వెర్స‌టైల్ యాక్ట‌ర్ తిరువీర్ హీరోగా బై 7పి.ఎంప్రొడ‌క్ష‌న్స్, ప‌ప్పెట్ షో ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్స్‌పై కొత్త చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ లాంఛ‌నంగా ప్రారంభం

By 7 PM Productions, Puppet Show Productions project with Thiruveer 'The Great Pre Wedding Show' launched traditionally by Rana Daggubati
Spread the love

వైవిధ్య‌మైన పాత్ర‌లు, సినిమాల‌తో వెర్స‌టైల్ యాక్ట‌ర్‌గా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న తిరువీర్ క‌థానాయ‌కుడిగా కొత్త సినిమా ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ హైదరాబాద్‌లో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. బై 7పి.ఎంప్రొడ‌క్ష‌న్స్, ప‌ప్పెట్ షో ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్‌పై రాహుల్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ అగ‌రం, అష్మితా రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు. క‌మిటీ కుర్రోళ్ళు ఫేమ్ టీనా శ్రావ్య క‌థానాయిక‌. ముహూర్తం స‌న్నివేశానికి రానా ద‌గ్గుబాటి క్లాప్ కొట్టగా, సందీప్ అగ‌రం కెమెరా స్విచ్ ఆన్ చేశారు. రాహుల్ శ్రీనివాస్ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.
ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు సందీప్ అగ‌రం, అష్మితా రెడ్డి మాట్లాడుతూ ‘‘మా ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ సినిమాను స‌పోర్ట్ చేయ‌టానికి ఇక్క‌డ‌కు వ‌చ్చిన రానాగారికి, ఇత‌ర సినీ పెద్ద‌లు, ప్ర‌ముఖులకు మ‌న‌స్ఫూర్తిగా ధ‌న్య‌వాదాల‌ను తెలియ‌జేస్తున్నాను. కామెడీ డ్రామా జోన‌ర్‌లో సినిమాను రూపొందిస్తున్నాం. ద‌ర్శ‌కుడు రాహుల్ శ్రీనివాస్ కొత్త పాయింట్‌తో సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. నవంబర్ 7 నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను స్టార్ట్ చేస్తున్నాం. హీరో తిరువీర్‌గారికి థాంక్స్‌’’ అన్నారు.
ద‌ర్శ‌కుడు రాహుల్ శ్రీనివాస్ మాట్లాడుతూ ‘‘‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ సినిమా కామెడీ డ్రామా మూవీగా అలరించనుంది. నవంబర్ 7 నుంచి ఎస్‌.కోట‌, వైజాగ్ ప్రాంతాల్లో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుప‌బోతున్నాం. అవ‌కాశం ఇచ్చిన హీరో తిరువీర్‌గారికి, నిర్మాత‌లు సందీప్ అగ‌రం, అష్మితారెడ్డిగారికి ధ‌న్య‌వాదాలు’’ అన్నారు.
నటీనటులు: తిరువీర్‌, టీనా శ్రావ్య, రోహ‌న్ రాయ్‌, న‌రేంద్ర త‌దిత‌రులు
సాంకేతిక వ‌ర్గం: నిర్మాత‌లు: స‌ందీప్ అగ‌రం, అష్మితా రెడ్డి, బ్యాన‌ర్స్‌: బై 7పి.ఎంప్రొడ‌క్ష‌న్స్, ప‌ప్పెట్ షో ప్రొడ‌క్ష‌న్స్‌, ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: రాహుల్ శ్రీనివాస్‌, కో ప్రొడ్యూస‌ర్‌: క‌ల్ప‌నా రావ్‌, సినిమాటోగ్ర‌ఫీ: ఎస్‌.సోమ‌శేఖ‌ర్‌, మ్యూజిక్‌: క‌ళ్యాణ్ నాయ‌క్‌, ఎడిట‌ర్‌: న‌రేష్ అడుప‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: ప‌్ర‌జ్ఞ‌య్ కొనిగారి, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: ఫ‌ణి తేజ ముసి, కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: ఆర‌తి విన్న‌కోట‌, ప్రియాంక్ వీర‌బోయిన‌, పి.ఆర్.ఒ: నాయుడు సురేంద్ర కుమార్‌- ఫ‌ణి కందుకూరి (బియాండ్ మీడియా).

Related posts

Leave a Comment