50 రోజులు.. 100 రోజులు.. 150 రోజులు.. 175 రోజులు.. 200 రోజులు.. ఇలాంటి పోస్టర్స్ చూసి ఎన్నాళ్ళయింది? ఒకప్పుడు కనిపించేవి కానీ గత పదేళ్లుగా కనిపించడం లేదు. ఒకప్పుడు తమ హీరో సినిమా ఇన్ని సెంటర్స్‌లో 100 రోజులు ఆడిందంటూ గర్వంగా చెప్పుకునేవాళ్లు అభిమానులు. కానీ ఇప్పుడు అలా కాదు.. మా హీరో సినిమా ఫస్ట్ వీక్‌లో ఇన్ని వందల కోట్లు వసూలు చేసిందని చెప్పుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో ‘అఖండ’ విజయం కనీవినీ ఎరుగని రీతిలో బ్లాక్ బస్టర్ ని కైవసం చేసుకుని చరిత్రని తిరగరాసింది. నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో విజయవిహారం చేసిన యాక్షన్ ఫిల్మ్ ‘అఖండ’. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని సమకూర్చారు. భారీ అంచనాల మధ్య 2021 డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తోంది. తాజాగా ఈ సినిమా నేటితో 50 రోజులు పూర్తి చేసుకుంది. మూడు వారాలు ఆడిందంటే చరిత్రలో నిలిచిపోవడం ఖాయం. ఇలాంటి పరిస్థితుల్లో బాలయ్య ‘అఖండ’ 50 రోజుల పూర్తి చేసుకొని హిస్టరీ రిపీట్ చేసింది. అంతేకాదు ఈ సినిమా 50వ రోజు 103 థియేటర్స్‌లో ప్రదర్శించ బడటం ఒక రికార్డు అని చెప్పాలి. తాజాగా ఈ ‘అఖండ’ చిత్రం రూ. 150 కోట్ల గ్రాస్ క్లబ్‌లో అడుగుపెట్టింది. ఇక నాన్ థియేట్రికల్ కలిపి ఈ సినిమా రూ. 200 క్లబ్బులో ప్రవేశించినట్టు ‘అఖండ’ చిత్ర నిర్మాతలు రూ. 200 క్లబ్‌తో కూడిన పోస్టర్‌ను విడుదల చేశారు. 50 రోజుల మాట వినబడక చాలా రోజులయిపోయింది. 2020 పండగ సినిమాలు ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో’ అతి కష్టమ్మీద 50 రోజులు ఆడాయి. ఆ తర్వాత కరోనా రావడంతో ఆ మాటే గగనం అయిపోయింది. అలాంటిదిప్పుడు ‘అఖండ’ సినిమా 50 రోజుల పండగ జరుపుకుంటోంది. అది చూసి అంతా షాక్ అవుతున్నారు. బాలయ్య మాస్ ఇమేజ్‌కు పొర్లు దండాలు పెడుతున్నారు. 50 రోజులు అనే మాట మరిచిపోయి చాలా రోజులైపోయింది. కానీ ‘అఖండ’ సినిమాతో అది గుర్తు చేసారు బాలయ్య. ఇప్పుడున్న సమయంలో 20 రోజులు థియేటర్స్‌లో కనిపించడమే గొప్ప విషయం అనుకుంటే.. ‘అఖండ’ సినిమా ఏకంగా 50 రోజులు ఆడుతుంది. 49వ రోజు కూడా ఏపీ, తెలంగాణలో ఈ సినిమా రూ. 15 లక్షల షేర్ వసూలు చేసింది. ఈ మధ్య కాలంలో థియేటర్‌కి ఏ సినిమా వచ్చినా పట్టుమని పది రోజులు ఆడితే అదే గొప్ప విషయమని అనుకునే పరిస్థితి నుంచి 50 రోజులు థియేటర్స్‌లో ఉండటం అనేది చిన్న విషయం కాదు. అందులోనూ దాదాపు 24 సెంటర్స్‌లో నేరుగా 50 రోజులు ఆడుతుంది ‘అఖండ’. భారీ అంచనాలతో వచ్చిన అఖండ.. వాటిని నిలుపుకోవడమే కాకుండా అంచనాలకు మించి వసూలు చేసింది. సింహా, లెజెండ్ కంటే ఎక్కువగా అఖండ సినిమా సంచలనం సృష్టించింది. రొటీన్ కథ అంటూనే ఈ సినిమాను ప్రేక్షకులు బాగానే చూసారు. దైవత్వాన్ని జోడించి.. ఎమోషన్ కూడా బాగానే పండించడంతో ఫ్యామిలీ ఆడియన్స్ క్యూ కట్టారు. కరోనా తర్వాత ఓ సినిమా 50 రోజులు పూర్తి చేసుకోవడం మన దేశంలోనే ఒక రికార్డు అనే చెప్పాలి. బాలయ్య కెరీర్‌లోనే ఈ సినిమా అత్యధిక వసూళ్లను రాబట్టింది. ‘పుష్ప’, ‘శ్యామ్ సింగరాయ్’ ఇలా ఏ సినిమాలు వచ్చినా కూడా అఖండ జోరు మాత్రం తగ్గలేదు. ఇప్పుడు బంగార్రాజు వచ్చినా కూడా సంక్రాంతికి సైతం సత్తా చూపిస్తున్నాడు బాలయ్య. చాలా ఏరియాలలో విడుదలైన 49వ రోజు కూడా హౌజ్ ఫుల్ బోర్డులు కనిపించాయి. జనవరి 21న ఈ సినిమా ఓటిటిలో విడుదల కానుంది. హాట్ స్టార్ డిస్నీ దీన్ని భారీ రేటుకు సొంతం చేసుకుంది. ఈ మధ్య కాలంలో 50 రోజుల పాటు ఇలాంటి జోరు చూపించిన సినిమా మరోటి లేదు. కేవలం తెలుగులోనే కాదు.. మొత్తం భారత దేశంలోనే ఈ రికార్డు సాధించిన ఏకైక హీరో బాలయ్య. హైదరాబాద్, గాజువాక, అనకాపల్లి, వైజాగ్, కర్నూల్, పొద్దుటూరు, హిందూపురం, తాటిపాక, ఆదోని, నంద్యాల, ఎమ్మిగనూరు, కోయిలకుంట్ల సహా.. 24 సెంటర్స్‌లో అఖండ 50 రోజులు పూర్తి చేసుకుంది. అన్నట్లు ఈ చిత్రం 54 కోట్ల బిజినెస్ చేస్తే.. ఇప్పటి వరకు రూ. 80 కోట్ల వరకు షేర్ రాబట్టింది. 24 సెంటర్స్‌లో డైరెక్ట్ 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా 50వ రోజు 103 థియేటర్స్‌లో ప్రదర్శించ పడటం అది బాలయ్య ‘అఖండ’ సినిమా విషయంలోనే సాధ్యమైందని చెప్పాలి.
Related posts
-
రాఘవరాజ్ భట్ కు జాతీయ తులసి సమ్మాన్ పురస్కారం
Spread the love ప్రముఖ కథక్ నాట్యగురు రాఘవరాజ్ భట్ కు ప్రతిష్టాత్మక తులసి సమ్మాన్ లభించింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం సాంస్కృతిక శాఖ... -
చివరి వరకు సస్పెన్స్ మెయింటైన్ అవుతూనే ఉంటుంది.. “ఒక పథకం ప్రకారం” దర్శక, నిర్మాత వినోద్ కుమార్ విజయన్
Spread the love సంచలన దర్శకుడు పూరి జగన్నాధ్ సోదరుడు సాయిరామ్ శంకర్ నటించిన సీట్ ఎడ్జ్ సస్పెన్స్ థ్రిల్లర్ “ఒక... -
Oka Pathakam Prakaaram will Maintain Suspense Till The End: Director Vinod Kumar Vijayan
Spread the love Sai Ram Shankar, the younger brother of sensational director Puri Jagannadh, is starring in...