మ్యాస్ట్రో ఇళ‌య రాజా సంగీత సార‌థ్యంలో శ‌ర్మ‌న్ జోషి, శ్రియాశ‌ర‌న్ న‌టించిన చిత్రం ‘మ్యూజిక్ స్కూల్’ షూటింగ్ పూర్తి

మ్యాస్ట్రో ఇళ‌య రాజా సంగీత సార‌థ్యంలో శ‌ర్మ‌న్ జోషి, శ్రియాశ‌ర‌న్ న‌టించిన చిత్రం ‘మ్యూజిక్ స్కూల్’ షూటింగ్ పూర్తి
Spread the love

లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళ‌య రాజా సంగీత సార‌థ్యం వ‌హించిన తాజా చిత్రం ‘మ్యూజిక్ స్కూల్’. తెలుగు, హిందీ భాష‌ల్లో రూపొందుతోన్న ఈ మోస్ట్ అవెయిటెడ్ మూవీపై ప్రారంభం నుంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. హైద‌రాబాద్‌, గోవా స‌హా ప‌లు ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రిపారు. తాజాగా హైద‌రాబాద్‌లో జ‌రిగిన షెడ్యూల్‌తో చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది. ఈ సినిమాలో మొత్తం 11 పాటలున్నాయి. అందులో కేవ‌లం మూడు పాట‌లు కేవ‌లం మ్యూజిక్‌తోనే సాగుతాయి.
సినిమాటోగ్రాఫ‌ర్ కిర‌ణ్ డియోహ‌న్స్ త‌న కెమెరా ప‌నిత‌నంతో విజువ‌ల్స్‌ను గ్రాండ్‌గా తెర‌కెక్కించి సినిమాను నెక్ట్స్ లెవ‌ల్లో తీసుకెళ్లార‌ని రైట‌ర్ – డైరెక్ట‌ర్ పాపారావు బియ్యాల భావిస్తున్నారు. అలాగే శర్మన్ జోషి, శ్రియా శరన్ ప్రాణం పెట్టి తమ నటనతో పాత్రలకు ప్రాణం పోశారని ఆయన తెలిపారు.
ఈ సంద‌ర్భంగా సినిమాటోగ్రాఫ‌ర్ కిర‌ణ్ డియోహ‌న్స్ మాట్లాడుతూ ‘‘సినిమా షూటింగ్ పూర్త‌య్యింది. సినిమా షూటింగ్ స‌మ‌యం ఎంతో స‌ర‌దాగా సాగింది. డైరెక్ట‌ర్ పాపారావుగారితో చేసిన జ‌ర్నీని ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేను. యామిని ఫిలింస్ స‌హా ఎంటైర్ టీమ్‌ను ఎంతో మిస్ అవుతాను. యూనిట్‌కు గుడ్ బై చెప్ప‌డానికి మ‌న‌సు ఒప్ప‌టం లేదు’’ అన్నారు.
ఈ చిత్రంలోని పదకొండు పాటలకు హాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఆడమ్ ముర్రే అలాగే భారతీయ కొరియోగ్రాఫర్లు చిన్ని ప్రకాష్ , రాజు సుందరం కొరియోగ్రఫీ చేశారు. ‘ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్’ నుండి మూడు పాటలు ఉన్నాయి, వీటి రైట్స్‌ను మాత్రం చిత్ర దర్శకుడు పాపారావు తీసుకున్నారు.
శ్రియా శరన్ మాట్లాడుతూ ‘‘‘మ్యూజిక్ స్కూల్’ ఓ అద్భుత‌మైన స్క్రిప్ట్‌. త‌ల్లిగా మారిన త‌ర్వాత ఈ సినిమాలో న‌టించ‌డానికి అంగీక‌రించాను. కాబ‌ట్టి ఈ సినిమా నాకెంతో ప్ర‌త్యేక‌మైనది. నేను చిన్న పాప‌గా ఉన్న‌ప్ప‌టి నుంచి ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్ వింటూ పెరిగాను. ఇప్పుడు వాటిలో కొన్నింటికి మ్యూజిక్ స్కూల్‌లో న‌టించ‌టం అనేది గొప్ప వ‌రంగా భావిస్తున్నాను. అద్భుత‌మైన న‌టీన‌టులు, చిన్న పిల్ల‌లు, టెక్నిక‌ల్ టీమ్‌తో కలిసి ఈ సినిమా కోసం ప‌ని చేశాను. శ‌ర్మ‌న్ జోషిగారికి ప్ర‌త్యేక‌మైన కృత‌జ్ఞ‌త‌లు. ఆయ‌న ఎప్పుడూ నేను న‌వ్వుతూ ఉండేలా చూసుకున్నారు. అలాగే యామిని రావుగారికి ధ‌న్య‌వాదాలు. మా యూనిట్‌కు ఏది అవ‌స‌ర‌మో దాన్ని స‌మ‌యానికి ఏర్పాటు చేయ‌టంలో వారు ఎంతో స‌పోర్ట్ చేస్తూ వ‌చ్చారు. ఓ గొప్ప పాత్ర‌ను క్రియేట్ చేసి అందులో న‌న్ను న‌టింప చేసినందుకు ద‌ర్శ‌కులు పాపారావుగారికి ధ‌న్యవాదాలు. ఆయ‌న తొలి సినిమా ఇది. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న విజ‌న్ ఎంతో గొప్ప‌గా ఉంది. నా క‌ల‌ను నిజం చేసిన కిర‌ణ్‌గారికి థాంక్స్‌. ఈ సినిమా నాకెప్ప‌టికీ గుర్తుండిపోయే సినిమా ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నాను.
శ‌ర్మ‌న్ జోషి మాట్లాడుతూ ‘‘ఈ సినిమా ప్ర‌యాణం నా హృద‌యాన్ని హ‌త్తుకుంది. మ్యూజిక్ స్కూల్ సినిమా ప్ర‌యాణం ముగిసింది. ఈ సినిమాను ఎంజాయ్ చేశాం. ఎన్నో అనుభూతులున్నాయి. వాట‌ని ఇప్పుడు ప్రేక్ష‌కుల‌కు అందించ‌బోతున్నాం. ఓ గొప్ప ప్యాష‌న్‌తో ఎవ‌రూ ఊహించ‌ని విధంగా భారీ స్కేల్‌తో ఇలాంటి అద్భుత‌మైన సినిమా చేసిన ప్యాష‌నేట్ డైరెక్ట‌ర్ పాపారావుగారి నుంచి మ‌రిన్ని గొప్ప చిత్రాలు రావాల‌ని కోరుకుంటున్నాను. ఆయ‌న హ్యాట్సాఫ్‌’’ అన్నారు.
బగ్స్ భార్గవ మాట్లాడుతూ ‘‘మ్యూజిక్ స్కూల్ సినిమా కోసం డైరెక్టర్ పాపారావుగారితో గడిపిన సమయాన్ని మరచిపోలేను. ఆయ‌న మ‌న‌సు పెట్టి ఈ సినిమా చేశారు. చ‌క్క‌టి మేసేజ్‌తో రూపొందిన గొప్ప చిత్రం. మంచి కుటుంబ క‌థా చిత్రం. ఆయ‌న మ‌రింత శ‌క్తిని ఇవ్వాల‌ని దేవుడ్ని కోరుకుంటున్నాను’’ అన్నారు.
ఈ సినిమా చాలా చిన్న పిల్ల‌లు కూడా న‌టించారు. వారంద‌రూ ఈ సినిమాకు పెద్ద ఎసెట్‌. ఆర్ట్ వ‌ర్క్‌ను రాజీవ్ నాయ‌ర్ చేయ‌గా రాగా రెడ్డి కాస్ట్యూమ్స్ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హించారు.
యామిని రావు బియ్యాల మాట్లాడుతూ ‘‘గొప్ప నటీనటులు, సాంకేతిక నిపుణులతో కలిసి చేసిన ప్రయాణమే మ్యూజిక్ స్కూల్ ఈ ప్ర‌యాణం చాలా సంతృప్తి క‌రంగా గొప్ప‌గా అనిపించింది. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేయ‌డం ఎంతో ఆనందంగా ఉంది’’ అన్నారు.
యామిని ఫిలింస్ బ్యానర్ రూపొందించిన ‘మ్యూజిక్ స్కూల్’ చిత్రంలో శ్రియా శరన్, శర్మన్ జోషి, షాన్, ప్రకాష్ రాజ్, లీలా శామ్సన్, సుహాసిని ములే, బెంజిమన్ గిలాని, శ్రీకాంత్ అయ్యంగార్, వినయ్ వర్మ, మోనా అంబేగోనకర్, గ్రేసీ గోస్వామి, ఓజు బారువా, బ‌గ్గ్ భార్గ‌వ‌, మంగ‌ళ భ‌ట్‌, ఫ‌ణి ఎగ్గొట్టి, వ‌కార్ షేర్‌, ప్ర‌వీణ్ గోయెల్‌, ర‌జినీష్ కార్తికేయ‌, రోహ‌న్ రాయ్‌, ఒలివియా చార‌న్‌, వివాన్ జైన్‌, సిద్ధిక్ష‌, ఆధ్య‌, ఖుషి త‌దిత‌రులు న‌టించారు.

Related posts

Leave a Comment