణ, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయుడబ్ల్యూజే) రాష్ట్ర…

సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఘట్టమనేని ఇందిరాదేవి కన్నుమూత

సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఘట్టమనేని ఇందిరాదేవి కన్నుమూత

సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి శ్రీమతి ఘట్టమనేని ఇందిరాదేవి ఇకలేరు. కొద్దిసేపటి క్రితం ఆమె కన్నుమూశారు. ఇందిరాదేవి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ రోజు (బుధవారం) ఉదయం తొమ్మిది గంటలకు అభిమానుల సందర్శన కోసం ఆమె పార్ధివదేహాన్ని పద్మాలయ స్టూడియోలో ఉంచి అనంతరం మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరపనున్నారు. మహేశ్ బాబు కుటుంబంలో ఒకే ఏడాది రెండు విషాదాలు సూపర్ స్టార్ మహేశ్ బాబు తల్లి ఇందిరాదేవి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆమె ఇంటికే పరిమితమయ్యారు. కొద్దిరోజులుగా ఆరోగ్యం క్షీణించడంతో AIG ఆసుపత్రిలో చేర్చించారు. ఈక్రమంలోనే తెల్లవారుజామున 4 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచారు. కాగా ఈఏడాది జనవరిలోనే మహేశ్ బాబు సోదరుడు రమేశ్ బాబు కూడా అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో ఒకే ఏడాదిలో సూపర్ స్టార్…

30 ఏళ్ల స్నేహం ఓ కుటుంబాన్ని నిలబెట్టింది!

టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన బండ్ల గణేష్-శివాజీ రాజాల మంచి మనసులు

  టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన బండ్ల గణేష్-శివాజీ రాజాల మంచి మనసులు సినీ నటులు బండ్ల గణేష్, శివాజీ రాజా చేసిన పని ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరి 30 ఏళ్ల స్నేహం ఒక కుటుంబాన్ని నిలబెట్టింది. అదేమిటి అనుకుంటున్నారా అసలు విషయం ఏమిటంటే శివాజీ రాజా ప్రస్తుతం ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ కు వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. త్వరలో ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ కు ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో ఆయన మరోసారి వైస్ ప్రెసిడెంట్ గా బరిలోకి దిగేందుకు సిద్ధం అయ్యారు. నిజానికి శివాజీ రాజా ప్రెసిడెంట్ గా ఈసారి బరిలోకి దిగాలని భావించారు. కానీ ప్రెసిడెంట్ గా ఆది శేషగిరి రావు గారు బరిలో దిగుతున్నారని తెలుసుకొని ఆయన మీద గౌరవంతో తిరిగి…

9వ వసంతంలోకి కాదంబరి ‘మనం సైతం’

kaadambari manamsaitha news

ఆపన్నులకు అభయహస్తం, పేదల పెన్నిధి మనం సైతం సేవా సంస్థ 9వ వసంతంలోకి అడుగుపెట్టింది. ప్రముఖ నటుడు, సామాజిక సేవకుడు కాదంబరి కిరణ్ నిర్వహిస్తున్న ఈ సామాజిక సేవా సంస్థ పేదవాడి జీవ నాడిగా నిలుస్తోంది. అపదలో ఉన్న ఎందరినో ఆదుకుంటూ ఆపన్నులను అక్కున చేర్చుకుంటోంది. 24 విభాగాల్లోని కార్మికులతో పాటు సాయం చేయమన్న ప్రతి పేదవారికీ అండగా ఉంటోంది. తిత్లీ, కేరళ తుఫాను వంటి ప్రకృతి విపత్తుల్లోనూ సహాయ కార్యక్రమాల్లో పాల్గొని అక్కడి వారి కోసం విరాళాలు పంపించింది. కరోనా సమయంలో ఉచిత మందులు, ఆక్సీజన్ సిలిండర్లు, నిత్యావసర వస్తువులు, పీపీఈ కిట్లు అందజేసి ఆపత్కాలంలో ఆదుకున్నారు. అహర్నిశలు పేదలకు సేవ చేస్తున్న కాదంబరి కిరణ్ కృషిని చిత్ర పరిశ్రమ దిగ్గజాలైన సూపర్ స్టార్ కృష్ణ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, పవర్ స్టార్ పవన్…

డాక్టర్ ఎన్టీఆర్ మెడికల్ హెల్త్ యూనివర్సిటీ పేరును తొలిగించొద్దు : నందమూరి రామకృష్ణ

డాక్టర్ ఎన్టీఆర్ మెడికల్ హెల్త్ యూనివర్సిటీ పేరును తొలిగించొద్దు : నందమూరి రామకృష్ణ

ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలలో ఉన్న డాక్టర్ ఎన్టీఆర్ మెడికల్ హెల్త్ యూనివర్సిటీ పేరును తొలిగించటం మేము తీవ్రంగా ఖండిస్తున్నామని నందమూరి రామకృష్ణ పేర్కొన్నారు. ఆయన ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ”ఈ యూనివర్సిటీకి మూల కారకుడు, వ్యవస్థాపకుడు మన అన్న స్వర్గీయ నందమూరి తారకరామా రావు గారు. అన్ని మెడికల్ కాలేజీలు ఒకే పాలసీతో నడవాలనేది వారి భావన. ఈ ఉద్దేశముతో 1986లో స్వర్గీయ నందమూరి తారకరామా రావు గారు మెడికల్ హెల్త్ యూనివర్సిటీ స్థాపించారు. దీనికి అందరూ, అన్ని రాజకీయ పార్టీలు, నాయకులు వారి వారి మద్దతుతో హర్షం వ్యక్తం చేశారు. నందమూరి తారకరామా రావు గారు 1996లో స్వర్గస్థులయ్యారు. వారు కాలం చేసిన తరువాత అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ స్థాపించారు కాబట్టి ఎన్టీఆర్ అనే…

ముత్యాలు ‘ఆత్మకథ’ ఆధారంగా ‘సూరీడు’ ప్రారంభం

ముత్యాలు 'ఆత్మకథ' ఆధారంగా 'సూరీడు' ప్రారంభం

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రయోగాత్మక చిత్రాల దర్శకుడుగా పి.సి ఆదిత్యకు పేరుంది. తాజాగా ఆయన దర్శకత్వంలో ‘సూరీడు’ అనే మరో షార్ట్ ఫిలిం రూపుదిద్దుకోబోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన మూహూర్తం షాట్ మంగళవారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి ప్రఖ్యాత దర్శకులు రేలంగి నరసింహారావు హాజరై తొలిక్లాప్ కొట్టారు. బెంగళూరు యూనివర్సిటీ తెలుగు ప్రొఫెసర్ శ్రీమతి ఆశాజ్యోతి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. కాకతీయ యూనివర్సిటీ ప్రిన్సిపాల్ బి. అయిలయ్య తొలిషాట్ కు దర్శకత్వం వహించారు. ఈ సందర్బంగా దర్శకులు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ.. ‘ఓ దళితుడి ఆత్మకథని మినీమూవీగా నిర్మించడం ఈ రోజుల్లో పెద్ద సాహసమే అని చెప్పాలి. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఓ సంచలనం సృష్టిస్తుంది. అంతేకాకుండా, భావితరాలకు ఓ పాఠ్యఅంశంగా నిలిచిపోతుంది అంటూ ఈ సాహసానికి…

10వ ప్లీనరీ ఏర్పాట్లను సమీక్షించిన ఐజేయూ నేతలు

10వ ప్లీనరీ ఏర్పాట్లను సమీక్షించిన ఐజేయూ నేతలు

అక్టోబర్ 29,30,31 తేదీల్లో చెన్నైలో జరగనున్న ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) జాతీయ 10వ ప్లీనరీ సమావేశాల ఏర్పాట్లను సోమవారం నాడు ఐజేయూ నేతలు కే.శ్రీనివాస్ రెడ్డి, బల్విందర్ సింగ్ జమ్ము, ఎస్.ఎన్.సిన్హాలు సమీక్షించారు. ఈ ప్లీనరీకి అతిథ్యమిస్తున్న తమిళనాడు జర్నలిస్ట్స్ యూనియన్(టీజేయు) రాష్ట్ర అధ్యక్షులు డి.ఎస్.ఆర్ సుభాష్, ప్రధాన కార్యదర్శి రమేష్, పాండిచ్ఛేరి రాష్ట్ర జర్నలిస్ట్స్ యూనియన్ అధ్యక్షుడు మదిమహారాజతో పాటు ఆ రాష్ట్ర యూనియన్ ప్రధాన బాధ్యులు హాజరై ఏర్పాట్లను వివరించారు. ప్లీనరీలో దేశంలోని దాదాపు 25 రాష్ట్రాల నుండి కౌన్సిల్ సభ్యులు హాజరవుతున్నందున వారు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా సంతృప్తికరమైన ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులకు ఐజేయూ అధ్యక్షులు కే. శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ప్రతినిధులకు వసతి సౌకర్యం, భోజన ఏర్పాట్ల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అలాగే పబ్లిసిటీ, సభాస్థలి, అతిథులు తదితర ఏర్పాట్లను…

పాలమూరు ప్రజలకు సర్వాంగ సుందరంగా సిఎంఆర్ ఫ్యామిలీ మాల్

cme shoping mall

పాలమూరు ప్రజలకు గత 4 సంవత్సరములుగా ఎంతో సుపరిచితమైన సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు 5 అంతస్థులు 5 లక్షల వెరైటీలతో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుని మహానటి కీర్తిసురేష్ మరియు మంత్రివర్యులు వి. శ్రీనివాస్ గౌడ్ గారిచే పున: ప్రారంభోత్సవం జరుపుకున్నది. నాణ్యమైన వస్త్ర, స్వర్ణాభరణాలను ఎప్పటికప్పుడూ సరిక్రొత్తగా కలక్షన్లను పరిచయం చేస్తూ. మార్కెట్ కంటే తక్కువ ధరలకు విక్రయిస్తూ మీ ఆదరాభిమానాలను పొంది మీరు చూపించిన అభిమానం మా ఈ షోరూంను మరింత పెద్దగా మరియు సరికొత్తగా మీకు అంతర్జాతీయ షాపింగ్ అనుభూతిని అందచేయాలని ముందెన్నడూ లేని కలక్షన్లతోపాటు.. మరెవ్వరూ ఇవ్వలేని ఆఫర్లతో మీరు షాపింగ్చేసే ప్రతి వస్త్రాల షాపింగ్పై మీరు ఉచిత బహుమతులు పొందవచ్చునని సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ తెలంగాణ సంస్థ అధినేత శ్రీ అల్లక సత్యనారాయణ తెలిపారు. ఇంతగా మమ్మలని ఆదరిస్తూ, ప్రోత్సహిస్తున్న…

సర్వాంగ సుందరంగా సిఎంఆర్ ఫ్యామిలీ మాల్!

http://tollywoodtimes.in/wp-content/uploads/2022/09/keerthi.jpg

పాలమూరు ప్రజలకు గత 4 సంవత్సరములుగా ఎంతో సుపరిచితమైన సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు 5 అంతస్థులు 5 లక్షల వెరైటీలతో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుని మహానటి కీర్తిసురేష్ మరియు మంత్రివర్యులు వి. శ్రీనివాస్ గౌడ్ గారిచే పున: ప్రారంభోత్సవం జరుపుకున్నది. నాణ్యమైన వస్త్ర, స్వర్ణాభరణాలను ఎప్పటికప్పుడూ సరిక్రొత్తగా కలక్షన్లను పరిచయం చేస్తూ. మార్కెట్ కంటే తక్కువ ధరలకు విక్రయిస్తూ మీ ఆదరాభిమానాలను పొంది మీరు చూపించిన అభిమానం మా ఈ షోరూంను మరింత పెద్దగా మరియు సరికొత్తగా మీకు అంతర్జాతీయ షాపింగ్ అనుభూతిని అందచేయాలని ముందెన్నడూ లేని కలక్షన్లతోపాటు.. మరెవ్వరూ ఇవ్వలేని ఆఫర్లతో మీరు షాపింగ్చేసే ప్రతి వస్త్రాల షాపింగ్పై మీరు ఉచిత బహుమతులు పొందవచ్చునని సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ తెలంగాణ సంస్థ అధినేత శ్రీ అల్లక సత్యనారాయణ తెలిపారు. ఇంతగా మమ్మలని ఆదరిస్తూ, ప్రోత్సహిస్తున్న…

‘బాలు గాడి లవ్ స్టోరీ’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Balugaadi-love-story

శ్రీ ఆకుల భాస్కర్ గారి సమర్పణ లో భామాస్ క్రియేషన్స్ బ్యానర్ పై ఆకుల అఖిల్, ధర్షిక మీనాన్ హీరో హీరోయిన్ గా తొలి సారి తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం అవుతున్నారు.ఇంకా ఈ చిత్రంలో సీనియర్ నటులు చిత్రం శ్రీను గారు, జబర్దస్త్ చిట్టి బాబు గారు మరియు జబర్దస్త్ గడ్డం.నవీన్ గారు కీలక పాత్రలు పోషించారు.యల్. శ్రీనివాస్ తేజ్ ను డైరెక్టర్ గా పరిచయం చేస్తూ శ్రీమతి ఆకుల మంజుల నిర్మిస్తున్న చిత్రం “బాలు గాడి లవ్ స్టోరీ”.ఈ సినిమాకి శ్రీమతి జి .ప్రతిభ,శ్రీమతి అనిత లు సహ నిర్మాతలుగా, ఆకుల సాయి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహారిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా టాకీ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్బంగా చిత్ర యూనిట్ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్…