మెగాస్టార్ చిరంజీవి- సల్మాన్ ఖాన్ ‘గాడ్ ఫాదర్’ కోసం ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా కొరియోగ్రఫీలో దద్దరిల్లిపోయే పాట!

Prabhu Deva To Choreograph An Atom Bombing Swinging Song For Megastar Chiranjeevi – Salman Khan For Mohan Raja - Konidela Productions And Super Good Films – Godfather
Spread the love

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 153వ చిత్రం ‘గాడ్ ఫాదర్’ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్త నిర్మాణంలో మోహన్ రాజా దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ చిత్రంతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. టాప్ హీరోయిన్ నయనతార కీలక పాత్రలో నటిస్తుండగా, స్టార్ దర్శకుడు పూరి జగన్నాధ్ అతిధి పాత్రలో కనిపించనున్నారు.
భారీ అంచనాలతో రూపుదిద్దుకుంటున్న గాడ్ ఫాదర్ లో మరో ప్రత్యేకమైన ఆకర్షణ చేరింది. ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా కొరియోగ్రఫీలో చిరంజీవి- సల్మాన్ ఖాన్ పై ఒక ఎలెక్ట్రిఫయింగ్ సాంగ్ ని షూట్ చేయబోతుంది చిత్ర యూనిట్.
ఈ విషయాన్ని గాడ్ ఫాదర్ సంగీత దర్శకుడు మ్యూజికల్ సెన్సేషన్ తమన్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు ” గ్రేట్ న్యూస్. బాస్ చిరంజీవి, సల్మాన్ ఖాన్ కోసం ప్రభుదేవా ఆటమ్ బాంబింగ్ స్వింగింగ్ లాంటి పాటని కోరియోగ్రఫీ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి- సల్మాన్ ఖాన్ కలసి డ్యాన్స్ చేయడం అభిమానులకు ఒక పండగలా వుండబోతుంది” అని ట్వీట్ చేశారు తమన్.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు మోహన్ రాజా, కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో కలసిన ఫోటోని అభిమానులతో పంచుకున్నారు.
శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ చివరి దశలోఉంది. ఈ మెగా చిత్రంలో హీరో సత్యదేవ్ కూడా పూర్తి నిడివి వున్న పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు.
టాప్ టెక్నికల్ టీమ్ గాడ్ ఫాదర్ కోసం పని చేస్తున్నారు. వెటరన్ సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందిస్తుండగా, సంగీత సంచలనం ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ సమకూరుస్తున్నారు. అనేక బాలీవుడ్ హిట్ చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసిన సురేష్ సెల్వరాజన్ ఈ చిత్రానికి ఆర్ట్వర్క్ అందిస్తున్నారు.
ఆర్బి చౌదరి, ఎన్వీ ప్రసాద్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల సురేఖ సమర్పిస్తున్నారు.
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మోహన్ రాజా
నిర్మాతలు: ఆర్.బి చౌదరి, ఎన్వీ ప్రసాద్
సమర్పణ: కొణిదెల సురేఖ
బ్యానర్లు: కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్
సంగీతం: ఎస్ ఎస్ థమన్
డీవోపీ: నీరవ్ షా
ఆర్ట్ డైరెక్టర్: సురేష్ సెల్వరాజన్
ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్: వాకాడ అప్పారావు
పీఆర్వో: వంశీ-శేఖర్

Related posts

Leave a Comment